TE/Prabhupada 0301 - చాలా తెలివైన వ్యక్తులు, వారు నృత్యం చేస్తున్నారు



Lecture -- Seattle, October 2, 1968


ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును చైతన్య మహాప్రభు ఉపదేశముల ద్వారా అర్థం చేసుకోవాలి. అయిన ... ఐదు వందల సంవత్సరాల క్రితం, అయిన బెంగాల్లో ఆవిర్భవించారు, భారతదేశములో ఒక రాష్ట్రములో, అయిన ప్రత్యేకంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారము చేశాడు. భారతదేశంలో జన్మించిన ఎవరైనా కృష్ణ చైతన్య సందేశాన్ని తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారము చేయాలి. ఆ ఉత్తర్వును అమలు చేయడానికి మేము మీ దేశానికి వచ్చాము. నా అభ్యర్థన మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును అర్థం చేసుకునేందుకు ప్రయత్నిoచండి, మీ జ్ఞానంతో, పరిశీలనతో. దీన్ని గుడ్డిగా అంగీకరించకండి. మీ వాదనలు, విజ్ఞానం, తర్కం, అవగాహనతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి - మీరు మానవులు - నిస్సందేహంగా, శ్రేష్ఠమైనదిగా, అద్భుతమైనదిగా మీరు కనుగోoటారు. మేము ఈ పుస్తకం, చైతన్య మహాప్రభు ఉపదేశములు, ఇతర పుస్తకాలను కూడా ప్రచురించాము. వాటిని చదవడానికి ప్రయత్నించండి. మనపత్రిక ఉన్నది, "బ్యాక్ టు గాడ్ హెడ్" మనం నృత్యం చేస్తున్నాం, మేము మూడ విశ్వాసము కలిగిన వారము కాదు. నృత్యమునకు గొప్ప విలువ కలిగి ఉంది; మీరు మాతో నృత్యం చేస్తే, మీరు ఆస్వాదిస్తారు. ఇక్కడ ఎవరో వెర్రి వారు నృత్యం చేస్తున్నారు అని కాదు. చాలా తెలివైన వ్యక్తులు, వారు నృత్యం చేస్తున్నారు. ఇది చాలా మంచిగా ఉన్నది ఒక్క చిన్న బాలుడు కూడ - అయిన ఒక బాలుడు - అయిన పాల్గొనవచ్చు. ప్రపంచమంతా. చేరండి, హరే కృష్ణని కీర్తన చేయండి నృత్యం, చేయండి మీరు గ్రహిస్తారు. చాలా సులభమైన పద్ధతి. మీరు ఏవైనా ఉన్నతమైన తత్వము లేదా పదాలు యొక్క గారడీ గురించి అర్థం చేసుకోవడం లేదు. సరళమైన విషయము. సరళమైన విషయము ఏమిటి? దేవుడు గొప్పవాడు, ప్రతి ఒక్కరికి తెలుసు, దేవునిలో మనము ఒక్క భాగం. మనం గొప్పవారితో కలిపి ఉన్నప్పుడు, మనం కూడా గొప్పవారము. ఉదాహరణకు మీ శరీరం వలె, మీ శరీరం యొక్క ఒక చిన్న భాగం, ఒక చిన్న వేలు లేదా బొటనవేలు, దానికి కుడా అదే విలువ , మొత్తము శరీరం యొక్క అదే విలువ. కానీ ఆ చిన్న భాగం లేదా పెద్ద భాగం శరీరం నుండి వేరు చేయబడిన వెంటనే, దానికి విలువ లేదు. దానికి విలువ లేదు. ఈ వేలు, మీ శరీరములో చాలా చిన్న భాగం. ఏదైన నొప్పి ఉంటే, మీరు వేలాది డాలర్లు ఖర్చు పెడతారు. మీరు వైద్యుడికి చెల్లిస్తారు, వేలాది వేల డాలర్లను, నయం చేయటానికి , వైద్యుడు చెప్పుతాడు "ఈ వేలుని," ఏమంటారు వేరు చేయబడాలి లేదా కత్తిరించ బడాలి, వేరు, లేకపోతే మొత్తం శరీరం సోకుతుంది ఈ వేలు మీ శరీరం నుండి కత్తిరించినప్పుడు, మీరు దానిని పట్టించుకోరు. దానికి విలువ లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక టైపురైటింగ్ యంత్రం, ఒక చిన్న స్క్రూ, అది లేదు ఆన్నప్పుడు, మీ యంత్రం చక్కగా పని చేయదు, మీరు మరమ్మతు దుకాణానికి వెళతారు. అయిన పది డాలర్లు వసూలు చేస్తాడు. మీరు వెంటనే చెల్లిస్తారు. ఆ చిన్న స్క్రూ, అది ఆ యంత్రం నుండి బయటకు వచ్చినప్పుడు, దానికి విలువ లేదు ఒక పైసా విలువ కూడా చేయదు. అదేవిధంగా, మనము దేవునిలో భాగము. మనము దేవునితో పని చేస్తే, అంటే కృష్ణ చైతన్యము లేదా దేవుడు చైతన్యములో పనిచేస్తే, ఆ "నేను భాగం ..." ఈ వేలు పూర్తిగా నా శరీరం యొక్క చైతన్యముతో పని చేస్తుంది . చిన్న నొప్పి ఉన్నప్పుడల్లా నేను అనుభవిస్తాను . అదేవిధంగా, మీరు కృష్ణ చైతన్యంలో ఉంటే, మీరు మీ సరళమైన స్థితిలో జీవిస్తున్నారు, మీ జీవితం విజయవంతమవ్వుతుంది. మీరు కృష్ణ చైతన్యమును విడచి పెట్టిన వెంటనే , మొత్తం సమస్య ఉంటుoది. మొత్తం ఇబ్బంది ఉంటుoది. తరగతిలో ప్రతి రోజు మేము అనేక ఉదాహరణలు ఇస్తాము మనం సంతోషంగా ఉండాలనుకుంటే ఈ కృష్ణ చైతన్యమున్ని అంగీకరించాలి, మనము సాదారణ స్థితిలో వుండాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం.