TE/Prabhupada 0964 - ఈ లోకములో కృష్ణుడు ఉన్నప్పుడు, ఆయన గోలోక వృందావనములో లేడు. కాదు

Revision as of 14:07, 28 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0964 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720000 - Lecture BG Introduction - Los Angeles


ఈ లోకములో కృష్ణుడు ఉన్నప్పుడు, ఆయన గోలోక వృందావనములో లేడు. కాదు ఈ విశ్వంలో అత్యంత ఉన్నతమైన లోకమును బ్రహ్మలోకము అని అంటారు, అదేవిధముగా ఆధ్యాత్మిక ఆకాశంలో, గోలోక వృందావనము అని పిలువబడే అత్యున్నత లోకములో. ఇది కృష్ణుడి ధామము. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కానీ ఆయన తన వివిధ రకాల శక్తుల ద్వారా తనను తాను విస్తరించుకోగలడు ఆయన వివిధ రకాల అవతారాల ద్వారా. దాని అర్థము ఇది కాదు ఈ లోకము మీద కృష్ణుడు ఉన్నప్పుడు, కృష్ణుడు గోలోకములో లేడు. కాదు. ఇది అలా కాదు ఉదాహరణకు నేను ఇక్కడ ఉన్నాను, నా అపార్ట్మెంట్లో నేను లేను. కృష్ణుడు అలాంటి వాడు కాదు. కృష్ణుడు ప్రతిచోటా ఉండగలడు; ఒకే సమయంలో, ఆయన తన సొంత నివాసంలో ఉండగలడు. ఇది బ్రహ్మ-సంహితలో వివరించబడింది: goloka eva nivasaty akhilātma-bhūtaḥ (BS 5.37). ఆయన తన నివాసంలో ఉన్నప్పటికీ, దానిని గోలోక వృందావనము అని పిలుస్తారు, ఆయన తనకు తాను విస్తరించగలడు, ప్రతి చోట. వాస్తవానికి అతడు చేసాడు. కాబట్టి, ఆయన ఎలా విస్తరించినాడో మనం తెలుసుకోవాలి. ఏ విధముగా ఆయన మనతో సంబంధము కలిగి ఉన్నాడు. అది శాస్త్రము. భగవద్గీతలో, ఈ విషయాలు వివరించబడ్డాయి.

అందువల్ల కృష్ణుడు ఇక్కడ పరంధామగా పిలువబడుచున్నాడు. ప్రతిదీ ఆధారపడే ధామము. ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు కూడా చెప్తాడు mat-sthāni sarva-bhūtāni ( BG 9.4) అంతా, భౌతిక విశ్వము అంతా, ఆయన మీద ఆధారపడి ఉంది. Na cāhaṁ teṣv avasthitaḥ - కానీ నేను అక్కడ లేను. ఈ విరుద్ధమైన విషయాలు. అంతా ఆయన మీద ఆధారపడి ఉంది, కానీ నేను అక్కడ లేను. కానీ అది విరుద్ధమైనది కాదు. ఇది అర్థం చేసుకొనుట చాలా సులభం. ఉదాహరణకు అన్ని లోకములు, అవి సూర్యరశ్మి మీద ఆధారపడి ఉన్నాయి కానీ సూర్యుడు గ్రహాల నుండి దూరంగా ఉన్నారు. కొన్ని లక్షల మైళ్ల దూరములో.. కానీ సూర్యరశ్మి మీద ఆధారపడి ఉన్నాయి అంటే సూర్యుని మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థము. అది సత్యము. అందుచేత కృష్ణుడు చెప్తాడు, mat-sthāni sarva-bhūtāni na cāhaṁ teṣv avasthitaḥ ( BG 9.4) Paraṁ brahma paraṁ dhāma pavitraṁ ( BG 10.12) .. పవిత్రం అంటే కలుషితము లేనిది అని అర్థం. మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు... మనము కూడా ఆత్మ, బ్రహ్మణ్, ఖచ్చితముగా పర బ్రహ్మణ్, కృష్ణుడు కాదు, కానీ అయినప్పటికీ, మనము కృష్ణుడిలో భాగం ఎందుకంటే, మనము కూడా బ్రహ్మణ్. పవిత్రం. పవిత్రం అంటే పవిత్రమైనది. ఉదాహరణకు బంగారం కణాలన్నీ కూడా బంగారం వలె ఉంటాయి. బంగారం పవిత్రమైనది అయితే, అణువు కూడా పవిత్రమైనది.

కాబట్టి కృష్ణుడు ఈ ప్రపంచంలోకి వస్తాడు, మనము కూడా ఈ ప్రపంచంలోకి వస్తున్నాం. కానీ మనము కలుషితమవుతున్నాము. కానీ కృష్ణుడు కలుషితమవ్వడు. ఉదాహరణ ఏమిటంటే, జైలులో వలె, చాలా మంది ఖైదీలు ఉంటారు, కానీ రాజు, లేదా ఎవరైనా రాజు ప్రతినిధి, మంత్రి, పరిస్థితులను పరిశీలించడానికి జైలులోకి వెళ్లితే, పనులు ఎలా జరుగుతున్నాయి, అంటే రాజు లేదా ఆయన మంత్రి కూడా ఖైదీ అని అర్థం కాదు. ఆయన ఖైదీ కాదు. కానీ మనము జీవులము, ప్రకృతి యొక్క ఈ భౌతిక గుణాలలో చిక్కుకున్నాము. కానీ కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క ఈ గుణాలల్లో ఎప్పుడూ చిక్కుకోడు. అందువలన ఆయనను పవిత్రం పరమం అని పిలుస్తారు. సంపూర్ణముగా పవిత్రమైన. భవన్, భవన్ అంటే నీవు, మీ అధికారము. మరియు పురుషం. పురుషం అంటే ఆయన ఒక వ్యక్తిగా సంభోదించబడ్డారు. భగవంతుడు ఎప్పుడూ నిరాకారము కాదు. భగవంతుడు వ్యక్తి. సరిగ్గా మీలాగా మరియు నా లాంటి వ్యక్తి. ఆయన ఈ లోకము మీద అవతరించినప్పుడు, ఖచ్చితముగా ఒక మానవుని వలె, రెండు చేతులు, రెండు కాళ్లతో... మానవుని వలె నడుస్తూ, మాట్లాడుతూ, మానవుడు వలె ప్రవర్తిస్తూ, ప్రతిదీ. కాబట్టి భగవంతుడు పురుషం. పురుషం అంటే పురుషుడు. నేను పురుషుడు అని చెప్తాను. స్త్రీ కాదు. పురుషుడు. పురుషునిగా అవకుండా ఎవరూ ఆనందమును పొందలేరు. మరొక చోట కృష్ణుడు మహోన్నతముగా ఆనందించే వాడు అని చెప్పబడింది. ఆ పదమును ఉపయోగించిన వెంటనే, ఆనందించే వాడు, ఆయన పురుషం అవ్వవలెను, పురుషుడు. కాబట్టి అది వివరించబడింది. అర్జునుడు ఆయనను అర్థం చేసుకున్నాడు. ఆయన ఒక పురుషుడు. పరమ్ పురుషం, మహోన్నతమైన వ్యక్తి. మరొక ప్రదేశంలో కృష్ణుడిని పురుషోత్తమ్ గా వర్ణించబడింది - పురుషులలో అత్యుత్తమమైన వాడు. కావున, పురుషం శాశ్వతము. శాశ్వతము అంటే శాశ్వతమైనది