TE/Prabhupada 0154 - మీ ఆయుధమును ఎల్లప్పుడూ పదును పెట్టుకోండి



Room Conversation -- May 7, 1976, Honolulu

తమాల కృష్ణ : మార్క్స్ గురించి మీ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో వచ్చిన మీ వ్యాసంలో మీరు అతణ్ణి అర్ధంలేని వానిగా పిలుస్తారు, మీరు మార్క్సిజం అర్ధంలేనిది అని అంటారు

ప్రభుపాద: అవును, ఆయన తత్వము ఏమిటి? Dialectitude?

తామాల కృష్ణ: డైలాక్టిక్ మెటీర్యలిజం.

ప్రభుపాద: సో, మనము ఒక డైలాక్టిక్ ఆధ్యాత్మికం గురించి వ్రాశాము.

హరి-సౌరి: హరికేస యొక్క.

ప్రభుపాద: హరికేస్సా.

తామాల కృష్ణ: అవును, ఆయన మాకు చదివాడు. ఆయన ప్రచారము చేస్తున్నారు. కొన్నిసార్లు తూర్పు ఐరోపాలో అని నేను అనుకుంటున్నాను. మాకు నివేదిక వచ్చింది. ఆయన మీకు వ్రాసాడా?

ప్రభుపాద: అవును. నేను విన్నాను, కానీ ఆయన సర్రిగ్గా వున్నారా లేదా ?

తామాల కృష్ణ: ఈ నివేదిక నుండి ఆయన కొన్ని తూర్పు ఐరోపా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాడు. ఎక్కువగా ఆయన ఇంగ్లాండ్, జర్మనీ స్కాండినేవియాల్లో దృష్టి కేంద్రీకరించాడు. ఆయన కొంతమందిని కలిగి ఉన్నారు వారు ప్రచారము పుస్తకాల పంపిణి చేస్తున్నారు. కొన్నిసార్లు ఆయన ఏ దేశాలకు వెళ్లాడు?

భక్తుడు: చెకోస్లోవేకియా, హంగేరీ, బుడాపెస్ట్.

తామాల కృష్ణ: ఆయన కొన్ని కమ్యూనిస్ట్ యూరోపియన్ దేశాలకు వెళుతున్నాడు.

భక్తుడు: వారు వారి వ్యాన్లను మరో విధముగా తయారుచేస్తారు వారు అడుగున పుస్తకాలను దాచుతారు. వీటిని సరిహద్దు భద్రత సిబ్భంది వారు చూడకుండా . వాన్ క్రింద అన్ని మీ పుస్తకాలు ఉoటాయి. వారు దేశంలోకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలను పంపిణి చేస్తారు.

తామాల కృష్ణ: విప్లవం.

ప్రభుపాద: ఇది చాలా బాగుంది. భక్తుడు: కొన్నిసార్లు ఆయన మాట్లాడుతూ , ఉంటే ఆయిన చెప్పినది అనువాదకుడు చెప్పలేడు ఎందుకంటే అది ...

తామలా కృష్ణ: కొన్నిసార్లు ఆయన మర్చిపోతాడు - సాధారణంగా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు - ప్రమాదము లేని పదాలు ఉపయోగిస్తాడు. కానీ ఒకటి లేదా రెండుసార్లు ఆయన చెప్పుతాడు, ఆయన నేరుగా కృష్ణ చైతన్యము గురించి మాట్లాడుతాడు. అనువాదకుడు ఆయనని చూసి స్థానిక భాషలోకి అనువదించడు. కొన్నిసార్లు ఆయన తనను తాను మర్చిపోతాడు కృష్ణుడు దేవాదిదేవుడు అని మాట్లాడటం మొదలు పెడతాడు అనువాదకుడు అకస్మాత్తుగా ఆయనని చూస్తాడు. సాధారణంగా ఆయన ప్రతిదీ అనువదిస్తాడు.

ప్రభుపాద: ఆయన మంచి పని చేసాడు. తమలా కృష్ణుడు: ఆయన ఒక తెలివైన వ్యక్తి, చాలా తెలివైనవాడు.

