TE/Prabhupada 1058 - భగవద్-గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు

Revision as of 15:34, 30 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1058 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

భగవద్-గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు భగవద్-గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు. భగవద్-గీత యొక్క ప్రతి పుటయందు దేవాదిదేవునిగా భగవంతునిగా పేర్కొనబడ్డాడు, నిస్సందేహంగా, "భగవాన్" అపుడప్పుడు ఎవరైన శక్తివంతుడైనా వ్యక్తిని లేదా ఎవరైనా శక్తివంతుడైనా దెవతను సంభోదించడనికి ఉపయొగించబడుతోన్ది, కాని ఇక్కడ భగవాన్ శబ్దం కచ్చితంగా భగవాన్ శ్రీ కృష్నున్ని ఒక గొప్ప వ్యక్తి రూపంలో సూచిస్తుంది, కాని అదే సమయంలో మనం భగవాన్ శ్రీ కృష్నుని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా అయితే సమస్త ఆచార్యులు వివరించరో... నేను చెప్పాలనుకున్నది, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి మరియు చైతన్య మహాప్రభు మొదలగు వారు చాలా మంది. భారత దేశంలో ప్రామానికమైన పండితులు మరియు ఆచార్యులు చాలా మంది ఉండేవారు, నా ఉద్దేశం, వేదజ్ఞానంలో ప్రామానికమైన వారు. శంకరాచార్యతో సహా, వారందరు, శ్రీ కృష్నున్ని భగవంతునిగా అంగీకరించరు. భగవంతుడే స్వయాంగా చెప్పాడు తన గురించి పరమ పురుషోత్తముడైన భగవానుడు అని భగవద్-గీతలో. అతను బ్రహ్మ-సంహిత మరియు పురానాలన్నిటిలో ఈ విధంగా స్వీకరించబడ్డాడు, ముఖ్యంగా భాగవత పురానంలో: కృష్ణస్ తు భగవాన్ స్వయం అందుకే భగవద్-గీతను మనం భగవంతుడు ఏ విధంగా చెప్పాడో, అలాగే స్వీకరించాలి. భగవద్-గీత యొక్క నాలుగవ అధ్యాయంలో భగవానుడు చెప్పారు: ఇమం వివస్వ్తతె యొగం ప్రక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవె ప్రాహ మనుర్ ఇక్ష్వాకవె అబ్రవీత్ (భ గీ 4.1). ఎవం పరంపరా-ప్రాప్తం ఇమం రాజర్షయొ విదుః స కాలెనెహ మహతా యొగొ నష్ట పరంతప (భ గీ 4.2). స ఎవాయం మయా తె అద్య యొగః ప్రొక్తః పురాతనః భక్తొ అసి మె సఖా చెతి రహస్యం హి ఎతద్ ఉత్తమం (భ గీ 4.3). ఆలోచన ఏమిటంటే... భగవంతుడు అర్జునునికి ఈ విధంగా చెప్తున్నాడు "ఈ యొగ, ఈ యొగపద్దతి, భగవద్-గీత, మొదటి సారి నా ద్వారా సూర్యదేవునికి చెప్పబడింది మరియు సూర్యదేవుడు మనువుకు వివరించారు. మనువు ఇక్ష్వాకుకు వివరించారు, ఈ విధంగా, గురు పరంపరలో, ఈ యొగపద్దతి, ఒక వక్త నుండి మరొక వక్తకు చేరుకుంటూ వచ్చింది. కాని కాలాంతరంలో ఆ పద్దతి నష్టపోయినది అందుకే, నేను అదే యొగపద్దతిని మళ్ళీ నీకు వివరిస్తున్నాను, అదే పురాతన యొగపద్దతి భగవద్-గీత, లేదా గీతోపనిషత్తు. ఎందుకంటే నీవు నా భక్తుడవు మరియు నా స్నేహితుడవు, అందుకే దీనిని అర్థం చేసుకొవడం నీకు మాత్రమే సాధ్యం." దీని యొక్క తాత్పర్యం, భగవద్-గీత ఎలాంటి గ్రంథమంటే అది ప్రత్యేకంగా భగవంతుని భక్తుల కోసమే. జ్ణాని, యోగి మరియు భక్త అని ముగ్గురు ఆధ్యాత్మిక వాదులు వున్నారు లేదా నిరాకరవాది , ధ్యానము చేయువాడు మరియు భక్తులు ఇక్కడ స్పష్టముగ చెప్పబడినది . భగవంతుడు అర్జునుడికి చెపుతున్నాడు నేను చెపుతున్నాను పరంపరలో నిన్ను మొదటి వ్యక్తిగా చేయుచున్నాను ప్రాచీనమైన గురు శిష్య పరంపర అనునది విచ్ఛిన్నమైనది అందువలన నేను మరో పరంపరను ఏర్పాటు చేయదలచుకుంటున్నాను సూర్యభగవానుడి నుండి ఇతరులకు లభించిన విధానముననే కావున నీవు తీసుకొని ఇతరులకు నీవు ప్రచారము చేయవలెను ఈ భగవద్గిత యోగ పద్ధతి నీ ద్వార ప్రచారము చేయవలెను నీవు భగవద్గితను అర్ధముచేసుకొను ఆచార్యుడివి కావలెను ఇక్కడ మనకు భగవద్గిత అర్జునుడికి ప్రత్యేకముగా చెప్పబడినది అర్జునుడు కృష్ణుడి యొక్క భక్తుడు , కృష్ణుడి యొక్క ప్రత్యక్ష శిష్యుడు అంతే కాక , అర్జునుడు కృష్ణని యొక్క ఆప్తమిత్రుడు కృష్ణనితో పోలిన గుణగణాలు ఉన్నవారికే భగవద్గిత అర్ధమవుతుంది అతడు భక్తుడుకావలెను భగవంతునితో సంభంధము, ప్రత్యక్ష సంభంధము ఉండవలెను