TE/Prabhupada 1067 - భగవద్గీతను మనం సొంత వ్యాఖ్యానాలు లేకుండా అంగీకరించాలి, ఎటువంటి మినహాయింపులు లేకుండా

Revision as of 08:12, 25 June 2015 by Visnu Murti (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 French Pages with Videos Category:Prabhupada 1067 - in all Languages Category:FR-Quotes - 1966 Category:FR-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

చిన్న పరిపూర్ణ విభాగములు, పేరుకి జీవాత్మలు, పరిపూర్ణమును అనుభూతి కావించుకొనుటకు పరిపూర్ణ సదుపాయము కలదు. అన్ని రకముల అపరిపూర్ణతలు పరిపూర్ణుని యొక్క అపరిపూర్ణ జ్ఞానము వలన అనుభవపూరితమగుచున్నది. కావున వైదిక జ్ఞానము యొక్క పరిపూర్ణ జ్ఞానమే భగవద్గీత. యావత్తు వైదిక జ్ఞానము అచ్యుతము (అంతము లేనిది). వైదిక జ్ఞానము నాశనము లేనిదిని పరిగణించుటకు పెక్కు ఉదాహరణలు కలవు. ఉదాహరణకు, హిందువులకు సంబంధించి, ఎటుల ఈ వైదిక జ్ఞానాన్ని పరిపూర్ణముగా అంగీకరింతురు, ఇచ్చట ఒక చిన్న ఉదాహరణ కలదు. ఏ విధముగా గోమయము వలె, గోమయము ఒక జంతువూ యొక్క విసర్జనము. స్మృతి లేక వైదిక విజ్ఞానము ప్రకారం, ఎవరైనా కాని జంతువు యొక్క మలమును తాకినట్లయితే వెంటనే తనను పవిత్రము కావించుకోనుటకు స్నానము చేయవలెను. కాని వైదిక శాస్త్రములలో గోమయము పవిత్రమని పేర్కొనబడెను. అటుల కాక, అపవిత్ర ప్రదేశము లేక అపవిత్ర వస్తువులు గోమయముచే స్పృసించుటద్వారా పవిత్రము కాబడును. ఇప్పుడు అది ఎలా అని ఎవరైనా వాదించవచ్చు, ఒక చోట జంతువు మలము అపవిత్రమని చెప్పబడినది, మరియు మరోక చోట జంతువు యొక్క విసర్జనమే అయునట్టి గోమయమును పవిత్రమని చెప్పబడినది, కావున ఇది వివాదాస్పదము. కాని వాస్తవముగా, అది వివాదాస్పదముగా గోచరించవచ్చు, కాని అది ఒక వేదోక్తి గనుక, వాడుక ప్రయోజనములకు మనము దానికి అంగీకరిస్తాము. మరియు ఆ అంగీకారము వలన మనము ఎటువంటి తప్పిదము చేయుటలేదు. ఆధునిక రసాయన శాస్త్రవేత్తలద్వారా కనుగొనబడినది, ఆధునిక శాస్త్రము, ఒక డాక్టర్. లాల్ మోహన్ గోశల్, ఆయన చాలా సూక్ష్మముగా గోమయమును పరిశీలించి కనుగొన్నాడు గోమయము అన్ని క్రిమి సంహారక లక్షణములు గల మిశ్రమమని. కావున అదే విధముగా, కుతూహలముతో ఆయన గంగాజలమును కూడా పరిశీలించెను. కావున నా అభిప్రాయమును అనుసరించి వైదిక జ్ఞానము అన్ని సంశయములకు, అన్ని తప్పిదములకు అతీతంగా పరిపూర్ణమైనది. కావున, మరియు భగవద్గీత సర్వ వైధిక జ్ఞానము యొక్క సారాంశము. కావున వైధిక జ్ఞానము అంతము లేనిది (అచ్యుతము). అది