TE/660809 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"శాస్త్రాలలో భగవంతుని ధామాన్ని వైకుంఠ అని పిలుస్తారు. వైకుంఠ అంటే విగత-కుంఠ యత్ర. కుంఠ అంటే చింతలు. చింతలు లేని ప్రదేశం, దీనిని వైకుంఠ అని పిలుస్తారు. అయితే కృష్ణుడు అంటారు నాహం తిష్ఠామి వైకుంటే యోగినాం హ్రదయేశు చ, "నా ప్రియమైన నారదా, నేను వైకుంఠంలో, భగవంతుని ధామంలో మాత్రమే, లేదా యోగుల హృదయంలో మాత్రమే ఉన్నానని అనుకోకండి. లేదు." తత్ తత్ తిష్ఠామి నారద యత్ర గాయంతి మద్-భక్త: "నా భక్తులు ఎక్కడ నా మహిమలను పాడతారు లేదా పఠిస్తారో, నేను అక్కడ నిలిచియుంటాను. నేను అక్కడికి వెళ్తాను." |
660809 - ఉపన్యాసం BG 04.20-24 - న్యూయార్క్ |