"కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి మంచి ఫలితానికి లేదా చెడు ఫలితానికి ఆసక్తుడు కాకూడదు. ఎందుకంటే నేను మంచి ఫలితాన్ని కోరుకున్నా, అది నా ఆసక్తి. మరియు వాస్తవానికి, చెడు ఫలితం ఉంటే, మనకు ఎటువంటి ఆసక్తి ఉండదు, కానీ కొన్నిసార్లు మనము విలపిస్తాము. అది మన బంధము. అదే మన బంధము. కాబట్టి మనము మంచి ఫలితం మరియు చెడు ఫలితం, రెండింటినీ అధిగమించాలి. అది ఎలా చేయవచ్చు? ఇది చేయవచ్చు. మీరు ఒక్క పెద్ద సంస్థకు పని చేస్తున్నారు అనుకుంటే. మీరు విక్రయ కర్త (సేల్స్ మాన్) అని అనుకుందాం. మీరు ఆ పెద్ద సంస్థ తరఫున పనిచేస్తున్నారు. ఇప్పుడు, మీరు ఒక మిలియన్ (పది లక్షల) డాలర్ల లాభం సంపాదిస్తే, మీకు (ఆ డబ్బుపైన) ఎటువంటి ఆసక్తి ఉండదు, ఎందుకంటే 'ఈ లాభం యజమానికి వెళ్తుంది' అని మీకు తెలుసు. మీకు ఎటువంటి ఆసక్తి లేదు. అదేవిధంగా, కొంత నష్టం ఉంటే, 'నాకు నష్టం తో సంబంధం లేదు. ఇది యజమానికి చెందుతుంది' అని మీకు కూడా తెలుసు. అదేవిధంగా, మనము కృష్ణుని ఖాతాలో పని చేస్తే, అప్పుడు నేను పనికి వచ్చిన ఫలితమును త్యజించగల్గుతాను."
|