TE/Prabhupada 0091 - మీరు ఇక్కడ నగ్నముగా నిలబడండి



Morning Walk -- July 16, 1975, San Francisco

ధర్మాధ్యక్ష : ఈ రోజుల్లో నిజానికి వారి లోపం తెలుసుకున్నారు. వారు మరణం గురించి మరింత అధ్యయనం చేస్తున్నారు ప్రజలను మరణం కోసం సిద్ధం చేయుటకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు వారికి చెప్పగలిగింది ఏమిటంటే "అంగీకరించండి." వారు చేయగలిగింది ఏమిటంటే "మీరు మరణిస్తారు" అని చెప్పటము మీరు సంతోషంగా అంగీకరించండి".

ప్రభుపాద: కానీ నేను చనిపోవుట కోరుకోవటం లేదు. నేను ఎందుకు సంతోషంగా ఉంటాను? మీరు ద్రోహులు, మీరు చెప్తున్నారు, "ఆనందంగా ఉండండి." ఆనందంతో, మీరు ఉరి తీయబడుతారు న్యాయవాది మీతో మీరు కేసు.. కోల్పోయారు పర్వాలేదు పట్టించుకోకండి అని చెపుతాడు మీరు ఇప్పుడు ఉల్లాసముగా ఉరితీయబడుతారు

ధర్మాధ్యక్ష : ఇది ఆధునిక మనస్తత్వము యొక్క మొత్తం లక్ష్యం, ఇది ప్రజలు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి అనే వాస్తవమును అంగీకరించేటట్లు మార్చాలి మీరు భౌతిక ప్రపంచం వదిలి వెళ్ళాలి అనే ఒక కోరిక కలిగి ఉంటే, అప్పుడు వారు మిమ్మల్ని వెర్రి వారు అని చెబుతారు. కాదు, ఇప్పుడు మీరు ఈ భౌతిక జీవితములో సర్దుకుపోవాలి బహులాస్వ: జీవితములోని కష్టాలను మీరు అంగీకరించాలి అని బోధిస్తారు. జీవితములోని కష్టాలను మీరు అంగీకరించాలి అని బోధిస్తారు

ప్రభుపాద: ఎందుకు నిరాశ? మీరు ఒక గొప్ప శాస్త్రవేత్త. మీరు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించరు?

బహులాస్వ: వారికీ అవే సమస్యలు ఉన్నవి కాబట్టి వారు పరిష్కరించ లేరు

అదే తర్కము. ఆనందముగా ఉరి తీయబడుతారు. అంతే ఒక కష్టమైన విషయము వచ్చినప్పుడు, వారు వదిలి వేస్తారు అర్థంలేని వాటి గురించి కల్పన చేస్తారు ఇది వారి విద్య విద్య అంటే అత్యంతిక - దుఃఖః - నివృత్తి, అన్ని విపత్తులకు అంతిమ పరిష్కారం అని అర్థం. అది విద్య అంతే కానీ కొంత దూరము వచ్చాక "లేదు, మీరు సంతోషంగా మరణించండి ఆని చెప్పటము కాదు కష్టాలు అంటే ఏమిటి? ఇది కృష్ణుడు వివరించాడు: జన్మ -మృత్యు-జరా-వ్యాధి దుఃఖః దోషాను... ( BG 13.9) ఇవి మీ కష్టాలు. వీటిని పరిష్కరించడం కొరకు ప్రయత్నించండి. వారు వాటిని జాగ్రత్తగా తప్పించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు జననము, మరణము వృద్ధాప్యం లేదా అనారోగ్యమును ఆపలేరు. తక్కువ వ్యవధితో వున్నా జీవితములో, జనన మరణాలతో తక్కువ వ్యవధిలో, వారు చాలా గొప్ప గొప్ప భవనాలు కడుతున్నారు, తదుపరి జీవితంలో అదే భవనములో ఒక ఎలుకగా పుడతారు ప్రకృతి. మీరు ప్రకృతి ధర్మాన్ని మార్చలేరు. మీరు మరణం నివారించలేరు. ఎందుకంటే, ప్రకృతి మీకు మరొక శరీరం ఇస్తుంది ఈ విశ్వవిద్యాలయంలో ఒక చెట్టుగా ఉండండి. ఐదు వేల సంవత్సరాలు నిలబడండి. మీరు నగ్నముగా ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ఎవరూ మీకు అభ్యంతరం చెప్పరు. మీరు ఇక్కడ నగ్నముగా నిలబడండి.