TE/Prabhupada 0597 - మన జీవితంలో కొంత ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972


ప్రతి ఒక్క జీవి భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఆయన వ్యాధి. ఆయన ఆధిపత్యము చేయాలని కోరుకుంటున్నారు. ఆయన సేవకుడు, కాని కృత్రిమంగా, ఆయన భగవంతుడుగా మారాలని కోరుకుంటున్నారు. ఇది వ్యాధి. ప్రతి ఒక్కరూ... అంతిమంగా, భౌతిక ప్రపంచం మీద ఆయన ఆధిపత్యం చేయలేకపోతే, అతను చెప్తాడు ఓ...ఈ భౌతిక ప్రపంచం అసత్యము. ఇప్పుడు నేను మహోన్నతమైన బ్రహ్మణ్ తో కలిసిపోతాను. బ్రహ్మ సత్యమ్ జగం మిథ్య. కానీ జీవాత్మ అనేది కృష్ణుడి యొక్క భాగం మరియు అంశం ఎందుకంటే, స్వభావము వలన ఆయన ఆనందముగా ఉంటాడు. ఆయన ఆనందం కోరుతూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరూ, మన జీవితంలో కొంత ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఆ ఆనందకర జీవితం ఆధ్యాత్మిక తేజస్సులో ఉండదు.

అందువల్ల శ్రీమద్-భాగవతం లో మనకు ఈ సమాచారం లభిస్తుంది, అది āruhya kṛcchreṇa paraṁ padam ( SB 10.2.32) Kṛcchreṇa, తీవ్రమైన తపస్సు మరియు ప్రాయశ్చిత్తములు చేసిన తరువాత, బ్రహ్మణ్ తేజస్సులో విలీనం కావచ్చు. Sāyujya-mukti. It is called sāyujya-mukti. Sāyujya, to merge. సాయుజ్య -ముక్తి. ఇది సాయుజ్య-ముక్తి అంటారు. సాయుజ్య , విలీనం కావడం. కాబట్టి āruhya kṛcchreṇa paraṁ padam. ఒకరు ఆ స్థాయి వరకు వచ్చినా కూడా బ్రహ్మణ్ తేజస్సులో విలీనం అయ్యే వరకు, తీవ్రముగా ప్రాయశ్చిత్తము మరియు తపస్సు తరువాత కూడా, వారు పడిపోతారు. Patanty adhaḥ. అధః మళ్లీ ఈ భౌతిక ప్రపంచం లోకి వస్తారని అర్థం. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adhaḥ ( SB 10.2.32) ఎందుకు పడిపోతారు? Anādṛta-yuṣmad-aṅghrayaḥ. వారు భగవంతుడు వ్యక్తి అని వారు అంగీకరించరు. వారు ఎప్పటికీ అంగీకరించరు. వారి అతి చిన్న బుద్ధి ,మనస్సు భగవంతుడు, మహోన్నతమైన ఒక వ్యక్తి కావచ్చు అని ఒప్పుకోదు. ఎందుకంటే ఆయన తన లేదా ఇతరుల వ్యక్తుల యొక్క అనుభవం కలిగి ఉన్నందున. భగవంతుడు నాలాంటి నీలాంటి వ్యక్తి అయితే, ఆయన ఎలా విశ్వంలో, అసంఖ్యాకమైన విశ్వాలు సృష్టించగలడు?

అందువలన భగవంతుని దేవాదిదేవుని అర్థం చేసుకునేందుకు, తగినంత పవిత్ర కార్యక్రమాలు అవసరం. భగవద్గీతలో ఇది చెప్పబడింది, said, bahūnāṁ janmanām ante ( BG 7.19) నిరాకార తాత్విక మార్గంలో కల్పనలు చేసిన తరువాత, ఎవరైతే పక్వ స్థితికి వస్తారో bahūnāṁ janmanām ante jñānavān, ఆయన నిజానికి తెలివైనవాడు అయినప్పుడు. ...అంతకాలం అతను అర్థంచేసుకోలేడు. మహోన్నతమైన పరమ సత్యము వ్యక్తి అని , sac-cid-ānanda-vigraha... (Bs. 5.1). అది brahmeti paramātmeti bhagavān iti śabdyate. Bhagavān. vadanti tat tattva-vidas tattvaṁ yaj jñānam advayam ( SB 1.2.11) ఇది శ్రీమద్-భాగవతంలోని ప్రకటన: "సంపూర్ణ సత్యం తెలిసిన వారు, వారు తెలుసుకుంటారు అది బ్రహ్మణ్, పరమత్మా భగవాన్, వారు ఒకటే అని ఇది మాత్రమే వివిధ దశల్లో అవగాహన మాత్రమే." ఉదాహరణకు మీరు సుదూర ప్రదేశం నుండి ఒక కొండను చూసినట్లయితే, మీరు నిరాకారంగా, అస్పష్టంగా, కొన్ని మేఘాల వలె చూస్తారు. మీరు ఇంకా ముందుకు పోతే, అది ఆకుపచ్చగా ఉన్నది అని మీరు చూడవచ్చు. మరియు నిజానికి మీరు కొండ లోపలకి వెళ్తే, మీరు చాలా జంతువులు, చెట్లు, వ్యక్తులను చూస్తారు. అదేవిధముగా, సుదూర ప్రదేశం నుండి లేదా దూరం నుండి సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు, వారు కల్పన ద్వారా తెలుసుకుంటారు, నిరాకార బ్రహ్మణ్ . ఇంకా ముందుకు ఉన్నత స్థానముకు వెళ్లిన, యోగులు, వారు స్థానికంగా ఉన్న ఆకారాన్ని చూడగలరు. Dhyānāvasthita-tad-gatena manasā paśyanti yaṁ yoginaḥ ( SB 12.13.1) వారు చూడగలరు, ధ్యాన అవస్థిత, స్థానికంగా వారి లోపల ఉన్న , ఇది పరమాత్మ ఆకారం. మరియు ఎవరైతే భక్తులో, వారు దేవాదిదేవుడైన కృష్ణుడిని, ఎదురెదురుగా, మరొక వ్యక్తిని చూసినట్లు చూస్తారు. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13)