TE/Prabhupada 0976 - అధిక జనాభా అనే ప్రశ్నే లేదు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0975 - Nous sommes des petits dieux. Extrêmement petit, exemples de dieux|0975|FR/Prabhupada 0977 - Ce corps matériel est coupé en fonction de notre corps spirituel|0977}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0975 - మనము చిన్న భగవంతుళ్ళము. చిన్న, నమూనా భగవంతుళ్ళము|0975|TE/Prabhupada 0977 - ఈ భౌతిక శరీరం మన ఆధ్యాత్మిక శరీరం ప్రకారం తయారు అవుతుంది|0977}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|x7rU6269d6o|అధిక జనాభా అనే ప్రశ్నే లేదు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం  <br/>- Prabhupāda 0976}}
{{youtube_right|-NRvusDl8YE|అధిక జనాభా అనే ప్రశ్నే లేదు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం  <br/>- Prabhupāda 0976}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



Lecture on BG 4.13 -- New York, April 8, 1973


అధిక జనాభా అనే ప్రశ్నే లేదు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం అధిక జనాభా అనే ప్రశ్నే లేదు. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం. భగవంతుడు సృష్టించగలిగితే, ఆయన పోషించగలడు కూడా. నిజానికి, ఇది వాస్తవం. నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నాను. భూగోళం యొక్క ఉపరితలంపై చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి అది, అది ప్రస్తుత జనాభా కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నా నిర్వహించవచ్చు. కానీ మనకు, మనకు అది ఎలా ఉపయోగించాలో తెలియదు. ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, మీ అమెరికాలో, తగినంత భూమి ఇప్పటికీ ఉంది. అయితే, మనము కృష్ణుడి భూమిని ఆక్రమించాము కనుక, అక్కడ కష్టం ఉంది. చైనాలో జనాభా ఎక్కువగా ఉంది. భారతదేశంలో జనాభా అధికంగా ఉంది. అయితే, మనము కృష్ణ చైతన్యముని తీసుకుంటే, ఈ ఇబ్బందులు అన్నీ ఒక్క క్షణంలోనే పోతాయి.

కృష్ణ చైతన్యం అంటే అన్నింటిని కృష్ణుడివి అని తీసుకోవడము. నేను కూడా కృష్ణుడికి చెందుతాను. ఇది కృష్ణ చైతన్యము. వాస్తవానికి, అది సత్యము. ప్రతీది... కృష్ణుడు అంటే భగవంతుడు. ప్రతీది భగవంతునికి చెందుతుంది. నేను కూడా భగవంతునికే చెందుతాను. ఈశావాశ్యమ్ ఇదమ్ సర్వమ్ ( ISO mantra 1) అంతా భగవంతునికి చెందుతుంది. అది సత్యము. కానీ మనము వాస్తవాన్ని అంగీకరించలేదు. మనము ఏదో ఒక భ్రాంతిని కలిగించే దానిని తీసుకుంటాము. అందువలన, ఇది మాయ అని పిలువబడును.

ఉదాహరణకు అమెరికన్లు. ఈ భూభాగం అమెరికన్ సమూహం కోసం అని వారు చెప్తున్నారు. అదేవిధముగా, ఇతర దేశాలు, వారు ఉన్నారు... కానీ భూమి నిజానికి భగవంతునికి చెందుతుంది. భూమి, ఆకాశం, నీరు భూమిలోని ఉత్పత్తులలో, ఆకాశంలో, నీటిలో, ప్రతిదీ భగవంతునికి చెందుతుంది. మనము భగవంతుని పిల్లలము. తండ్రి మీద ఆధారపడి జీవించే హక్కు మనకు ఉంది. మనం జీవిస్తున్నట్లు, చిన్న పిల్లలు వారు తండ్రి మీద ఆధారపడి ఉంటారు. అదేవిధముగా, మనము కూడా భగవంతుని ఏర్పాటు ద్వారా జీవిస్తున్నాము. ఇది మన ఆస్తి అని ఎందుకు మనము చెప్పాలి?

ఇది ఆధ్యాత్మిక కమ్యూనిజము యొక్క ఆలోచన. భాగవతంలో ఈ విషయాలు చెప్పబడినవి, ఆధ్యాత్మిక కమ్యూనిజము ఎలా అనుభూతి చెందాలి. ఆధ్యాత్మిక కమ్యూనిజములో... ప్రస్తుత కమ్యూనిస్టులు, వారు మానవుని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. జంతువులను కబేళాకు పంపిస్తున్నారు. మానవుడు మరియు జంతువు ఒకే దేశంలో జన్మించినప్పటికీ... వాస్తవమునకు, అవి కూడా ఈ దేశమునకు చెందినవే. జాతీయత అంటే ఆ దేశంలో జన్మించిన వ్యక్తి. కాబట్టి ఈ జంతువులు, దేశస్తులు ఎందుకు కాదు? కానీ ఎందుకంటే వారికి కృష్ణ చైతన్యము లేదు కాబట్టి, వారు చాలా విస్తృతంగా ఆలోచించలేరు. వారు ఆలోచిస్తున్నారు జాతీయవాదం అంటే మనుషులకు మాత్రమే పరిమితం, జంతువులకు కాదు, చెట్లకు కాదు అని.

కానీ మీరు కృష్ణ చైతన్యవంతులు అయినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అది చెట్లు, మొక్కలు, సరీసృపాలు, జలచరాలు, మనుష్యులు, జంతువులు, ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరూ, భగవంతుని యొక్క భాగం అంశం. వారి కర్మ ప్రకారం, నేను చెప్పినట్లుగా వారు వివిధ శరీరాలను, రంగునూ కలిగి ఉంటారు. దీని ప్రకారం kāraṇam guṇa-sango 'sya sad-asad-janma-yoniṣu ( BG 13.22) ఈ విషయాలు భగవద్గీతలో వివరించబడ్డాయి. ఒకరు తన కర్మ ప్రకారం భిన్న రకమైన శరీరమును కలిగి ఉన్నారు. Karmaṇā daiva netreṇa jantor deha upapattaye ( BG 13.22). కర్మ ద్వారా మనం తరువాతి శరీరాన్ని సృష్టిస్తాము.

కాబట్టి ఇది గొప్ప శాస్త్రం. ప్రజలకు విషయాలు ఎలా జరుగుతున్నాయో తెలియదు, అనేక జాతులు జీవము ఎలా ఉన్నాయో తెలియదు, ఎలా ఒకరు సంతోషం అని పిలవబడే దానితో, ఒకరు విషాదం అని పిలవబడే దానితో ఉన్నారు. ఎందుకు ఒకరు ధనవంతుడు, ఒకరు పేదవాడు? ఎందుకు చాలా లోకములు ఉన్నాయి? ఎందుకు వారిలో కొందరు దేవతలు వారిలో కొందరు మనుషులు, వారిలో కొందరు జంతువులు? ఇది ఒక గొప్ప శాస్త్రం, కానీ ఈ జ్ఞానమును ఎవరూ నేర్చుకోవడము లేదు ఆధునిక విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థలలో. బహుశా మనం మాత్రమే అటువంటి వ్యక్తుల సమూహము, కృష్ణ చైతన్యము యొక్క ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. కానీ పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఇది పరిపూర్ణ విజ్ఞాన శాస్త్రం