TE/Prabhupada 1032 - ఈ పద్ధతి మిమ్మల్ని భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి బదిలీ చేయడం

Revision as of 23:39, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne


ఈ పద్ధతి మిమ్మల్ని భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి బదిలీ చేయడం.

మధుద్విస: స్వామీజీని ప్రశ్నలు అడుగుటకు మీరు ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి మీకేమైనా ప్రశ్నలు ఉంటే, మీరు చేయిని ఎత్తవచ్చు, మీరు కోరుకుంటే, ఇప్పుడు ప్రశ్నలను అడగవచ్చు. (దీర్ఘ విరామం) ఏ ప్రశ్నలు లేవా? దీని అర్థం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు.(నవ్వు)

ప్రభుపాద: పూర్తి అంగీకారం. అది బాగుంది.

అతిథి (1): మీ భక్తులు అంటున్నారు మీ లక్ష్యము భౌతిక జీవితము యొక్క వ్యాధి నుండి బయట పడడము అని ఇలా చెయ్యటానికి మీ పద్ధతి ఏమిటని నాకు తెలియటం లేదు, కానీ ఈ వ్యాధి నుండి బయట పడిన తర్వాత అంతిమ ఫలితం ఏమిటో నాకు చెప్పగలరా.

ప్రభుపాద: అది ఏమిటి?

మధుద్విస: కృష్ణ చైతన్యంలో, పద్ధతి భౌతిక జీవితం యొక్క వ్యాధి నుండి బయట పడాలి. తన ప్రశ్న యొక్క మొదటి భాగం, “ఇది ఎలా చేయాలి?” తన ప్రశ్న యొక్క రెండవ భాగం, “పద్ధతి తీసుకున్న తర్వాత తుది ఫలితం ఏమిటి?”

ప్రభుపాద: భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి బదిలీ చేయడం ఈ పద్ధతి. మనము శక్తిలో ఉన్నాము. భగవంతుడికి రెండు శక్తులు ఉన్నాయి-- భౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి. మనము కూడా శక్తి. మనము తటస్థ శక్తి. కాబట్టి తటస్థ శక్తి అంటే మనము భౌతిక శక్తి మీద లేదా ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడి ఉండగలము, మనము ఎంపిక చేసుకున్నట్లుగా. తటస్థ.... ఉదాహరణకు సముద్ర తీరములో మీరు చూస్తారు. కొన్నిసార్లు నీటి సరిహద్దులో, నీరు భూమిని కప్పివేస్తుంది, కొన్నిసార్లు భూమి ఖాళీగా ఉంటుంది. ఇది తటస్థ పరిస్థితిగా పిలువబడుతుంది. అదే విధముగా, మనము, జీవులు భగవంతుని తటస్థ శక్తి. కాబట్టి మనము నీటి కింద ఉండవచ్చు, అంటే భౌతిక శక్తి. లేదా మనము బాహ్యంగా కూడా ఉండవచ్చు, ఆధ్యాత్మిక శక్తిలో