TE/Prabhupada 0104 - జన్మ మృత్యువుల చక్రమును ఆపండి



Lecture on BG 9.1 -- Melbourne, April 19, 1976

పుస్తా కృష్ణడు : ఒక మృగం యొక్క ఆత్మ ఒక మానవుని రూపంలో ఏల వస్తూంది


ప్రభుపాద: జైలులో వున్నా ఒక దొంగ ఎలా విముక్తి పొందుతాడు? అతని శిక్ష సమయము అయిపోయిన వెంటనే అతనికి స్వేచ్చ వస్తుంది అతను మళ్ళీ నేరము చేస్తే అతనిని జైలులో పెడతారు. మానవ జీవితం అవగాహన కోసం వున్నది, నేను వివరిస్తూన్నాను, నా జీవితంలో సమస్య ఏమిటి అని. నాకు చావాలని లేదు కానీ నేను మరణిస్తాను నాకు ముసలివాడిగా మారాలని లేదు. కానీ నేను ముసలివాడిగా మారక తప్పదు Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam (BG 13.9). అదే ఉదాహరణ, ఒక దొంగ వలె అతను, స్వేచ్చగా వున్నప్పుడు అతను ఆలోచించినట్లయితే, ఆలోచిస్తాడు, "నేను ఈ బాధాకరమైన ఆరు నెలల జైలు శిక్షను ఎందుకు అనుభవిస్తున్నాను? ఇది చాల కష్టముగా వున్నది. అప్పుడు అతను నిజానికి మానవుడు అవుతాడు అదేవిధంగా, మానవుడు ఉన్నతమైన ఆలోచనల యొక్క శక్తి కలిగివున్నాడు. అతను "నేను ఈ బాధాకరమైన పరిస్థితిలో ఎందుకు వున్నాము" అని ఆలోచించినట్లయితే అందరూ తాము బాధాకరమైన స్థితిలో వున్నాము అని అంగీకరించాలి. అతను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, కాని ఎటువంటి ఆనందం లేదు. ఆ ఆనందం ఎలా సాధించవచ్చు? ఈ అవకాశం మానవులకు వున్నది కానీ మనము బౌతిక ప్రకృతి యొక్క దయ వలన, మానవ రూపం స్వీకరిస్తే మనము ఆ వరమును సరిగా ఉపయోగించుకోకుండా మనము పిల్లులు కుక్కలు ఇతర జంతువులు వలె, దుర్వినియోగం చేసుకుంటే మన కాలం పూర్తియిన తర్వాత మనము మళ్ళీ ఒక జంతువు రూపమును అంగీకరించవలెను ఇది దీర్ఘ, దీర్ఘ కాల సమయము పడుతుంది ఎందుకంటే ఇక్కడ పరిణామ పద్ధతి ఉన్నాది. మరలా మీ నిర్ణిత కాలము పూర్తి అయినప్పుడు ఈ మానవ రూపం వస్తుంది ఖచ్చితంగా అదే ఉదాహరణ: ఒక దొంగ, అతను తన కారాగార శిక్ష పూర్తవగానే, అతను మళ్ళీ ఒక స్వేచ్చ కలిగిన మనిషి అవ్వుతాడు అతను తిరిగి పాపం చేస్తే తిరిగి జైలుకు వెళ్ళుతాడు జనన మరణ చక్రాము ఉన్నాది. మనము సరిగ్గా మన మానవ రూపమును ఉపయోగిస్తే, అప్పుడు మనము జనన మరణ చక్రమును ఆపగలము. మనము సరిగా మానవ జీవితమును ఉపయోగించు కోకపోతే, మనము జనన మరణ చక్రంలోకి మరోసారి తిరిగి వేళ్ళుతాము.