TE/Prabhupada 0453 - నమ్మండి. కృష్ణుడి కంటే ఉన్నతమైన ప్రామాణికము లేదు



Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977


దేవుడికి భావనలు లేవు అని అనుకోవద్దు, ఆలోచించడం, భావనలు లేవు. కాదు. ప్రతీదీ ఉన్నది ఆయనలో సానుభూతి భావనలు లేకపోతే, మనకు అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఎందుకంటే ప్రతిదీ దేవుడు నుండి వస్తోంది. Janmādy asya yataḥ ( SB 1.1.1) Athāto brahma jijñāsā. బ్రహ్మణ్ అంటే ఏమిటి? బ్రహ్మణ్ అంటే ప్రతిదానికీ వాస్తవ మూలము. అది బ్రహ్మణ్. Bṛhatvāt bṛhanatvāt.

ఈ భావము దేవుడిలో లేనట్లయితే, అప్పుడు అతను దేవుడిగా ఎలా ఉoటాడు, ఈ భావన? ఒక అమాయక చిన్న పిల్లవాడు వచ్చి మనకు కొంత గౌరవం ఇస్తే, వెంటనే మనము దయా భావనను కలిగి ఉంటాము: ", ఇక్కడ ఒక మంచి పిల్లవాడు ఉన్నాడు." భగవంతుడు కృష్ణుడు, నరసింహస్వామి, అతను కూడ pariplutaḥ అయ్యడు, దయను కలిగిఉన్నాడు, సాధారణ దయ కాదు, "ఈ పిల్లవాడు ఎంత అమాయకముగా ఉన్నాడు." చాలా ఆనందముగా, utthapya, వెంటనే అతనిని పైకి లేపారు: "నా ప్రియమైన బాలుడా, పైకి లెమ్ము." వెంటనే తలపై తన చేతిని ఉంచారు. Utthāpya tac-chīrṣṇy adadhāt karāmbujam. Karāmbhuja, కమలపు చేతిని, కమలపు అరచేతిని. ఈ భావనలు ఉన్నాయి. అతను కోరుకున్నాడు ... ఈ అబ్బాయి భ్రాంతి చెందాడు ఎందుకంటె అటువంటి గొప్ప మూర్తి , స్తంభము నుండి వచ్చినది, తండ్రి, గొప్ప తండ్రి, చనిపోయాడు, సహజముగా అతను కొద్దిగా మనస్సులో కలత కలిగి ఉంటాడు. అందువలన vitrasta-dhiyāṁ kṛtābhayam: "నా ప్రియమైన కుమారుడా, భయపడవద్దు. ప్రతీదీ సరిగ్గానే ఉన్నది. నేను ఉన్నాను, భయం అవసరము లేదు. శాంతముగా ఉండు. నేను నీకు రక్షణ ఇస్తాను. " ఇది సంభాషణ. కావున అవసరం లేదు ..., చాలా జ్ఞానము కలిగిన మనిషిగా మారడానికి, Vedantist ... కేవలం ఈ విషయలు అవసరం: మీరు అమాయకముగా ఉండండి భగవంతుని అంగీకరించండి, అతని కమల పాదముల వద్ద ఆశ్రయము తీసుకోండి - ప్రతిదీ పూర్తి అవ్వుతుంది ఇది కావలెను: సరళత్వము. సరళత్వము. కృష్ణుడిని నమ్మడము. కృష్ణుడు చెప్పినట్లుగ, mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ... ( BG 7.7) నమ్మoడి! కృష్ణుడి కంటే ఉన్నతమైన ప్రామాణికము లేదు.

