TE/Prabhupada 0155 - ప్రతి ఒక్కరు భగవంతుడు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు



Lecture on SB 7.6.5 -- Toronto, June 21, 1976

ఇప్పుడు, భగవద్గీత నుండి మనము మూడు పదములు తెలుసుకున్నాము. Sanātanaḥ, శాశ్వతమైన, అక్కడ ఉపయోగిస్తారు. మొదటి విషయం ఈ జీవా, ఈ జీవులు, వారు sanātanaḥ గా వర్ణిస్తారు. Mamaivāṁśo jīva-bhūtaḥ jīva-loke sanātanaḥ (BG 15.7). మనము నివసిస్తున్న జీవులము, సనాతనా. మయ యొక్క ప్రభావముతో మనము jīva-bhūtaḥ అయ్యాము అని కాదు మనము మాయ యొక్క ప్రభావంలో మనమే మనల్ని ఉంచుకున్నాము; అందువలన మనం జీవా-భుతః. వాస్తవమునకు మనము sanātana . సనాతనా అంటే శాశ్వతమైనది. Nityo śāśvata. Jivātmā వర్ణించబడింది: nityo śāśvato yaṁ na hanyate hanyamāne śarīre (BG 2.20). అది సనాతన. మనం తక్కువ మేద్దస్సు కలిగి ఉన్నాము, నేను శాశ్వతమైఉంటే, సనతనా, నాకు జన్మ మరణం ఉండదు, నేను జన్మ మరణం యొక్క ఈ కష్టాలలో ఎందుకు పెట్టబడ్డాను? ఇది బ్రహ్మ-జిజ్నాసా అని పిలువబడుతుంది. కానీ మనము ఈ విద్యను నేర్చుకోలేదు కానీ మనము ఈ విద్యను నేర్చుకోవాలి. కనీసం మనము ఈ ఆదేశము యొక్క లాభమును తీసుకోవాలి. మనము sanātana. భగవద్గీతలో ప్రస్తావించబడిన మరో ప్రపంచం వున్నది, paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ (BG 8.20). Vyakto 'vyaktāt sanātanaḥ ఈ భౌతిక ప్రపంచం వ్యక్తమవుతుంది, దీని నేపథ్యం మొత్తం భౌతిక శక్తి, మహత్-తత్వా. అది వ్యక్తము కాదు. vyakto 'vyaktāt. దీనికి మించి మరొక ప్రపంచము వున్నది., ఆధ్యాత్మిక ప్రపంచము, సనాతన. దీనిని sanātana అని పిలుస్తారు. Paras tasmāt tu bhāvo 'nyo vyakto 'vyaktāt sanātanaḥ (BG 8.20). మరియు jīva-bhūtaḥ-sanātana. పదకొండవ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని సనతనగా వర్ణించాడు. మూడు sanātana. మూడు సనాతన.

మనం అందరము శాశ్వతము, sanātana-dhāma వున్నది. కృష్ణుడు sanātana శాశ్వతముగా ఉన్నారు., మనము కూడా శాశ్వతముగా ఉన్నాము. అందువల్ల ఇవి అన్ని కలిసి ఉనప్పుడు, దీనిని sanātana-dharma అని పిలుస్తారు. వారికి sanātana అంటే ఏమిటో తెలియదు. నేను ఒక నిర్దిష్ట మార్గంలో దుస్తులు ధరించి ఉంటే నేను ఒక నిర్దిష్ట సమాజంలో జన్మించినట్లయితే, నేను sanātana-dharma అవుతాను అని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ సనాతనా-ధర్మ గా మారవచ్చు. కానీ వారికి sanātana యొక్క అర్థం ఏమిటో తెలియదు. ప్రతి జీవి శాశ్వతము. కృష్ణుడు, దేవుడు కుడా సనాతనుడు. మనం కలిసే చోటు ఒకటి వున్నది - సనతనా ధామ. సనాతనా ధామ, సనాతన-భక్తి, సనాతన-ధర్మ. దీనిని అమలు చేసినప్పుడు, దీనిని sanātana-dharma అని పిలుస్తారు. సనాతన-ధర్మము అంటే ఏమిటి? నేను సనాతనా-ధామమునకు తిరిగి వెళ్ళినప్పుడు, దేవుడు ఉన్నాడు, సనాతన, నేను సనాతనముగా ఉన్నాను. మన సనాతన కార్యకలాపాలు ఏమిటి? నేను సనాతన ధామమునకు వెళ్ళినప్పుడు నేను దేవుడు అవుతాను అని అర్థమా లేదు. మీరు దేవుడు కారు. ఎందుకంటే దేవుడు ఒక్కరే. అయిన దేవాదిదేవుడు, యజమాని, మనము సేవకులము. చైతన్య మహాప్రభు: jīvera svarūpa haya nitya kṛṣṇa dāsa (CC Madhya 20.108-109). ఇక్కడ మనలో ప్రతి ఒక్కరు, కృష్ణుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాము కానీ మీరు సనాతన-దామమునకు తిరిగి వెళ్ళినప్పుడు, అప్పుడు మనము - మనకు అర్హత లేకపోతే మనం వెళ్లలేము - ఇప్పుడు మనము నిత్యము భగవంతుని సేవలో పాలుపంచుకుంటాము. అది సనాతన-ధర్మము. మీరు సాధన చేయండి.

