TE/Prabhupada 1000 - మాయ ఎల్లప్పుడూ అవకాశం కొరకు ఎదురు చూస్తుంది, మరల మిమ్మల్ని ఎలా పట్టుకోవాలని

Revision as of 16:06, 2 February 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1000 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730406 - Lecture SB 02.01.01-2 - New York


మాయ ఎల్లప్పుడూ అవకాశం కొరకు ఎదురు చూస్తుంది, అవకాశం కొరకు మరల మిమ్మల్ని ఎలా పట్టుకోవాలని? ప్రభుపాద: కాబట్టి ఇది గొప్ప శాస్త్రం. ప్రజలకు ఇది తెలియదు. మా కృష్ణ చైతన్య ఉద్యమం చాలా శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది. కాబట్టి మా కర్తవ్యం వీలైనంతవరకు ప్రజలకు జ్ఞానాన్ని ఇవ్వడం, అదే సమయంలో మనము జ్ఞానవంతులము అయి ఉండటం. మనము మరల మాయ యొక్క అంధకారం ద్వారా కప్పబడకుండా ఉండాలి. మనము ఉండాలి... మాయ చేత కప్పబడకుండునట్లుగా మనల్ని మనం బలపరచుకోవాలి. మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరన్తి తే ( BG 7.14) మీరు చాలా ఖచ్చితంగా కృష్ణచైతన్య సూత్రానికి కట్టుబడి ఉంటే అప్పుడు మాయ మిమ్మల్ని తాకదు. ఇది మాత్రమే పరిష్కారం. లేకపోతే మాయ ఎల్లప్పుడూ అవకాశము కొరకు, మళ్ళీ ఆమె మిమ్మల్ని వశపరుచుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అయితే మీరు ఖచ్చితంగా కృష్ణ చైతన్యములో వుంటే, మాయ ఏమీ చేయలేదు. మామేవ యే ప్రపద్యంతే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ( BG 7.14) మాయ బారి నుండి బయటపడటం చాలా కష్టం. ఇది చాలా కష్టము. కానీ కృష్ణుడు చెప్తారు, మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరన్తి తే: ( BG 7.14) కృష్ణుడి యొక్క పాద పద్మములకు ఎవరైతే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారో, ఎల్లప్పుడూ... అందువల్ల మన, ఈ కార్యక్రమము 24 గంటలు కృష్ణుని స్మరించటమే. సతతమ్. సతతమ్ చింతయో కృష్ణ. కీర్తనీయ సదా హరిః ( cc Adi 17.31) ఈ సిఫార్సులు వున్నాయి. కాబట్టి మనము కేవలము కృష్ణుని గురించి ఆలోచిస్తే.... మీరు ఏమీ చేయలేకుంటే, ఆయన గురించి ఆలోచించండి. ఇది అత్యుత్తమ ద్యాన పరిపూర్ణము. కాబట్టి ఎల్లప్పుడూ హరే కృష్ణ మంత్రం జపించండి. చాలా మార్గాల్లో కృష్ణుడితో సన్నిహితంగా ఉండండి, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. మాయ మిమ్మల్ని తాకలేదు. ఏదో ఒక విధముగా మన రోజులను మనము గడపగలిగితే మరణసమయంలో మనము కృష్ణుడిని గుర్తుంచుకుంటాము, అప్పుడు మొత్తం జీవితం విజయవంతమవుతుంది.

చాలా ధన్యవాదములు.

భక్తులు: ధన్యవాదములు, ప్రభుపాదకు జై!