TE/Prabhupada 0539 - మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973


సమాజంలో శాంతి మరియు ప్రశాంతత కోసం మనము ఆత్రుత చెందుతుంటే, అప్పుడు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి మనము చాలా తీవ్రముగా ఉండాలి. ఇది మా అభ్యర్థన. కృష్ణ చైతన్య ఉద్యమమును నిర్లక్ష్యముగా తీసుకోవద్దు ఈ ఉద్యమం ప్రపంచంలోని అన్ని సమస్యలను, ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించగలదు. సామాజిక, రాజకీయ, తాత్విక, మత, ఆర్థిక - ప్రతిదీ కృష్ణ చైతన్యము ద్వారా పరిష్కరించుకోవచ్చు. అందువల్ల, నాయకులుగా ఉన్నవారిని మనము అభ్యర్దిస్తున్నాము, గౌరవనీయులు, ఆయన ఇక్కడ ఉన్నట్లు, మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇది చాలా శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది. ఇది మానసిక కల్పన లేదా సెంటిమెంట్ ఉద్యమం కాదు. ఇది చాలా శాస్త్రీయమైన ఉద్యమం. కాబట్టి మనము అన్ని దేశాల నుండి నాయకులు అందరిని ఆహ్వానిస్తున్నాము: అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తెలివిగా ఉంటే, మీరు వాస్తవమునకు న్యాయముగా ఆలోచిస్తే, మీరు అర్థం చేసుకుంటారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మానవ సమాజం యొక్క సంక్షేమం కోసం ఉత్కృష్టమైన ఉద్యమం. అది వాస్తవము. ఎవరైనా రావచ్చు. ఈ విషయాన్ని చర్చించడానికి మనము సిద్ధముగా ఉన్నాము. Kṛṣṇa bhūliyā jīva bhoga vāñchā kare. మనము కాదు ...

మన మానవ జీవితం, మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం అమరత్వాన్ని సాధించడం. Tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) ఇది మన ... మనము దీనిని మర్చిపోయాము. మనము కేవలం పిల్లులు కుక్కల జీవితాన్ని గడుపుతున్నాము, మన జీవితాన్ని పరిపూర్ణము సాధించగలమని ఎటువoటి అవగాహన లేకుండా ఎప్పుడైతే ఇక జన్మ ఉండదో, ఇక మరణం ఉండదో. అమృతత్వానికి అవకాశం ఉందని కూడా మనకు అర్థం చేసుకోలేము. కాని ప్రతిదీ సాధ్యమే. Amṛtatvam. ఎవరూ చనిపోవాలని కోరుకోరు. అది సత్యము. ఎవరూ వృద్ధుడు కావాలని కోరుకోరు, ఎవరూ వ్యాధి కావాలని కోరుకోరు. ఇది మన సహజమైన ఆసక్తి.. ఎందుకు? ఎందుకంటే వాస్తవానికి,మన ఆధ్యాత్మిక రూపంలో జన్మ, మరణం, వృద్ధాప్యము, వ్యాధి ఏదీ లేదు. జలచరాలు, పక్షులు, మృగాలు, మొక్కలు, చెట్ల నుండి పరిణామాత్మక పద్ధతి ద్వారా, మీరు ఈ రూపమునకు వచ్చినప్పుడు, మానవ రూపము ఉన్న శరీరము తర్వాత ... Aśītiṁ caturaś caiva lakṣāṁs tād jīva-jātiṣu. ఇది పరిణామ పద్ధతి. మనము మానవ శరీర రూపానికి వచ్చాము. అప్పుడు జీవిత లక్ష్యమేమిటో తెలుసుకోవాలి. జీవిత లక్ష్యం అమృతత్వము, అమరునిగా మారడము. అది ... మీరు కేవలం కృష్ణ చైతన్యముతో అమరునిగా మారవచ్చు. కృష్ణుడు చెప్తాడు. ఇది వాస్తవము. మనము కేవలం అర్థం చేసుకోవాలి. Janma karma me divyaṁ yo jānāti tattvataḥ. మీరు కృష్ణుడిని వాస్తవముగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినట్లయితే, tattvataḥ, అప్పుడు, tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, మీరు ఏ భౌతిక శరీరాన్ని అంగీకరించరు. మీరు ఏ భౌతిక శరీరం అంగీకరించకపోతే , దాని అర్థం మీరు అమరునిగా మారారు. ఎందుకంటే సహజముగా మనము అమరులము.

కావున కృష్ణుడు అవతరిస్తాడు, కృష్ణుడు అవతరించి ఈ పాఠాన్ని నేర్పుతాడు మీరు స్వభావం ద్వారా అమరులుగా ఉన్నారు. ఒక ఆత్మగా మీరు నాలో భాగంగా ఉన్నారు నేను అమరునిగా ఉన్నాను. కావున మీరు కూడా అమరులు. అనవసరముగా, మీరు ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. "

mamaivāṁso jīva bhūto
jīva-loke sanātanaḥ
manaḥ saṣṭanindriyāni
prakṛti-sthāni karṣati
(BG 15.7)

కేవలం పోరాటం కోసం ..., అనవసరంగా. అత్యుత్తమమైన విషయము ఏమిటంటే జీవితంలో చాలా రకములుగా మీరు ఇంద్రియ జీవితాన్ని అనుభవించారు, పిల్లుల వలె, కుక్కల వలె దేవతల వలె, చెట్ల వలె, మొక్కల వలె, కీటకాల వలె. ఇప్పుడు, ఈ మానవ రూపంలో, ఇంద్రియ జీవితం ద్వారా ఆకర్షించబడవద్దు. కేవలం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది శాస్త్రముల యొక్క తీర్పు. Nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye ( SB 5.5.1) కుక్కలు మరియు పందుల వలె ఇంద్రియ తృప్తి కోసం ఎంతో కష్టపడి పనిచేయడానికి, మానవ జీవితం యొక్క ఆశయం కాదు. మానవ జీవితం కొద్దిగా తపస్సు కోసం ఉద్దేశించబడింది. Tapo divyaṁ putrakā yena śuddhyet sattvam. మన జీవితమును పవిత్రము చేసుకోవాలి. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం. ఎందుకు నేను నా సత్వ ఉనికిని పవిత్రము చేసుకోవాలి? Brahma-saukhyam tv anantam. అప్పుడు మీరు అపరిమితమైన ఆనందం, అపరిమితమైన సుఖమును పొందుతారు. అది వాస్తవమైన ఆనందం. Ramante yogino 'nante satyānanda-cid-ātmani iti rāma-padenāsau paraṁ brahmābhidhīyate ( CC Madhya 9.29)