TE/Prabhupada 1058 - భగవద్-గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు



660219-20 - Lecture BG Introduction - New York

భగవద్గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు. భగవద్గీత యొక్క ప్రతి పుట యందు దేవాదిదేవునిగా భగవంతునిగా పేర్కొనబడ్డాడు, నిస్సందేహంగా, "భగవాన్" అపుడప్పుడు ఎవరైన శక్తివంతుడైనా వ్యక్తిని లేదా ఎవరైనా శక్తివంతుడైన దేవతను సంభోదించడనికి ఉపయోగించబడుతోంది, కానీ ఇక్కడ భగవాన్ శబ్దం ఖచ్చితంగా భగవాన్ శ్రీ కృష్ణున్ని ఒక గొప్ప వ్యక్తి రూపంలో సూచిస్తుంది, కానీ అదే సమయంలో మనం భగవాన్ శ్రీ కృష్ణున్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా అయితే సమస్త ఆచార్యులు వివరించారో... నేను చెప్పాలనుకున్నది, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి మరియు చైతన్య మహాప్రభు మొదలగు వారు చాలా మంది. భారత దేశంలో ప్రామాణికమైన పండితులు మరియు ఆచార్యులు చాలా మంది ఉండేవారు, నా ఉద్దేశం, వేదజ్ఞానంలో ప్రామాణికమైన వారు. శంకరాచార్యతో సహా, వారందరు, శ్రీ కృష్ణున్ని భగవంతునిగా అంగీకరించరు. భగవంతుడే స్వయంగా చెప్పాడు తన గురించి పరమ పురుషోత్తముడైన భగవానుడు అని భగవద్గీతలో. అతను బ్రహ్మ-సంహిత మరియు పురాణాలన్నిటిలో ఈ విధంగా స్వీకరించబడ్డాడు, ముఖ్యంగా భాగవత పురాణంలో: కృష్ణస్తు భగవాన్ స్వయం అందుకే భగవద్గీతను మనం భగవంతుడు ఏ విధంగా చెప్పాడో, అలాగే స్వీకరించాలి.

భగవద్గీత యొక్క నాలుగవ అధ్యాయంలో భగవానుడు చెప్పారు:

ఇమం వివస్వతై యోగం
ప్రోక్తాన్ అహం అవ్యయం
వివస్వాన్ మనవే ప్రాహ
మనుర్ ఇక్ష్వాకవేబ్రవీత్
( BG 4.1)
ఏవం పరంపరా-ప్రాప్తం
ఇమం రాజర్షయో విదుః
స కాలెనేహ మహతా
యోగో నష్టః పరంతప
( BG 4.2)
స ఎవాయం మయా తె ఆద్య
యోగః ప్రొక్తః పురాతనః
భక్తోంసి మె సఖా చేతి
రహస్యం హి ఏతద్ ఉత్తమం
( BG 4.3)

ఆలోచన ఏమిటంటే... భగవంతుడు అర్జునునికి ఈ విధంగా చెప్తున్నాడు ఈ యోగ, ఈ యోగపద్దతి, భగవద్గీత, మొదటి సారి నా ద్వారా సూర్యదేవునికి చెప్పబడింది మరియు సూర్యదేవుడు మనువుకు వివరించారు. మనువు ఇక్ష్వాకుకు వివరించారు, ఈ విధంగా, గురు పరంపరలో, ఈ యోగపద్దతి, ఒక వక్త నుండి మరొక వక్తకు చేరుకుంటూ వచ్చింది. కానీ కాలాంతరంలో ఆ పద్దతి నష్టపోయినది అందుకే, నేను అదే యోగపద్దతిని మళ్ళీ నీకు వివరిస్తున్నాను, అదే పురాతన యోగపద్దతి భగవద్గీత, లేదా గీతోపనిషత్తు. ఎందుకంటే నీవు నా భక్తుడవు మరియు నా స్నేహితుడవు, అందుకే దీనిని అర్థం చేసుకోవడం నీకు మాత్రమే సాధ్యం."

దీని యొక్క తాత్పర్యం, భగవద్గీత ఎలాంటి గ్రంథమంటే అది ప్రత్యేకంగా భగవంతుని భక్తుల కోసమే. జ్ణాని, యోగి మరియు భక్త అని ముగ్గురు ఆధ్యాత్మిక వాదులు వున్నారు లేదా నిరాకారవాది, ధ్యానము చేయువాడు మరియు భక్తులు ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. భగవంతుడు అర్జునుడికి చెపుతున్నాడు నేను చెపుతున్నాను పరంపరలో నిన్ను మొదటి వ్యక్తిగా చేయుచున్నాను ప్రాచీనమైన గురు శిష్య పరంపర అనునది విచ్ఛిన్నమైనది అందువలన నేను మరో పరంపరను ఏర్పాటు చేయదలచుకుంటున్నాను సూర్యభగవానుడి నుండి ఇతరులకు లభించిన విధానముననే కావున నీవు తీసుకొని ఇతరులకు నీవు ప్రచారము చేయవలెను ఈ భగవద్గీత యోగ పద్ధతి నీ ద్వార ప్రచారము చేయవలెను నీవు భగవద్గీతను అర్థము చేసుకొను ఆచార్యుడివి కావలెను ఇక్కడ మనకు భగవద్గీత అర్జునుడి ద్వారా ప్రత్యేకముగా చెప్పబడినది అర్జునుడు కృష్ణుడి యొక్క భక్తుడు, కృష్ణుడి యొక్క ప్రత్యక్ష శిష్యుడు అంతేకాక, అర్జునుడు కృష్ణుని యొక్క ఆప్తమిత్రుడు కృష్ణునితో పోలిన గుణగణాలు ఉన్నవారికే భగవద్గీత అర్థమవుతుంది అతడు భక్తుడు కావలెను భగవంతునితో సంబంధము, ప్రత్యక్ష సంబంధము ఉండవలెను