TE/Prabhupada 0252 - మనము స్వేచ్ఛా, స్వతంత్రంగా ఉన్నామని అనుకుంటున్నాము



Lecture on BG 2.6 -- London, August 6, 1973


ఈ భౌతికవాదులందరు, ఫూల్స్, రాస్కల్స్, మరియు దుష్టులు, వారు ఈ భౌతిక పనులను పెoచుతున్నారు. వారు ఈ పెరుగుతున్న భౌతిక పనులను పెంచుకోవడము ద్వార సంతోషంగా ఉంటామని ఆలోచిస్తున్నారు. లేదు. అది సాధ్యం కాదు. దురాశయ యే ... వారి నాయకులు ... Andhā yathāndhair upanīyamānās te 'pīśa-tantryam uru-dāmni baddhāḥ ( SB 7.5.31) మన అందరి చేతులు కాళ్ళు చాలా గట్టిగా కట్టి వేయ బడి ఉన్నాయి, మనము స్వేచ్ఛా, స్వతంత్రంగా ఉన్నామని ఆలోచిస్తున్నాం. భౌతిక ప్రకృతి యొక్క చట్టాల ద్వారా ... అయినప్పటికీ, మనం స్వతంత్రులమని భావిస్తున్నాము. శాస్త్రవేత్తలు దేవుడిని నివారించడానికి ప్రయత్నo చేస్తుంటారు, విజ్ఞాన శాస్త్రముముతో స్వతంత్రముగా. అది సాధ్యం కాదు. మనము భౌతిక ప్రకృతి యొక్క పట్టు లో ఉన్నాము. భౌతిక ప్రకృతి అంటే కృష్ణుడిని యొక్క ప్రతినిధి. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) Prakṛteḥ kriyamāṇāni guṇair karmāṇi sarvaśaḥ (BG 3.27). మనము అర్జునుడిలాగే కలవరపడుచున్నాము, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అని. కానీ మనము ఈ సూత్రాన్ని తీసుకుంటే, "మనము కృష్ణుడి కోసం చేయాలి ..." కృష్ణుడి నుండి దర్శకత్వం తీసుకోండి కృష్ణుడిని ప్రతినిధి నుండి దర్శకత్వం తీసుకోండి మీరు చేయండి అప్పుడు కర్మ-బంధనము ఉండదు. Karmāṇi nirdaheti kintu ca bhakti-bhājām (Bs. 5.54). లేకపోతే, మనము ప్రతి కర్మ యొక్క ప్రతి క్రియల ద్వారా కట్టుబడి ఉంటాము. మనము బయటకు పొలేము. ఈ గందరగోళము, "నేను పోరాడాలా లేదా పోరాడకూడద అని," అది వివరిస్తాను. అవును, మీరు కృష్ణుడి కోసం పోరాడాలి, అప్పుడు అది సరియైనది Kāmaḥ kṛṣṇa-karmārpane.. హనుమoతుడి లాగానే. అయిన భగవంతుడు రామచంద్రుని కోసం పోరాడాడు. అయిన తన కోసం పోరాడలేదు. అదేవిధంగా, అర్జునుడు, అయిన జెండా కపి-ద్వజా, అయిన జెండ హనుమాన్ తో గుర్తించబడ్డింది. అతనికి తెలుసు. హనుమంతుడు, ఒక గొప్ప యోధుడు, రావణుడితో తో పోరాడాడు, తన వ్యక్తిగత ఆసక్తి కోసము కాదు. రావణుడి చేతిలో నుండి సీతా అమ్మవారిని ఎలా బయటకు తీసుకు రావాలనే ఆసక్తి, మొత్తం కుటుంబాన్ని చంపి, బయటకు రావటానికి ఆమెను రామచంద్రుని వైపు కూర్చునివ్వటానికి. ఇది హనుమాన్, భక్తుల విధానం. రావణుడి విధానం "రాముడి నుండి సీతను దూరంగా తీసుకు వెళ్ళి ఆనందించడము." ఇది రావణ విధానం. హనుమంతుని విధానం: "రావణుడి నుండి సీతను తీసుకు వచ్చి ఆమెను రాముడి వైపు కూర్చునివ్వడము." అదే సీత. సీత అంటే లక్ష్మీ. అందువల్ల లక్ష్మీ అంటే నారాయుని ఆస్తి, దేవుడు ఆస్తి.

అందువల్ల ఈ భౌతిక వ్యక్తులు, రావణులు, వారు దేవుడు ఆస్తిని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని మనము గ్రహించాలి. ఏదో ఒక్క మార్గము ద్వార ...మనము రావణుడి తరగతి వ్యక్తులతో పోరాడలేము. అంటే ... మనము బలంగా లేము. అందువల్ల మనము ఒక యాచించేవాని విధానాన్ని తీసుకుoటున్నాము: సర్, మీరు ఉన్నతమైన వ్యక్తి. మాకు ఏదైన ఇవ్వండి. మాకు ఏదైన ఇవ్వండి. మీరు దేవుడు ఆస్తిని ఉంచుకోవడము ద్వారా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మీరు నరకమునకు వెళ్తున్నారు. ఏదో ఒక్క విధముగా, మీరు మా సభ్యుడిగా ఉంటే, మీరు రక్షించ బడతారు. మీరు రక్షించ బడతారు. " ఇది మా విధానం. మేము యాచించే వారిమి కాదు. కానీ ఇది ఒక విధానం. ఇప్పుడు రావణులతో పోరాడటానికి మేము చాల బలంగా లేము. లేకపోతే, యుద్ధముతో మేము డబ్బు అంతా తీసుకొనే వాళ్ళము. కానీ అది సాధ్యం కాదు. మేము అంత బలంగా లేము. అందువల్ల మేము యాచించే వారి విధానం తీసుకున్నాము. ధన్యవాదాలు.