TE/Prabhupada 0142 - భౌతిక ప్రకృతి చంపే విధానాన్ని ఆపండి
(Redirected from TE/Prabhupada 0142 - బౌతిక ప్రకృతి చంపే విధానాన్ని ఆపండి)
Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975
మొదట ప్రజలందరు అర్థం చేసుకోలేదు. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని. ప్రస్తుత౦ వారు దానిని పట్టించుకోరు. పాపభరితమైన జీవితం మరియు పవిత్రమైన జీవితమునకు మధ్య ఉన్న తేడా వారికీ తెలియదు. కానీ మనము ఈ విషయములను నమ్మలేకపోవచు, అయితే విషయములు అలగానే ఉన్నాయి. మీకు ఏదైనా వ్యాధి సోకితే, అది బయటకు వస్తు౦ది. మీరు నమ్మండి లేదా నమ్మకపోండి, అది పట్టింపు లేదు. ఇక్కడ మా వైద్యుడు ఉన్నారు. అయినకు తెలుసు మీకు ఏదైనా వ్యాధి సోకితే, అది బయటకు వస్తుంది. మనము అనేక గుణాలు కలిగి వున్నాము మూడు గుణాలు ఉన్నాయి - సత్వ గుణము, రజో గుణము, తమో గుణము - మన గుణాల ప్రకారం, మనము వేరే రకమైన శరీరాన్ని అంగీకరించాలి. Karmaṇā daiva-netreṇa (SB 3.31.1). మనలో ప్రతి ఒక్కరము, మనము భౌతిక ప్రకృతి యొక్క గుణాలలో పని చేస్తున్నాము, మన గుణాల ప్రకారం మనము ఒక నిర్దిష్ట రకామైన శరీరాన్ని అంగీకరించాలి tathā dehāntara-prāptiḥ (BG 2.13). దురదృష్టవశాత్తు, దీని గురించి ఏ శాస్త్రం లేదు, ఎ కళాశాల లేదు, ప్రకృతి విజ్ఞాన శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఏ విశ్వవిద్యాలయం లేదు, విషయములు ఎలా జరుగుతున్నాయో అని తెలుసుకోవడానికి Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ (BG 3.27). ప్రకృతి ఇక్కడ ఉన్నాది.
ఈ అంటువ్యాధి కారణంగా మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఇది మన సమస్య. మనము చనిపోవాలి. అది నిజం. మీరు "నేను మరణమును నమ్మను" అని చెప్పితే, అది సరికాదు. మరణం ఉండాలి. మీరు చనిపోవాలి. ఈ విధంగా మన జీవితం కొనసాగుతోంది. మానవ రూపంలో మనం దీనిని సరిదిద్దాగలము. ఇది కృష్ణ చైతన్యము యొక్క పద్ధతి, ప్రకృతి యొక్క విభిన్న భౌతిక గుణాలతో మన స్థిరమైన అనుబంధాన్ని సరిదిద్దుకుంటే ... ఈ అనుబంధము ఫలితంగా, మనము ఒక శరీరమును అంగీకరించి, మరల చనిపోతున్నాము, మరో శరీరాన్ని మళ్ళీ అంగీకరిస్తున్నాము, మళ్ళీ చనిపోతున్నాము. ఈ విధానము నిలిపివేయబడుతుంది. Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama (BG 15.6). ఏదో ఒక్క విధముగా, మీరు ఇంటికి తిరిగి వెళ్ళడానికి సరిపోయే విధముగా ఉంటే, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్లుతారు, Yad gatvā, అప్పుడు మీరు తిరిగి వచ్చేది లేదు. కానీ ఈ భౌతిక బద్ధ జీవితం ఎల్లప్పుడూ దుర్భరముగా ఉంటుంది అని వారు అర్థం చేసుకోరు. వారు అంగీకరించారు, "ఇది చాలా బాగుంది." జంతువులు. జంతువులు, కబేళాశాలలో వలె, అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, అవి వధించబడుచున్నవి. అందరికి తెలుసు. ఆ జంతువులకు కూడా తెలుసు. కానీ జంతు గుణముల వలన, అవి ఏమీ చేయలేవు. అదేవిధంగా, మనము ఈ భౌతిక ప్రపంచం యొక్క కబేళాశాలలో ఉంచబడ్డము. దీనిని mṛtyu-loka అని పిలుస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు తాము చంపబడతామని. నేడు లేదా రేపు లేదా యాబై సoవత్సరాల తర్వాత లేదా నూరు సoవత్సరాల తర్వాత, తాను చంపబడతానని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయిన చనిపోతాడు. మరణం అంటే చంపబడుట ఎవరూ చనిపోవాలని కోరుకోరు. జంతువులు కూడా, చనిపోవుటకు ఇష్ట పడవు. కానీ అవి బలవంతంగా చంపబడ్డాతాయి. దీనిని చంపుట అని అంటాము. అదేవిధంగా, ఎవరు చనిపోవాలని కోరుకుంటారు? ఎవరూ చనిపోవాలని కోరుకోరు. కానీ ప్రకృతి చట్టం ప్రకారము అయిన చంపబడాలి. అది కబేళాశాల. మొత్తం భౌతిక ప్రపంచం కబేళాశాల. మనము గ్రహించవలసి ఉంటుంది. దీనిని mṛtyu-loka అని పిలుస్తాము. ఇది సమస్య. కానీ వారు జంతువుల వలె చాలా తీవ్రంగా తీసుకోరు. జంతువు, అది చాలా తీవ్రంగా తీసుకోదు. అది చనిపోతుంది అని తెలిసిన, అది ఎటువoటి చర్య తీసుకోదు.