ప్రభుపాద: ఈ విధంగా ... మీరు అందరు తెలివైనవారు, మీరు ప్లాన్ చేయవచ్చు. లక్ష్యం పుస్తకాలను ఎలా పంపిణి చేయడము . ఇది మొదటి లక్ష్యము. భాగావతము మనము ఈ శరీరం మరియు వేర్వేరు భాగాలను కలిగి ఉన్నామాని వివరిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు రథంపై కూర్చొని ఉన్నాడు. రథమును నడిపేవాడు ఉన్నాడు. అక్కడ గుర్రాలు, పగ్గాలు ఉన్నాయి. యుద్ధభూమి, బాణం, విల్లు ఉంది. ఇవి అన్ని అలంకారంముగా వివరించారు. మన కృష్ణ చైతన్యము యొక్క శత్రువులను చంపడానికి దీనిని ఉపయోగించవచ్చు ఆపై ఈ సామగ్రిని రథమును అన్నిటిని విడిచిపెట్టడము, , మనము ... ఉదాహరణకు యుద్ధము తర్వాత, విజయము పొందినప్పుడు మీరు వారిని చంపేస్తారు. అదేవిధంగా ఈ శరీరం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలను ఉన్నాయి. ఈ భౌతిక ఉనికిపై విజయము సాదించడానికి దాన్ని ఉపయోగిoచుకోoడి. ఆపై ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంటికి తిరిగి భగవద్ ధామమునకు వెళ్ళండి.

తమాల కృష్ణ: భక్తులు, మీలా ఎల్లప్పుడూ మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఉత్సాహభరితంగా ఉంటారు అని నేను అనుకుంటాను ...

ప్రభుపాద: మీ ఆయుధాలను పదును పెడుతుoది. ఇది కూడా వివరించబడింది. ఆధ్యాత్మిక గురువుకు సేవచేయడం ద్వారా, మీరు మీ ఆయుధములను ఎల్లప్పుడూ పదునుగా ఉంచుకుంటారు. అప్పుడు కృష్ణుడి నుండి సహాయం తీసుకోండి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలు మీ ఆయుధమునకు పదునుపెడతాయి. And yasya prasādad bhagavata ఆధ్యాత్మిక గురువు ఆనందంగా ఉంటే, అప్పుడు కృష్ణుడు వెంటనే సహాయం చేస్తాడు. ఆయన మీకు శక్తినిస్తాడు. మీ దగ్గర కత్తి ఉందనుకోండి, పదును పెట్టిన కత్తి, కానీ మీకు బలం లేకపోతే, కత్తితో మీరు ఏమి చేస్తారు? కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు. శత్రువులతో పోరాటము ఎలా చేయాలి శత్రువులను ఎలా చంపాలి. అంతా వివరించబడింది. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు guru-kṛṣṇa-kṛpāya (CC Madhya 19.151), మీ ఆయుధమును ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలతో పదును పెట్టుకోండి, అప్పుడు కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు, మీరు జయించగలుగుతారు. ఈ వివరణను గత రాత్రి నేను వివరించాను. ఇక్కడ ఇ శ్లోకము ఉంది, acyuta bala, acyuta bala. ఇక్కడ పృష్ట కృష్ణ వున్నాడ?

హరి-సౌరి: పుష్ట కృష్ణ?

ప్రభుపాద: మనము అర్జునుడి సేవకులము కృష్ణుడి సైనికులము. కేవలం మీరు అనుగుణంగా ఆచరిస్తే, అప్పుడు మీరు శత్రువులను జయిస్తారు. వారి సంఖ్య వంద రెట్లు ఉన్నప్పటికీ వారికి శక్తీ లేదు. ఉదాహరణకు కౌరవులు పాండవులకు వలె, వారికీ శక్తీ లేదు yatra yogeśvaraḥ kṛṣṇaḥ (BG 18.78). మీ వైపున కృష్ణుడిని ఉంచుకోoడి, అప్పుడు ప్రతిదీ విజయవంతమవుతుంది. Tatra śrīr vijayo.