Sanātana-dharma అంటే అర్థము ఈ భక్తి-యోగా. ఎందుకంటే మనము మర్చిపోయాము. అందరూ దేవుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడి సేవకుడిగా ఎలా మారాలనే దానిపై ఇప్పుడు సాధన చేయండి. మీకు అర్హత వస్తే, నిజానికి, ఇప్పుడు మీరు ... ఇది భక్తి-మార్గా. మీరు దేవుని సేవకుడు అయ్యారు. అని హామీ ఇస్తున్నాను. చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు gopī-bhartur pada-kamalayor dāsa-dāsa-dāsa-dāsānudāsaḥ. భగవంతుని యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకులు కావడానికి మీరు నిపుణులు అయితే వంద సార్లు క్రిందకి, సేవకులుగా - అప్పుడు మీరు పరిపూర్ణమవ్వుతారు (CC Madhya 13.80). కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవాదిదేవుడు కావాలని ప్రయత్నిస్తున్నారు. "అహమ్", "అహాo బ్రహ్మాస్మి" అనే పదాన్ని దుర్వినియోగం చేస్తూ, "నేను మహోన్నతమైన వ్యకిని అని అనుకుంటున్నారు." కానీ అది కాదు. ఇవి వేదముల పదాలు, కానీ 'హామ్ " అంటే నేను దేవుణ్ణి అని అర్ధము కాదు. "హామ్ అంటే" నేను కూడా అదే లక్షణములు కలిగివున్నాను. " ఎందుకంటే mamaivāṁśo jīva-bhūtaḥ (BG 15.7) జీవుడు కుడా భగవంతుడు కృష్ణుడి ఆoశ, అందువలన ఒక్కటే లక్షణములు. మీరు సముద్రం నుండి ఒక నీటి చుక్కను తీసుకోండి. సముద్ర మొత్తం నీరు మరియు ఒక నీటి చుక్క రసాయనిక కూర్పు - రొండు ఒక్కటే. అది 'హమ్ లేదా బ్రహ్మాస్మి అని పిలువబడుతుంది. మనము ఈ పదాలను దుర్వినియోగం చేయకూడదు, వేదముల ప్రకారము, "నేను దేవుణ్ణి, నేను దేవుడు అయ్యాను అని తప్పుగా అనుకుంటున్నాము. నీవు దేవుడివి అయితే, నీవు ఎందుకు కుక్క అవుతావు? దేవుడు కుక్క అవుతాడా? లేదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే మనము సుక్ష్మ కణము. అది కూడా శాస్త్రములో చెప్పబడినది:

keśāgra-śata-bhāgasya
śatadhā kalpitasya ca
jīvaḥ bhāgo sa vijñeya
sa anantyaya kalpate
(CC Madhya 19.140)

మన ఆధ్యాత్మిక గుర్తింపు ఏమిటంటే మనము వెంట్రుక కోన యొక్క పదివేల భాగము. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, దానిని పది వేల భాగాలుగా విభజించాము, ఇది మన గుర్తింపు. ఆ చిన్న గుర్తింపు ఈ శరీరంలో ఉంది. మీరు ఎక్కడ కనుగొంటారు? మీకు అలాంటి యంత్రం లేదు. అందువలన మనము నిరాకారా అని చెప్తాము. లేదు, కానీ ఆకారము ఉన్నది. కానీ అది చాలాస్వలపము మరియు చిన్నది ఈ బౌతిక కళ్ళతో చూడటం సాధ్యం కాదు. మనము వేదాల ద్వారా చూడాలి. Śāstra cakṣuṣa ఇది వేదాంత సారంసము. మనము శాస్త్రము ద్వార చూద్దాం. ఈ మొద్దుబారిన కళ్ళు ద్వార. అది సాధ్యం కాదు.