TE/Prabhupada 1059 - ప్రతియొక్కరు శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధము కలిగియుందురు



660219-20 - Lecture BG Introduction - New York

ప్రతియొక్కరు శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధము కలిగియుందురు భగవంతుని భక్తుడైన వెనువెంటనే భగవంతునితో ప్రత్యక్ష సంబంధము కలిగియుంటారు ఇది అత్యంత విస్తృతమైన విషయము కానీ క్లుప్తముగా చెప్పవచును భక్తుడు దేవాదిదేవునితో ఐదు రకములుగా సంబంధము కలిగి వుండవచ్చును శాంతభక్తునిగా దాస్యభక్తునిగా సఖ్యభక్తునిగా వాత్సల్యభక్తునిగా మాధుర్యభక్తునిగా ఉండవచ్చును

అర్జునుడు భగవంతునితో సఖ్యభక్తునిగా సంబంధము కలిగియున్నాడు భగవంతుడు స్నేహితుడు అవగలడు అయితే ఈ స్నేహమునకు మరియు భౌతిక ప్రపంచము నందు వుండు స్నేహమునకు మధ్య గొప్ప భేదము కలదు. వారిది అలౌకిక స్నేహ సంబంధము అందరికి ఇటువంటి స్నేహము సాధ్యము కాదు ప్రతిఒక్కరు భగవంతునితో ప్రత్యేక సంబంధము కలిగి వుంటారు భక్తియుక్త సేవ యందలి పరిపూర్ణతచే అట్టి సంబంధము జాగృతి కాగలదు మన ప్రస్తుత జీవన స్థితిలో మనము భగవంతుని మరచిపోయాము అంతేకాకుండా భగవంతునితో గల శాశ్వత సంబంధమును కూడా మరచిపోయాము అనంతకోటి జీవరాశుల యందలి ప్రతి జీవి భగవంతునితో ప్రత్యక్ష సంబంధమును శాశ్వతముగా కలిగియున్నాడు. దీనిని స్వరూప అని అంటారు మానవుడు భక్తియుక్త సేవతో అట్టి స్వరూప సేవను పునరుద్ధరించుకోగలరు అట్టి స్థితియే "స్వరూప సిద్ధి". జీవుని నిజ స్థితి పరిపూర్ణత్వము అనబడును

అర్జునుడు భక్తునిగా భగవానునితో సఖ్యరస సంబంధము కలిగియుండెను

భగవద్గీత అర్జునుడికి వివరింపబడినది. అర్జునుడు భగవద్గీతను ఎట్లు అంగీకరించునో గమనింపవలెను అది మనము తెలుసుకొనవలెను. అర్జునుడు భగవద్గీతను అంగీకరించిన విధానము దశమాధ్యాయములో తెలుపబడినది అర్జున ఉవాచ:-

పరం బ్రహ్మ పరం ధామ
పవిత్రం పరంమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యమ్
ఆదిదేవమజం విభుమ్
( BG 10.12)
ఆహుస్త్వామృషయః సర్వే
దేవర్షిర్నారదస్తథా
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవీషి మే
( BG 10.13)
సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ
న హి తే భగవన్ వ్యక్తిం
విదుర్దేవా న దానవాః
( BG 10.14)

అర్జునుడు భగవద్గీతను దేవాదిదేవుడు నుండి విన్న తరువాత పలికెను అర్జునుడు కృష్ణుని పరం బ్రహ్మగా అంగీకరిస్తున్నాడు ప్రతి జీవి కూడా బ్రహ్మమే కానీ దేవాదిదేవుడు పరబ్రహ్మము మరియు పరం ధామ. పరమ్ ధామ అంటే ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయము ఆయన పవిత్రుడు అనగా భౌతిక కాలుష్యము లేనివాడు ఆయనను పురుషుడు అని కూడా అంటాము పురుషం అనగా పరమ భోక్త శాశ్వతం అనగా మొదటి నుంచి ఆయనే మొదటి వ్యక్తి నిత్యమైనవాడు దివ్యం ఆధ్యాత్మికమైనది దేవమ్, దేవాదిదేవుడు అజం పుట్టుక లేనివాడు. విభుమ్ అత్యంత ఘనుడు

ఎవరికైనా సంశయము రావచ్చును. కృష్ణుడు అర్జునుడికి స్నేహితుడు అవుట వలన అర్జునుడు ఇవన్నీ తన స్నేహితుడు గురించి ముఖస్తుతి చేస్తున్నాడు అని కానీ అర్జునుడు, భగవద్గీత పాఠకుల నుండి అట్టి సందేహమును తొలగించుటకై అర్జునుడు ప్రామాణికులచే తాను చెబుతున్నది ప్రమాణీకరించుచున్నాడు శ్రీకృష్ణుడు దేవాదిదేవునిగా అంగీకరిస్తున్నది తానే ఒక్కడే కాకుండా నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు కూడా అంగీకరిస్తున్నారు ఈ మహానుభావులు వేదవిజ్ఞానమును విస్తరింపచేసిరి ఆచార్యులు అందరు దీనిని అంగీకరించారు అందువలన అర్జునుడు పలికెను నీవు పలికినదంతయు సత్యమని నేను అంగీకరిస్తున్నాను