TE/Prabhupada 0156 - మీరు మరచి పోయిన దాని గురించి నేను బోధించుటకు ప్రయత్నిస్తున్నానుArrival Address -- London, September 11, 1969

విలేఖరి: మీరు ఏమి ప్రయత్నిస్తున్నారు ప్రచారము చేస్తున్నారు, సర్?

ప్రభుపాద: నేను మీరు మర్చిపోయిన విషయమును ప్రచారము చేస్తున్నాను.

భక్తులు: హరిబోల్! హరే కృష్ణ! (నవ్వు)

విలేఖరి: ఏమిటది?

ప్రభుపాద: ఇది దేవుడు. మీలో కొందరు దేవుడు లేడని చెప్తుంటారు, మీలో కొందరు దేవుడు చనిపోయాడని చెపుతున్నారు, మీలో కొందరు దేవుడుకినిరాకరి లేదా శూన్యము అని చెపుతున్నారు. ఇవి అన్ని అర్ధంలేనివి. దేవుడు ఉన్నాడని నేను ఈ అజ్ఞానులకు ప్రచారము చేస్తూన్నాను. ఇది నా లక్ష్యం. ఏవరైనా అర్ధం లేకుండా వాదించే వారు నా దగ్గరకు రావచ్చు., దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. ఇది నా కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది నాస్తిక ప్రజలకు ఒక సవాలు. దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనము ముఖాముఖిగా కూర్చొని ఉన్నాము, మీరు ముఖాముఖిగా దేవుడిని చూడవచ్చు. మీరు నిజాయితీగలవారైతే మీరు తీవ్రంగా ఉంటే, అది సాధ్యమే. దురదృష్టవశాత్తు, మనము దేవుడుని మరచిపోవాలని ప్రయత్నిస్తున్నాము; అందువల్ల మనము జీవితంలో చాలా కష్టాలను ఆలింగనం చేస్తుకుంటున్నాము. మీరు కృష్ణ చైతన్యమున్ని కలిగి ఉండి ఆనందంగా ఉండాలని నేను బోధిస్తున్నాను. ఈ అర్ధము లేని మాయ, లేదా భ్రమ వలన కొట్టుకు పోవద్దు. ఇది నా అభ్యర్థన. భక్తులు: హరిబోల్!