TE/Prabhupada 0476 - ఆధారపడే స్థానం సరైనదైతే ఆధార పడటం తప్పు కాదుLecture -- Seattle, October 7, 1968


స్వతహాగా నా స్థితి శరణగతుడవటమని నాకు తెలియదు, మరియూ ఆ శరణగతి సూత్రమే నా జీవితం, నా సంతోషకరమైన జీవితం. ఎలాగైతే ఒక చిన్నపిల్లవాడు తల్లిదండ్రుల కోరికలకు అంగీకారం తెలుపినట్లయితే, అతని జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల కోరికలకు అంగీకారం తెలుపుతుంది, ... ఇది పద్ధతి, వైదిక పద్ధతి. ఒక స్త్రీ, స్వభావరీత్యా, ఒకరిపై ఆధారపడి ఉండాలి. కృత్రిమంగా, స్త్రీ స్వేచ్ఛను కోరుకుంటే, అప్పుడు ఆమె జీవితం విచారకరంగా మారుతుంది, దుఃఖదాయకమౌతుంది. కాబట్టి వైదిక పద్ధతి ... నేను తయరుచేసినది కాదు, నేను వైదిక సూత్రాల ప్రామాణికంగా మాట్లాడుతున్నాను. మను-సంహిత, వైదిక ధర్మాలు, మనువు, మనవాళి యొక్క యజమాని, మనువు ... మనువు మానవజాతికి తండ్రి. అందువలన ఆయన తన న్యాయశాస్త్రాన్ని రూపొందించాడు. భారత దేశంలో హిందువుల విషయానికి వస్తే ఇప్పటికి వారు ఈ శాస్త్రాన్ని పాటిస్తున్నారు. అలాంటి ఆ పుస్తకం మను-సoహితలో, ఇలా చెప్పబడింది, Na striyaṁ svatantram arhati. స్త్రీకి స్వతంత్ర్యం ఇవ్వకూడదని ఆయన చట్టాన్ని చేసాడు. అప్పుడు? జీవితం ఎలా వుండాలి? జీవితం ఎలా వుండాలంటే వివాహం జరగనంత వరకు , తల్లిదండ్రులపై ఆధారపడి, వారి మార్గదర్శకత్వంలో ఆమె జీవించాలి. మరియు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తపై ఆధారపడి జీవించాలి. భర్త నుండి విడివడిన తర్వాత ... ఎందుకంటే హిందూ పద్ధతి ప్రకారం, మరణించే వరకు, అన్ని రోజులు భర్త ఇంటిలోనే ఉండడు. లేదు. పిల్లలు పెరిగిపెద్దవాళ్ళయిన తర్వాత, ఆయన భర్యాపిల్లలను విడిచిపెట్టి సన్యాసిగా మారతాడు, నేను మారిన విధముగా. నాకు నా కుమారులు, నా మనవళ్లు ఉన్నారు, నాకు నా భర్య ఇప్పటికీ ఉంది ... కాని నేను అన్ని సంబoధాలను త్యజించాను. అయితే నా భర్య ఎలా పోషించబడుతుంది? ఆమె ఎదిగిన పిల్లలను కలిగి ఉంది. కాబట్టి ఆందోళన లేదు. కాబట్టి ఆధారపడే స్థానం సరైనదైతే ఆధార పడటం తప్పు కాదు.. పెళ్లికాని అమ్మాయి బాగోగులు చూసుకోవడాన్ని ఏ తండ్రి నిర్లక్షం చేయడు, తన పెళ్లి కాని అమ్మాయిల మరియు అబ్బాయిల విషయాన్ని. హిందూ పద్ధతి ప్రకారం, ఒక తండ్రి, తల్లి బాధ్యత ఎప్పుడు పూర్తవుతుందంటే ఆయన కుమర్తె లేదా కుమారుని వివహం చేసిన తర్వాత. చాలా పెద్ద బాధ్యత. అప్పుడు వారి బాధ్యత నెరవేరుతుంది. కాబట్టి ఆధరపడటం, నేను ఆధరపడటం గురించి మట్లాడుతున్నాను. కాబట్టి ఆధారపడటం తప్పు కాదు; శరణాగతి పొందుట తప్పు కాదు. స్త్రీలు భర్తకు శరణాగతి పొందుట ఆచరణాత్మకంగా నేను చూశాను ... అయినప్పటికీ భారతదేశంలో చాలా మంది మహిళలు ఉన్నారు, వారు చాలా సంతోషంగా ఉన్నారు మరియు వారి జీవితం ఎంతో అధ్బుతంగా వుంది. కాబట్టి మనము కార్యాచరణ ఎలా చేయాలో తెలుసుకోవాలి. స్వతంత్ర్యం, కృత్రిమమైన స్వతంత్ర్యం ఎప్పుడూ మంచిది కాదు. ఆచరణాత్మకంగా, మనకు స్వతంత్ర్యం లేదు. నేను స్వతంత్ర్యం పొందటం గురించి ఆలోచించవచ్చు, కానీ ఆచరణాత్మకంగా నాకు స్వతంత్ర్యం లేదు. నేను నా ఇంద్రియాలకు సేవకునిగా ఉన్నాను. Kāmādīnāṁ kati na katidhā pālitā durnideśa. మనమందరమూ ఇంద్రియాలను సేవిస్తున్నాము. కాబట్టి నా స్వతంత్రం ఎక్కడ ఉంది? నేను నా తండ్రి నుండి, నా రాష్టం నుండి, నా దేశం నుండి, నా సంఘం నుండి స్వేఛ్ఛను ప్రకటించవచ్చు, కానీ నేను నా ఇంద్రియాలకు దాసున్ని. కాబట్టి నాకు స్వతంత్రం ఎక్కడ ఉంది? కాబట్టి మనం మన స్వరూప స్థితిని గ్రహించాలి, ఏమంటే అన్ని పరిస్థితులలోనూ మనము ఆధారపడేవారము. కాబట్టి నా జీవితం యొక్క పరిపూర్ణత్వం యొక్క ఉత్తమ విధానం ఏమంటే భగవంతునిపై, కృష్ణుడిపై ఆధారపడడం. ఇదే అన్ని సమస్యలకూ పరిష్కారం. మరియు అదే కృష్ణచైతన్య ఉద్యమం. మన స్వరూప స్థితి దేవదేవునికి ,కృష్ణునికి శరణాగతి పొందడం అని గ్రహించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. చాలా సరళమైన విషయం. మీరు దేవదేవునికి శరణాగతి పొందిన తక్షణం, వెంటనే మీరు సంతోషంగా ఉంటారు. Mām eva ye prapadyante māyām etāṁ taanti te