TE/Prabhupada 0089 - కృష్ణుని తేజస్సు అన్నిటికి మూలము
Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)
ఫ్రెంచ్ భక్తుడు: "నేను వాటిలో లేను" అని కృష్ణుడు చెప్పినప్పుడు దాని అర్థము ఏమిటి? ప్రభుపాద: ఏమిటి? "నేను వాటిలో లేను" ఎందుకంటే మీరు అక్కడ ఆయనను చూడలేరు. కృష్ణుడు ఉన్నారు, కానీ మీరు ఆయనను చూడలేరు. మీరు ఉన్నత స్థితిలో లేరు మరొక ఉదాహరణగా. ఇక్కడ, సూర్యకాంతి ఉంది. అందరూ చూస్తున్నారు. కానీ సూర్యుడు ఇక్కడ ఉన్నారు అని కాదు. ఇది స్పష్టంగా వున్నదా? సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అంటే... సూర్యకాంతి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అని అర్థము.. మీరు సూర్యకాంతిలో ఉన్నారు అంటే మీరు "ఇప్పుడు నేను సూర్యుడిని చేజిక్కించుకున్నాను." అని కాదు సూర్యకాంతి సూర్యుడులో భాగం, కానీ సూర్యుడు సూర్యకాంతిలో లేదు. సూర్యుడు లేకుండా సూర్యకాంతి లేదు. ఈ సూర్యకాంతి సూర్యుడు అని అర్థము కాదు. అదే సమయంలో, మీరు సూర్యకాంతి అంటే సూర్యుడు అని అర్థం చెప్పగలరు.
దీనిని అచింత్య బేధా అబేధ , ఏకకాలంలో ఒక్కటిగా భిన్నముగా సూర్యరశ్మి లో మీరు సూర్యుడి, జీవితముని అనుభూతి చెందుతారు కానీ మీరు సూర్య గోళములోనికి వెళ్ళగలిగితే సూర్య భగవంతుడు చూస్తారు నిజానికి, సూర్య కాంతి అంటే సూర్య భూగోళములో నివసిస్తున్న వ్యక్తి యొక్క శరీరము నుంచి వస్తున్న కాంతి అని అర్థము.
దీనిని బ్రహ్మ సంహితలో వివరించారు. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి (BS 5.40). ఎందుకంటే కృష్ణుడి... మీరు కృష్ణుడి యొక్క తేజస్సు వస్తోంది అని చూస్తున్నారు. ఇది అన్నిటికి మూలం. ఆ తేజస్సు యొక్క విస్తరణ బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకంగా ఆధ్యాత్మిక లోకములు, భౌతిక లోకములు, వెలువడతాయి. ప్రతి లోకములో అనేక రకాల జీవులు ఉన్నారు. వాస్తవమునకు మూలము కృష్ణుడి శరీర కిరణాలు. శరీర కిరణాల మూలం కృష్ణుడు.