మన పరిస్థితి ఇ విధముగానే ఉంటుంది. Mṛtyu-saṁsāra-sāgarāt, Teṣām ahaṁ anukampārtham aham ajñāna-jaṁ tamaḥ. Teṣām ahaṁ samuddhartā mṛtyu-saṁsāra-sāgarāt (BG 12.7). మన స్థానాన్ని మనo అర్థము చేసుకోవాలి. ఎవరూ చనిపోవాలని కోరుకోరు, కానీ అతడు వధించబడ్డాతాడు. మళ్ళీ అయినకు మరొక అవకాశం, మరొక శరీరం ఇవ్వబడుతుంది. మళ్ళీ అతడు వధించబడ్డాతాడు. ఈ ప్రకృతి యొక్క చట్టాలు, ఇ విధముగా జరుగుతున్నాయి. Daivī hy eṣā guṇamayī mama māyā duratyayā (BG 7.14). భౌతిక ప్రకృతి చంపే పద్ధతిని ఎలా ఆపాలనే దానిపై మనము తీవ్రంగా అర్థం చేసుకోవాలి. ఇది మేధస్సు. లేకపోతే, పిల్లులు కుక్కలు వలె సంతోషంగా వుంటాము నేను చాలా చక్కగా తినుచున్నాను దుకుతున్నాను. నన్ను వధించినా పట్టించుకోను, అది మంచి మేధస్సు కాదు. ప్రకృతి యొక్క ఈ చంపే పద్ధతిని ఎలా ఆపాలి అనేది మేధస్సు? ఇది మేధస్సు. అది ఇక్కడ చర్చించబడుతోంది.
ఎవరైనా భక్తియుక్త సేవ ద్వారా చంపబడే పద్ధతి నుండి బయటపడవచ్చు. ఇక్కడ చెప్పబడింది, kecit kevalayā bhaktyā (SB 6.1.15). Kecit. అది సాధారణం కాదు. చాలా అరుదుగా కృష్ణ చైతన్యమునకు వస్తారు. Kecit kevalayā bhaktyā. కేవలం భక్తియుక్త సేవ ద్వారా, వధించబడే ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. Kecit kevalayā bhaktyā (SB 6.1.15) అలా బయిటపడేది ఎవరు? Vāsudeva-parāyaṇāḥ కృష్ణుడి భక్తులు. కృష్ణుడి పేరు వాసుదేవ. అయిన వసుదేవుని కుమారుడు; అందువలన అయిన పేరు వాసుదేవ. వాసుదేవ-పరాయనః. పరయానా అంటే "మన అంతిమ లక్ష్యం వాసుదేవడు, ఇంకేమీ లేదు." వారిని వాసుదేవ-పరాయనః అని పిలుస్తారు. Vāsudeva-parāyaṇāḥ, aghaṁ dhunvanti. Agham అంటే బౌతికము కాలుష్యం అని అర్థము. మనము ఎల్లప్పుడూ బౌతిక కాలుష్యంతో అనుబంధము కలిగి ఉన్నాము. మనము వాసుదేవ-పరాయనః అయితే... Vāsudevaḥ sarvam iti sa mahātmā sudurlabhaḥ (BG 7.19) ఆదే విషయం. ఇక్కడ కెచిత్ అని చెప్పబడినది - చాలా అరుదుగా అని అర్థము. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు vāsudevaḥ sarvam iti sa mahātmā sudurlabhaḥ (BG 7.19). Sudurlabhaḥ చాలా అరుదైనది.