ఒక పరిపూర్ణమైన గురుశిష్య పరంపరలో నుండి వెలువడుచున్నది. కావున వైధిక జ్ఞానము పరిశోధించెడి విషయము కాదు. మన పరిశోధన కార్యము అపరిపూర్ణము. ఎందుకనగా మనము ప్రతీది అపరిపూర్ణ ఇంద్రియములతో వెదుకుచున్నాము. కావున మనము చేసిన పరిశోధన కార్యపు ఫలితను కూడా అపరిపూర్ణమే. అది పరిపూర్ణము కాబడదు. పరిపూర్ణ జ్ఞానమును మనము అంగీరరించవలెను.పరిపూర్ణ జ్ఞానము భగవద్గీతలో యథాతధంగా పేర్కొనబడిన విధంగా వెలువడుచున్నది. ఇప్పుడే మనము ఆరంభించాము, ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః (భగవద్గీత 4.2). మనము భగవంతుని నుండి ప్రారంభమైనట్టి ఆధ్యాత్మిక గురుశిష్య పరంపరానుగతంగా వస్తున్న ఒక సరియైన ఆధారము నుండి జ్ఞానమును స్వీకరించవలెను. కావున భగవద్గీత స్వయానా భగవంతునిచే పలకబడినది. మరియు అర్జునుడు, నేను చెప్పదలుచుకున్నది ఏమనగా, భగవద్గీత పాఠాలను పొందిన విద్యార్ధి, పూర్తి గాధను ఆయన యధాతధముగా అంగీకరించారు, ఎటువంటి మినహాయింపు లేకుండా. అది కూడా అనుమతించబడదు, భగవద్గీతలో కొంత భాగాన్ని అంగీకరించి మరి కొంత భాగాన్ని అంగీకరించకుండుట. అది కూడా అంగీకరించబడదు. భగవద్గీతను ఎటువంటి వ్యాఖ్యానం లేకుండా అంగీకరించాలి, ఎటువంటి మినహాయింపు లేకుండా. మరియు ఈ విషయము నందు మన సొంత యాదృచిక ప్రమేయం లేకుండా, ఎందుకనగా దీనిని మిక్కిలి పరిపూర్ణమైన వైధిక జ్ఞానముగా పరిగణించవలెను. వైధిక జ్ఞానము దివ్యమైన మూలాధారాల నుండి స్వీకరించడమైనది. ఎందుకనగా మొట్టమొదటి మాట స్వయానా భగవంతుని ద్వారా పలుకబడినది. భగవంతుడు పలికిన పలుకులను అపౌరుషేయ అందురు, లేక నాలుగు రకములైన దోషములతో బాధితుడైనట్టి భౌతిక ప్రపంచానికి చెందిన ఏ వ్యక్తీ ద్వారా వెలువడలేదు. భౌతిక ప్రపంచానికి చెందిన జీవి యొక్క జీవితమునందు నాలుగు రకాల లోపభూయిష్ట సూత్రాలు కలవు, మరియు అవి ఏమనగా 1) అతడు ఖచ్చితంగా తప్పులు చేయుట, 2) కొన్ని మార్లు అతడు బ్రాన్తిలో పడుట, మరియు 3) ఇతరులను మోసగించుటకు ప్రయత్నించుట, మరియు 4) అపరిపూర్ణమైన ఇంద్రియములు కలిగి యుండుట. ఈ నాలుగు రకములైన అపరిపూర్ణమైన సూత్రములతో, ఎవరూ కూడా సర్వ వ్యాపకమైనట్టి జ్ఞాన విషయమునందు పరిపూర్ణ సమాచారమును వేలువరించలేరు. వేదములు అటువంటివి కావు. తొలుత సృష్టించబడిన జీవుడైన బ్రహ్మ యొక్క హృదయము నందు మొట్టమొదట ఈ వుధిక జ్ఞానము బోధించబడెను. మరియు అటు పిమ్మట బ్రహ్మ తన కుమారులకు మరియు శిష్యులకు ఈ జ్ఞానమును పంచెను. భగవంతుని నుండి ప్రప్రధముగా స్వీకరించిన విధంగా.