TE/Prabhupada 0026 - మొదటగా మీరు కృష్ణుడు ఉన్న విశ్వానికి మార్చబడతారు



Morning Walk -- October 5, 1975, Mauritius

భారతీయుడు: స్వామీజి, మన కర్మల ప్రకారం మనం జన్మిస్తాం అన్ని చెప్పబడింది.... ఇప్పుడు మనము ఏదైనా చేస్తే, మనము భగవంతుని చట్టముల ప్రకారం జన్మిస్తాము.

ప్రభుపాద: మీరు ఖచ్చితంగా జన్మను తీసుకోవాలి. అది యధార్థము. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. కానీ మీ కర్మ ప్రకారం మీరు జననం పొందుతారు.

భారతీయుడు: కావున మీరు చేసిన కర్మల పరంగా ఫలితము పొందుతారు. అందువలన మీరు ఈ విధంగా అనుకుంటారా?

ప్రభుపాద: ఒకవేళ మీ ఈ చొక్కా చిరిగిపోతే, మీరు ఇంకో చొక్కా కొనవలసి వస్తుంది. ఇప్పుడు, ఆ చొక్కాను మీ ధరకు అనుగుణంగా ఖరీదు చేయవలసి వస్తుంది. మీ దగ్గర ఎక్కువ ధనం వుంటే మీకు మంచి చొక్కా దొరుకుతుంది. మీ దగ్గర తక్కువ ధనం వుంటే మీకు చెడ్డ చొక్కా దొరుకుతుంది. అంతే.

భారతీయుడు: నేను ఇది చెప్పాలి అని అనుకుంటున్నాను, స్వామిజి, ఏంటంటే నరకం కూడా ఈ ప్రపంచంలోనే వుంది, ఎందుకంటే, ఎక్కడ మన రుణం తీర్చుకుంటాం అని మీరు అనుకుంటున్నారు ? పాపం, మన పాపం యొక్క రుణం, మనం ఎక్కడ దాన్ని తీర్చుకుంటాం అని మీరు అనుకుంటున్నారు? నరకంలో,

ప్రభుపాద: నరకం మీరు శిక్ష పొందే ప్రదేశం.

భారతీయుడు: కావున అది ఈ భూమి పైనే ఉంది

ప్రభుపాద: ఎందుకు భూమి?

భారతీయుడు: ఈ భూమి గ్రహం మీద, కాదా?

ప్రభుపాద: కాదు. అది అవుతుంది....

భారతీయుడు : ఏదైనా గ్రహాల లోన?

ప్రభుపాద:... చాలా లక్షల మైళ్ళ దూరములో.

భారతీయుడు: కానీ అది లేదా... కేవలం నరకం ఒక ప్రదేశంలో ఉందా లేదా ఇంకో ప్రదేశంలో వుందా? మీరు ఏమి అనుకుంటున్నారు, స్వామిజి?

ప్రభుపాద: అవును. అవును. వివిధ రకాల గ్రహాలు ఉన్నాయి.

భారతీయుడు: ఈ ప్రపంచంలోనే బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు.

ప్రభుపాద: కావున వారు అందరు మొదట ఆ నరకపు గ్రహంలో శిక్షణ పొంది తరువాత ఇక్కడ అటువంటి జీవన ప్రమాణముతో బాధలు పడడానికి వస్తారు.

భారతీయుడు: శరీరంలో నుంచి మన ఆత్మ వేరు అయినప్పుడు, అది నరకానికి వెళ్ళుతుందా లేదా..

ప్రభుపాద: నరకపు గ్రహానికి.

భారతీయుడు: గ్రహములోనికా లేదా అది వెంటనే జన్మ తీసుకుంటుందా?

ప్రభుపాద: అవును. ఎవరైతే పాపులో, వారు వెంటనే జన్మ తీసుకోరు. వారు అందరు ఎలా బాధలు పడాలో నరకపు గ్రహంలో శిక్షణ పొందుతారు అక్కడ అలవాటు చెంది మరియు తర్వాత జన్మ తీసుకోని, అప్పుడు బాధలు పడతారు. ఉదాహరణకు నువ్వు ఐ ఏ స్ లో ఉత్తీర్ణత పొందితే అప్పుడు నువ్వు న్యాయాధికారి దగ్గర సహాయకుడుగా చేరి నువ్వు నేర్చుకుంటావు. తరువాత నిన్ను న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. నువ్వు భగవంతుడు దగ్గరకి వెళ్ళడానికి అర్హుడు అయినప్పటికీ, మొదటగా నువ్వు వెళ్ళాలి ఇప్పుడు కృష్ణుడు ఉన్న విశ్వానికి, అక్కడ నువ్వు అలవాటు పడతావు. తరువాత నువ్వు నిజమైన వృందావనంకు వెళ్తావు.

భారతీయుడు: కాబట్టి, మన చావు తర్వాత..

ప్రభుపాద: భగవంతుని యొక్క ప్రతి ఒక్క ఏర్పాటు సంపూర్ణము. పూర్ణం. పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం పూర్ణం ( isopanisad invocation) భగవంతుడిచే సృష్టించబడ్డ ప్రతి ఒక్కటి సంపూర్ణమైనది.