TE/Prabhupada 0066 - కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు



Lecture on BG 16.4 -- Hawaii, January 30, 1975

ఇప్పుడు మనము ఒక భక్తుడు కావాలనుకుంటున్నాను అన్నది మన ఎంపిక లేదా మనము ఒక రాక్షసుడిగా ఉండిపోవాలి అనేది కూడా మన ఎంపిక కృష్ణుడు ఈ విధముగా చెప్పాడు, "మీరు ఈ రాక్షస గుణాన్ని విడచిపెట్టి నాకు శరణాగతి పొందండి ఇది కృష్ణుడి కోరిక. కానీ మీరు కృష్ణుడి కోరికతో అంగీకరించకపోతే, మీరు మీ కోరికలను ఆనందించాలి అనుకుంటే, అప్పుడు కూడా, కృష్ణుడు సంతోషంగా వుంటాడు. ఆయన మీకు అవసరమైన వాటిని ఇస్తాడు. కానీ ఇది మంచిది కాదు. కృష్ణుడి కోరికలను మనము అంగీకరించాలి. మనము మన కోరికలు, రాక్షస కోరికలను, పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. దీనిని తపస్య అంటారు. మన కోరికలను త్యజించాలి. దీనిని త్యాగం అంటారు. మనము కృష్ణుడి కోరికను మాత్రమే అంగీకరించాలి. ఇది భగవద్గీత యొక్క సూచన. అర్జునుడు యుద్ధము చేయకూడదు అని కోరుకున్నాడు కానీ కృష్ణుడి కోరిక యుద్ధము చేయుట. పూర్తి విరుద్ధము. అర్జునుడు చివరికి కృష్ణుడి యొక్క కోరికకు అంగీకరించారు: "అవును యుద్ధము చేయుటకు అంగీకరించెను," కరిష్యే వచనం తవ ( BG 18.73) అవును, నీ ఆజ్ఞానుసారము నేను నడచుకుంటాను. ఇది భక్తి.

ఇది భక్తికి కర్మకు మధ్య తేడా. కర్మ అంటే నా కోరికలను తీర్చుకోవటము. కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు. ఇది తేడా. ఇప్పుడు మీరు నిర్ణయము తీసుకోండి, మీరు మీ కోరికలను నెరవేర్చు కోవాలనుకుంటున్నారా లేదా మీరు కృష్ణుడి కోరికను నెరవేర్చాలను కుంటున్నారా. కృష్ణుడి కోరికను నెరవేర్చాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే, మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది మన కృష్ణ చైతన్య జీవితము. కృష్ణుడు దానిని కోరుకుంటాడు, నేను దానిని చేస్తాను, నేను నా కోసం ఏమీ చేయను. ఇది బృందావనమంటే. కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి బృందావన పౌరులందరూ తపిస్తున్నారు. గోపబాలురు, దూడలు, ఆవులు, చెట్లు, పువ్వులు, నీరు, గోపికలు, వృద్దులు, యశోదమ్మ, నంద మహారాజు, వారు అందరూ కృష్ణుడి కోరిక నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది బృందావనము మంటే కాబట్టి మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని బృందావనములోకి మార్చుకోవచ్చును మీరు కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి అంగీకరిస్తే ఇది బృందావనము అవుతుంది మీరు మీ సొంత కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకుంటే, అది భౌతికము

ఇది భౌతికము మరియు ఆధ్యాత్మికమునకు మధ్య తేడా.