అతడు చెప్పుతాడు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) ఇది ఉపదేశము. ఈ అన్ని సూచనల సారంశము. దేవదిదేవుడుని కృష్ణుడిని నమ్మండి. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని నమ్మoడి. అమాయకపు పిల్లవాడు నమ్ముతాడు, కానీ మన మనస్సు చాలా నిస్తేజముగ ఉంది, మనము విచారణ చేయాలి, అర్చామూర్తి రాయితో లేదా ఇత్తడితో లేదా చెక్కతో చేయబడినదా? ఎందుకంటే మనము అమాయకులము కాదు. అర్చామూర్తి అనేది ఇత్తడితో చేయబడినది అని మనము ఆలోచిస్తున్నాము. అది ఇత్తడి అయినా, ఇత్తడి దేవుడు కాదా? ఇత్తడి కూడా దేవుడే. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir..., apareyam..., bhinnā me prakṛtir aṣṭadhā ( BG 7.4) ప్రతీది కృష్ణుడే. కృష్ణుడు లేకుండ మనుగడ లేదు. కృష్ణుడు తనకు ఇష్టము వచ్చినట్లుగా ఎందుకు అవతరించకూడదు? అతను ఇత్తడిలో అవతరించవచ్చు. అతను రాతిలో అవతరించవచ్చు. అతను చెక్కలో అవతరించవచ్చు. అతను ఆభరణాలలో అవతరించవచ్చు. అతను పెయింటింగ్లో అవతరించవచ్చు. అతను ఏ విధముగా అయినా... అది మొత్తము శక్తివంతమైనది. కానీ మనము దానిని తీసుకోవాలి" ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు." కృష్ణుడు అర్చామూర్తి నుండి వేరుగ ఉన్నాడు అని తీసుకోవద్దు, ఇక్కడ మనకు ఒక ఇత్తడి అర్చామూర్తి ఉన్నది. కాదు Advaitam acyutam anādim ananta-rūpam (Bs. 5.33). Advaita. ఆయనకు బహుళ విస్తరణలు ఉన్నాయి, కానీ అవి అన్ని ఒక్కటే.

అదేవిధముగా, అతను అతని నామములో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Abhinnatvān nāma-nāminoḥ ( CC Madhya 17.133) మీరు కృష్ణుడి పవిత్ర నామమును కీర్తిస్తూన్నప్పుడు, ఇది ధ్వని తరంగము అని అనుకోవద్దు. మరియు కృష్ణుడు వేరు కాదు Abhinnatvān. Nāma-cintāmaṇi-kṛṣṇaḥ. ఎట్లాగైతే కృష్ణుడు చింతామణినో, అదేవిధముగా, అతని పవిత్ర నామము కూడా చింతామణి. Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ. చైతన్యం, పూర్తి చైతన్యం, nāma-cintāmaṇi-kṛṣṇaḥ. మనము కృష్ణ నామముతో సాంగత్యము కలిగి ఉంటే, మీరు తెలుసుకోవాలి, కృష్ణుడు మీ సేవను పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాడు మీరు చెప్పుతున్నారు, He Kṛṣṇa! He Rādhārāṇī! దయచేసి నన్ను మీ సేవలో నిమగ్నం చేయండి." హరే కృష్ణ మంత్ర అంటే, హరే కృష్ణ, He Kṛṣṇa, he Rādhārāṇī, హే శక్తి, దయతో మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి. Ayi nanda-tanuja patitaṁ kiṅkaraṁ māṁ viṣame bhavāmbudhau. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశము. "ఓ నా ప్రభు, Nanda-tanuja..." కృష్ణుడు చాల సంతోషముగా ఉంటాడు, అతని పేరుతో, అతని కార్యక్రమాలతో, అతని భక్తులతో మీరు సాంగత్యము చేస్తే. అతడు నిరాకారము కాదు. కృష్ణుడికి నామము లేదు, కానీ అతను తన భక్తుడితో వ్యవహరించినప్పుడు, అతనికి నామము ఉంది. ఉదాహరణకు నంద మహారాజుతో కృష్ణుడు వ్యవహరించినట్లు, నంద మహారాజు యొక్క చెక్క చెప్పులను... యశోదమాత ఆ పిల్లవాడిని, కృష్ణుడిని అడిగారు - మీరు చిత్రం చూసి ఉంటారు - "నీవు నీ తండ్రి యొక్క చెప్పులను తీసుకురాగాలవా?" అవును! వెంటనే తలపై పెట్టుకున్నారు. మీరు చూడoడి? ఇది కృష్ణుడు. అందువల్ల నంద మహారాజు ఎంతో సంతోషించారు: "ఓ, నీ కుమారుడు చాలా బాగున్నాడు, అతను అలాంటి బరువును భరించగలడు." ఇది వ్యవహారము.

