TE/Prabhupada 0087 - భౌతిక ప్రకృతి నియమాలు
(Redirected from TE/Prabhupada 0087 - బౌతిక ప్రకృతి నియమాలు)
Sri Isopanisad Invocation Lecture -- Los Angeles, April 28, 1970
అవును. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి, ఒక పరిమిత సమయం ఉంటుంది. ఈ సమయంలో, ఆరు దశల మార్పులు ఉన్నాయి. మొదట పుట్టడము, తరువాత పెరగడము తరువాత ఉండడము తరువాత పిల్లలకు జన్మనివ్వుట, ఆపై క్షీణించిపోవుట, తరువాత మరణించి అదృశ్యం అవుట. భౌతిక ప్రకృతి యొక్క చట్టము క్రమంగా ఎండిపోవుట ఈ పుష్పం ఒక మొగ్గలాగా పుడుతుంది, తరువాత వికసిస్తుంది తరువాత రెండు మూడు రోజులు ఉంటుంది ఆపై క్రమంగా ఎండిపోతుంది అప్పుడు అది ఒక విత్తనం ఉత్పత్తి చేసి విత్తనము ద్వారా మరొక పువ్వుకు ప్రాణము పోసి ఆపై క్రమంగా ఎండిపోయి మరణిస్తుంది (పక్కన:) మీరు ఈ విధముగా కూర్చోండి దీనిని షడ్వికార అంటారు మార్పులు ఆరు దశలలో. కాబట్టి మీరు మీ భౌతిక శాస్త్రము ద్వారా దీనిని ఆపలేరు. వీలుకాదు దీనిని అవిద్య అంటారు. ప్రజలు, తమను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొన్నిసార్లు భౌతిక శాస్త్రీయ విజ్ఞానం ద్వారా, మానవుడు మరణము లేకుండా వుంటాడు అని అర్థము లేనివి మాట్లాడుతాడు. రష్యన్లు చెప్తారు ఆ విధముగా ఇది అజ్ఞానం. అవిద్య మీరు భౌతిక సూత్రాల పద్ధతులతో ఆపలేరు. అందువలన, భగవద్గీత చెప్తుంది: దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ( BG 7.14) మూడు లక్షణములను భౌతిక ప్రకృతి, కలిగియున్నది సత్వ-గుణము, రజో-గుణము, తమో-గుణము... మూడు గుణాలు. గుణమునకు మరో అర్థం తాడు. మీరు ఈ త్రాడును చూడండి, ఇది మూడు త్రాడులతో చుట్టి వున్నది సన్నని తాడు మొదట, తరువాత వాటిలో మూడు, వాటిని చుట్టి, తరువాత వాటిలో మూడును మరల చుట్టారు తరువాత మళ్ళీ మూడు. ఈ విధముగా చాలా బలముగా తయారు అయింది. ఈ మూడు లక్షణాలు సత్వ, రజో, తమో గుణాలు కలిసిపోయి వున్నాయి. అవి మరల కొత్త వాటికి జన్మనిచ్చి, మరల కలసిపోయి, మరల కలిసిపోయి ఈ విధముగా ఎనభై ఒక్క సార్లు చుట్టబడ్డారు అందువలన, గుణమయీ మాయ మిమ్మల్ని మరింత బంధిస్తుంది. కాబట్టి మీరు భౌతిక ప్రపంచం యొక్క సంకెళ్ళ నుండి తప్పించుకోలేరు బంధనము. అందువలన, అపవర్గ అంటారు. కృష్ణ చైతన్య మార్గము పవర్గ విధానాన్ని నిర్మూలిస్తుంది.
నిన్న, నేను గర్గమునికి పవర్గ అర్థమును వివరించాను. పవర్గ అంటే ప ఫ బ భ మ అని అర్థము దేవనాగరి ని అధ్యయనం చేసిన వారికి తెలుసు దేవనాగరి అక్షరాలు, క ఖ గ ఘ న, చ ఛ జ ఝ ణ ఈ విధముగా, ఐదు సెట్లు, ఒక వరుసలో తరువాత అయిదవ వరుసలో పవర్గ అంటే ప ఫ బ భ మ వస్తుంది ఈ పవర్గలో మొదటి అక్షరము ప ప అంటే పరవ ఓటమి అని అర్థం. అందరూ ప్రయత్నిస్తున్నారు జీవించడానికి చాలా కష్టపడి పోరాటం చేస్తున్నారు, కానీ ఓడిపోతున్నారు. మొదట పవర్గ. ప అంటే పరవ ఫ అంటే నురుగు గుర్రం బాగా కష్టపడి పని చేస్తున్నపుడు దాని నోటి నుండి నురుగు రావుట గమనిస్తారు మనము కొన్నిసార్లు, బాగా అలసిపోయి ఉన్నప్పుడు చాలా కష్టపడి పని చేసిన తర్వాత, నాలుక పొడిగా మారుతుంది కొంత నురుగు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంద్రియ తృప్తి కోసం చాలా కృషి చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు. బ అంటే బంధనము కాబట్టి మొదటి "ప", రెండవ "ఫ" తరువాత బ అంటే బంధనము భ అంటే భయము దండన మ అంటే మరణం కృష్ణ చైతన్య మార్గము అపవర్గ వంటిది అప. "అ" అంటే ఏమి కాదు పవర్గ ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలను చెప్తుంది, మీరు "అ" అక్షరాన్ని జతచేసినప్పుడు, అది అపవర్గ అవుతుంది అంటే అది రద్దు చేయబడింది.