TE/Prabhupada 0957 - ముహమ్మద్ నేను భగవంతుని సేవకుడిని అని. క్రీస్తు నేను భగవంతుని కుమారుడనని చెప్పినారు

Revision as of 10:11, 4 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0957 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750624 - Conversation - Los Angeles


ముహమ్మద్ అన్నాడు నేను భగవంతుని సేవకుడిని అని. క్రీస్తు నేను భగవంతుని కుమారుడనని చెబుతున్నాడు

ప్రభుపాద: ముహమ్మద్ ఆయన నేను భగవంతుని సేవకుడిని అని చెప్పాడు. క్రీస్తు నేను భగవంతుని కుమారుడనని చెప్పాడు. కృష్ణుడు చెప్పారు, "నేను భగవంతుణ్ణి." కావున తేడా ఎక్కడ ఉంది? కుమారుడు ఇదే చెప్తాడు, సేవకుడు అదే విషయం చెప్తాడు, తండ్రి కూడా అదే విషయం చెప్తాడు. కాబట్టి వేదాంతశాస్త్రం అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడము మరియు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉండటము అని అర్థం. ఇది నా అవగాహన. వేదాంతశాస్త్రం అంటే భగవంతుడు అంటే ఎవరు అని పరిశోధించేది కాదు. దానిని బ్రహ్మజ్ఞానం అంటారు మీరు వేదాంతివాదులు అయితే, మీకు భగవంతుని గురించి తెలిసిఉండాలి ఆయన ఆజ్ఞకు కట్టు బడి ఉండాలి.మీరు డాక్టర్ జుదా ఏమి అనుకుంటారు?

డాక్టర్ జుడా: క్షమించండి? ప్రభుపాద: ఈ ప్రతిపాదన గురించి మీరు ఏమనుకుంటున్నారు?

డాక్టర్ జుడా: అవును, సరే, నేను మీరు చెప్పినది చాలా సరైనది అనుకుంటున్నాను. నేను ఇది అని అనుకుంటున్నాను ... మన కాలంలో, మన రోజులలో మనలో చాలామందికి నిజంగా భగవంతుని గురించి తెలియదు

ప్రభుపాద: అవును. అప్పుడు ఆయన వేదాంతవేత్త కాదు. ఆయన బ్రహ్మజ్ఞాని .

డాక్టర్ జుడా: మాకు భగవంతుని గురించి తెలుసు, కానీ మాకు భగవంతుడు ఎవరో తెలియదు. నేను అంగీకరిస్తాను.

ప్రభుపాద: అప్పుడు ఆ బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానులు, వారు ఏదో ఉన్నతమైనది ఉంది అని ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు ఆ ఉన్నతమైనవారు, వారు శోధిస్తున్నారు. అదే విషయం: ఒక పుత్రుడు, ఆయనకు తెలుసు, "నాకు తండ్రి ఉన్నాడు," కానీ "నా తండ్రి ఎవరు? అది నాకు తెలియదు." ఓహ్ , అది మీరు మీ తల్లిని అడగాలి. అంతే. ఒంటరిగా ఆయనకు అర్థం కాదు. కాబట్టి మన ప్రతిపాదన ఏమిటంటే అది మీకు భగవంతుడు అని తెలియకపోతే, ఇక్కడ భగవంతుడు, కృష్ణుడు ఉన్నాడు, ఎందుకు మీరు ఆయనను అంగీకరించరు? మొదట మీకు తెలియదు. నేను చెప్పితే, "ఇక్కడ భగవంతుడు ఉన్నాడు", అప్పుడు ఎందుకు మీరు అంగీకరించరు? జవాబు ఏమిటి? మేము భగవంతుణ్ణి గురించి ప్రచారము చేస్తున్నాము, "ఇక్కడ భగవంతుడు ఉన్నాడు." గొప్ప, గొప్ప ఆచార్యులు అంగీకరించారు- రామానుజాచార్య, మద్వాచార్య, విష్ణుస్వామి, చైతన్య మహాప్రభు, మా గురు శిష్యుల పరంపరలో నా గురు మహారాజ -మరియు నేను బోధిస్తున్నాము, "ఇది భగవంతుడు." నేను భగవంతుడి గురించి వెర్రిగా ప్రతిపాదించడము లేదు. నేను ఎవరైతే భగవంతుడిగా గుర్తించబడినారో, వారి గురించి ప్రచారము చేస్తున్నాను. కాబట్టి ఎందుకు మీరు అంగీకరించరు? ఇబ్బంది ఏమిటి?