అందువల్ల చైతన్య మహాప్రభు కృష్ణుడిని సంభోదిస్తున్నారు, ayi nanda-tanuja: ఓ కృష్ణ, నంద మహారాజు శరీరము నుండి జన్మించినవాడా ... తండ్రి శరీరము-ఇస్తున్న వ్యక్తి, విత్తనము, విత్తనము ఇస్తున్న తండ్రి, అదేవిధముగా, కృష్ణ, అతను ప్రతిదాని యొక్క మూలం అయినప్పటికీ, కానీ ఇప్పటికీ, అతను నంద మహారాజు యొక్క విత్తనము ద్వారా జన్మించాడు. ఇది కృష్ణ-లీల. Ayi nanda-tanuja patitaṁ kiṅkaraṁ māṁ viṣame bhavām-budhau ( CC Antya 20.32 Śikṣāṣṭaka 5) చైతన్య మహాప్రభు ఎప్పుడూ కృష్ణుడిని "సర్వశక్తిమంతుడా" అని సంభోదించలేదు. ఇది నిరాకారము. అతను చెప్పారు ayi nanda-tanuja, "నంద మహారాజు కుమారుడా." నంద మహారాజు కుమారుడు. ఇది భక్తి. అతను అపరిమితమైనవాడు. కుంతీదేవిఆశ్చర్యపోయినది, ఆమె అనుకున్నది కృష్ణుడు యశోద మాతకు భయపడ్డాడు అని. ఆ śloka మీకు తెలుసు.అందువలన అతను..., ఆమె ఆశ్చర్యపోయినది కృష్ణుడు, ఎంతటి గొప్పవాడు, ఉన్నతుడు అందరు అతనికి భయపడతారు, కానీ అతను యశోద మాతకు భయపడ్డాడు. "

దీనిని భక్తులు ఆనందించవచ్చు, భక్తులు కాని... భక్తులు కాని వారికి లేదా నాస్తికులకు అర్థం కాదు. అందువల్ల కృష్ణుడు చెప్పుతాడు, bhaktyā mām abhijānāti ( BG 18.55) భక్తులు మాత్రమే, ఇతరులు కాదు. ఇతరులకు, ఈ రాజ్యంలో ఎటువంటి ప్రవేశము లేదు, అర్ధము చేసుకోవడానికీ. మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే అది భక్తి ద్వారా మాత్రమే. ఏ జ్ఞానం లేదా యోగము లేదా కర్మ , ఏదీ - ఏదీ మీకు సహాయం చేయదు. కేవలం భక్తుడు మాత్రమే. ఎలా భక్తుడు అవ్వాలి? ఎంత సులభం? ఇక్కడ ప్రహ్లాద మహారాజు, అమాయక బాలుడు, కేవలం తన ప్రణామములను అర్పిస్తున్నాడు. కృష్ణుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) మీరు ఈ నాలుగు అంశాలను హృదయపూర్వకముగా చేస్తే - ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచించండి ... హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, (భక్తులు కీర్తనలో కలిసారు) హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది కృష్ణుడి, గురించి ఆలోచించడము. man-manā మీరు ఈ కృష్ణుడి మంత్రాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు మీరు పవిత్రమైన భక్తులు అయితే. పవిత్రమైన భక్తి లేకుండా ఇది చాలా కష్టము. ఇది అలసట ఇస్తుంది. కానీ మనము సాధన చేస్తాము. Abhyāsa-yoga-yuktena ( BG 8.8)