TE/Prabhupada 0542 - గురువు యొక్క యోగ్యత ఏమిటి? అందరూ గురువు ఎలా అవుతారు
(Redirected from TE/Prabhupada 0542 - గురువు యొక్క యోగ్యత ఏమిటిఅందరూ గురువు ఎలా అవుతారు)
Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973
కాబట్టి కృష్ణుడు చెప్తాడు ācāryaṁ māṁ vijānīyān: ( SB 11.17.27) నీవు ఆచార్యుడిని నన్నుగా అంగీకరించు. ఎందుకు? ఆయనను ఒక మనిషిగా నేను చూస్తున్నాను. ఆయన కుమారులు ఆయనని తండ్రి అని పిలుస్తారు, లేదా ఆయన ఒక మనిషి వలె కనిపిస్తాడు, కాబట్టి ఎందుకు ఆయన భగవంతునికి సమానముగా చూడాలి? ఎందుకంటే అతను భగవంతుడు మాట్లాడినదే మాట్లాడతాడు, అంతే. అందువలన. ఆయన ఏ మార్పు చేయలేదు. భగవంతుడు చెప్పినట్లుగా, కృష్ణుడు చెప్పినట్లుగా, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కృష్ణుడు లేదా భగవంతునికి మీరు శరణాగతి పొందవలనని గురువు చెప్పారు. అదే సందేశము. భగవంతుడు చెప్పారు man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) గురువు చెప్తాడు, మీరు కృష్ణుడిని గురించే ఎల్లప్పుడూ ఆలోచించాలని, మీరు ఆయనకు శరణాగతి పొందవలనని, మీరు ఆయనకు ప్రార్థనచేయండి, మీరు ఆయనకు భక్తుడు అవండి. మార్పు లేదు. ఎందుకంటే దేవాదిదేవుడు చెప్పినదే ఆయన చెప్తాడు, అందువలన ఆయన గురువు. ఆయన భౌతికంగా జన్మించినట్లు మీరు చూస్తున్నప్పటికీ, ఆయన ప్రవర్తన ఇతర వ్యక్తులు వలె ఉన్నపటికీ. కానీ ఆయన మాట్లాడేటప్పుడు వేదాలలోని సత్యము యథాతథంగా చెప్పినందున, లేదా భగవంతుడు చెప్పినది, అందువలన ఆయన గురువు. ఎందుకంటే ఆయన (వెర్రిగా) ఇష్టం వచ్చినట్టు ఎటువంటి మార్పు చేయలేదు, అందువలన ఆయన గురువు. అది నిర్వచనం. ఇది చాలా సరళము. చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరూ గురువు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ. ఎందుకంటే గురువు అవసరం ఉంది. ప్రపంచము దుష్టులుతో నిండి ఉంది, అందువల్ల వారికి ప్రచారము చేయడానికి చాలా గురువుల అవసరం ఉంది. కానీ గురువు యొక్క యోగ్యత ఏమిటి? అందరూ గురువు ఎలా అవుతారు? ఈ ప్రశ్న, తదుపరి ప్రశ్న కావచ్చు. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పినది, āmāra ājñāya guru hañā tāra ei deśa ( CC Madhya 7.128) ఎయి దేశా అంటే మీరు ఎక్కడ జీవిస్తున్న, మీరు గురువు అవ్వండి మరియు వారిని విముక్తుల్ని చేయండి. మీరు చిన్న గ్రామములో నివసిస్తున్నారని అనుకుందాం, మీరు ఆ పొరుగువారికి గురువుగా మారవచ్చు వారిని విముక్తుల్ని చేయవచ్చు. ఎలా సాధ్యమవుతుంది? నాకు విద్య లేదు, నాకు జ్ఞానం లేదు. నేను గురువు ఎలా కాగలను మరియు వారిని ఎలా విడుదల చేయగలను?" చైతన్య మహాప్రభు ఇది కష్టము కాదు అని అన్నారు. Yāre dekha tāre kaha 'kṛṣṇa'-upadeśa ( CC Madhya 7.128) ఇది మీ అర్హత. మీరు కేవలం కృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని అందిస్తే మీరు గురువు అవుతారు. కృష్ణుడు చెప్తారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) మీరు ప్రచారము చేయండి, మీరు ప్రతి ఒక్కరినీ కోరండి, "అయ్యా, మీరు కృష్ణునికి శరణాగతి పొందండి." మీరు గురువు అవుతారు. చాలా సులభమైన విషయం. కృష్ణుడు అన్నారు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) మీరు అదే చెప్తారు "మీరు కృష్ణుడి భక్తుడు కండి, మీరు ప్రణామములు అర్పించండి. ఇక్కడ ఒక ఆలయం ఉంది; ఇక్కడ కృష్ణుడు ఉన్నారు. దయచేసి ఇక్కడికి రండి. మీరు మీ ప్రణామములు అందిస్తారు, మరియు మీరు ఇవ్వగలిగినట్లైతే patraṁ puṣpaṁ phalaṁ toyaṁ ( BG 9.26) మీరు సమర్పించలేరా... కాని చాలా సులభమైన విషయం. ఎవ్వరైనను చిన్న పుష్పం, కొంచెం పండు, కొంచెం నీటిని ఇవవచ్చు. ఇది చాలా కష్టము కాదు."
కాబట్టి ఇది గురువు యొక్క అర్హత. గురువు ఏ మాయాజాలాన్ని చూపించడు లేదా కొన్ని అద్భుతమైన వస్తువులను ఉత్పత్తి చేస్తే, అప్పుడు ఆయన గురువు అవుతాడు, లేదు. కాబట్టి ఆచరణాత్మకంగా నేను దీనిని చేసాను. నేను అద్భుతాలు చేశానని ప్రజలు నాకు కీర్తి ఇస్తున్నారు, కానీ నా అద్భుతం ఏంటంటే నేను చైతన్య మహాప్రభు యొక్క సందేశమును తీసుకు వచ్చాను: yāre dekha tāre kaha 'kṛṣṇa'-upadeśa ( CC Madhya 7.128) కాబట్టి ఇది రహస్యము. మీలో ఎవరైనా, మీరు గురువు కావచ్చు. నేను అసాధారణ వ్యక్తిని కాను, అసాధారణ భగవంతున్ని కాదు. కొంత మర్మమైన ప్రదేశం నుండి రావడానికి. ఇది అది కాదు - ఇది చాలా సులభమైన విషయం