డాక్టర్ జుడా: నేను, పాతతరం లోని చాల మందికి అనేక ఇబ్బందులలో ఇది అని చెప్తాను, మనము జీవితమును కొన్ని మార్గములలో అనుసరిస్తాము,...

ప్రభుపాద: అప్పుడు నీవు భగవంతుడు గురించి తీవ్రముగా లేవు.

డాక్టర్ జుడా: , ఎర్, ఇది మారడము కష్టం. ఇది గొప్ప సమస్య.

ప్రభుపాద: అప్పుడు మీరు తీవ్రముగా లేరు. అందువల్ల కృష్ణుడు చెప్తారు, sarva-dharmān parityaja mām ekaṁ śaraṇaṁ ( BG 18.66)మీరు వదిలివేయాల్సి ఉంటుంది.

డాక్టర్ జుడా: ఇది సరైనది.

ప్రభుపాద: ఎందుకంటే మీరు వదిలివేయడానికి సిద్ధంగా లేకుంటే, మీరు భగవంతుణ్ణి స్వీకరించలేరు.

డాక్టర్ ఓర్ర్: డాక్టర్ క్రాస్లీకి మీరు కొంచము పక్షపాతముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను మీరు చెప్పేది సత్యము, అతి ముఖ్యమైన విషయము మనము చేయగలిగినది ఏమిటంటే, మనము భగవంతుని వెతకటము మరియు తెలుసుకోవడము, కానీ ఇది సరి అయినది అని నేను అనుకోను,ఇది మంచి విషయము కాదు ఇతర వ్యక్తులు లేదా ఇతర వ్యక్తి గురించి అధ్యయనము చేయడము,

ప్రభుపాద: కాదు, నేను ఇది చెడ్డ విషయము అని చెప్పడము లేదు. నేను ఏమి చెప్తున్నాను అంటే, మీరు భగవంతుని గురించి తీవ్రముగా ఉంటే, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు

డాక్టర్ ఓర్: అది ఏమిటి అనేది విశ్వవిద్యాలయంలో ఒక భాగము, వ్యక్తుల ఆలోచనా విధానము, ఎలా ఉన్నది వివిధ విషయములపై అనే దాని మీద అధ్యయనం చేయడము కోసం .

ప్రభుపాద: లేదు, అది సరియైనది. నేను ఇప్పటికే చెప్పాను. మీరు దేని కొరకైనా వెతుకుతూ ఉంటే, మీరు దాన్ని కొంత పొందినట్లయితే, మీరు ఎందుకు అంగీకరించరు?

డాక్టర్ ఓర్ర్: కృష్ణుడు తన తండ్రి అని క్రీస్తు చెప్పినట్లు మీరు నమ్ముతున్నారా?

ప్రభుపాద: పేరు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకు మా దేశములో మేము చెప్తాము, ఈ పువ్వును ఒక పేరుతో ; మీరు మరొక పేరుతో, మరొక పేరుతో. కానీ విషయము ఒకేలా ఉండాలి. పేరు కాదు... మీకు అర్థం అయినట్లుగా, మీరు వేరొక విధముగా చెప్పవచ్చు కానీ భగవంతుడు ఒక్కరే. భగవంతుడు ఇద్దరు కాదు. మీరు ఆయనకు వేర్వేరు పేర్లను ఇవ్వవచ్చు. అది విభిన్నమైన విషయం. కానీ భగవంతుడు ఒక్కరే. భగవంతుడు ఇద్దరు కాదు