TE/Prabhupada 1059 - ప్రతియొక్కరు శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధము కలిగియుందురు

Revision as of 13:40, 31 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1059 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

ప్రతియొక్కరు శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధము కలిగియుందురు భగవంతుని భక్తుడైన వెనువెంటనే భగవంతునితో ప్రత్యక్ష సంబంధము కలిగియుంటారు ఇది అత్యంత విస్తృతమైన విషయము కానీ క్లుప్తముగా చెప్పవచును భక్తుడు దేవాధిదేవునితో ఐదు రకములుగా సంబంధము కలిగివుండవచును శాంతభక్తునిగా దాస్యభక్తునిగా సఖ్యభక్తునిగా వాత్సల్యభక్తునిగా మాధుర్యభక్తునిగా ఉండవచ్చును అర్జునుడు భగవంతునితో సఖ్యభక్తునిగా సంబంధము కలిగియున్నాడు భగవంతుండు స్నేహితుడు అవగలడు అయితే ఈ స్నేహమునకు మరియు భౌతిక ప్రపంచమునందు వుండు స్నేహమునకు మధ్య గొప్ప భేదము కలదు. వారిది అలోకిక స్నేహ సంబంధము అందరికి ఇటువంటి స్నేహము సాధ్యము కాదు ప్రతిఒక్కరు భగవంతునితో ప్రత్యేక సంబంధము కలిగి వుంటారు భక్తియుక్త సేవయందలి పరిపూర్ణతచే అట్టి సంబంధము జాగృతి కాగలదు మన ప్రస్తుత జీవన స్థితిలో మనము భగవంతుని మరచిపోయాము అంతేకాకుండా భగవంతునితోగల శాశ్వత సంబంధమునుకూడా మరచిపోయాము అనంతకోటి జీవరాశుల యందలి ప్రతి జీవి భగవంతునితో ప్రత్యక్ష సంబంధమును శాశ్వతముగా కలిగియున్నాడు. దీనిని స్వరూప అని అంటారు మానవుడు భక్తియుక్త సేవతో అట్టి స్వరూప సేవను పునరుద్ధరించుకోగలరు అట్టి స్థితియే "స్వరూప సిద్ధి". జీవుని నిజ స్థితి పరిపూర్ణత్వము అనబడును అర్జునుడు భక్తునిగా భగవానునితో సఖ్యరస సంబంధము కలిగియుండెను భగవద్గిత అర్జునుడికి వివరింపబడినది. అర్జునుడు భగవద్గితను ఎట్లు అంగీకరించునో గమనింపవలెను అది మనముతెలుసుకొనవలెను . అర్జునుడు భగవద్గితను అంగీకరించినవిధానము దశమాధ్యాయములో తెలుపబడినది

అర్జున ఉవాచ
paraṁ brahma paraṁ dhāma
pavitraṁ paramaṁ bhavān
puruṣaṁ śāśvataṁ divyam
ādi-devam ajaṁ vibhum
āhus tvām ṛṣayaḥ sarve
devarṣir nāradas tathā
asito devalo vyāsaḥ
svayaṁ caiva bravīṣi me
(BG 10.12-13)
sarvam etad ṛtaṁ manye
yan māṁ vadasi keśava
na hi te bhagavan vyaktiṁ
vidur devā na dānavāḥ.
(BG 10.14)

అర్జునుడు భగవద్గితను దేవాధిదేవుడునుండి విన్న తరువాత పలికెను అర్జునుడు కృష్ణుని పరం బ్రహ్మగా అంగీకరిస్తున్నాడు ప్రతి జీవి కుడా బ్రహ్మమే కానీ దేవాధిదేవుడు పరబ్రహ్మము మరియు పరం ధామ . పరమ్ ధామ అంటే అయినప్రతి ఒక్కరికి అయిన ఆశ్రయము అయిన పవిత్రుడు అనగా భౌతిక కాలుష్యము లేనివాడు అయినాను పురుషుడు అనికూడా అంటాము పురుషం అనగా పరమ భోక్త శాశ్వతం అనగా మొదటినుంచి ఆయనే మొదటి వ్యక్తి నిత్యమైనవాడు దివ్యం ఆధ్యాత్మికమైనది దేవమ్ , దేవాధిదేవుడు అజాం పుట్టుక లేనివాడు . విభుమ్ అత్యంత ఘనుడు ఎవరికైనా సంశయము రావచ్చును . కృష్ణుడు అర్జునుడికి స్నేహితుడు అవుటవలన అర్జునుడు ఇవన్నీ తన స్నేహితుడుగురించి ముఖస్తుతి చేస్తున్నాడు అని కానీ అర్జునుడు , భగవద్గిత పాఠకుల నుండి అట్టి సందేహమును తొలగించుటకై అర్జునుడు ప్రామాణికులచే తాను చెబుతున్నది ప్రమాణీకరించుచున్నాడు శ్రీకృష్ణుడు దేవాధిదేవునిగా అంగీకరిస్తున్నది తానే ఒక్కడే కాకుండా నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు కూడా అంగీకరిస్తున్నారు ఈ మహానుభావులు వేదవిజ్ఞానమును విస్తరింపచేసిరి ఆచార్యులు అందరు దీనిని అంగీకరించారు అందువలన అర్జునుడు పలికెను నీవు పలికినదంతయు సత్యమని నేను అంగీకరిస్తున్నాను