TE/Prabhupada 0598 - ఆయన ఎంత గొప్పవాడు అని మనము అర్థం చేసుకోలేము! ఇది మన మూర్ఖత్వం



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972


కాబట్టి వాస్తవానికి, అంతిమ, సంపూర్ణ సత్యం యొక్క చివరి పదం వ్యక్తి. కానీ, కానీ దురదృష్టవశాత్తు, ఎవరైతే మూఢులో, లేదా తక్కువ మేధస్సు కలవారో, avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam ( BG 9.11) ఓహ్ కృష్ణుడు? ఆయన భగవంతుడు కావచ్చు, కానీ ఆయన ఒక వ్యక్తిగా మారెను, మాయ యొక్క సహాయం తీసుకుని. ఇది మాయావాదా తత్వము. వారు మాయను చదువుతున్నారు; వారు భగవంతుణ్ణి కూడా మాయలో ఉంచుతారు. ఇది మాయావాదా తత్వము. కానీ భగవంతుడు మాయ కాదు. భగవంతుడు ఎప్పుడూ మాయ చేత కప్పబడడు. కృష్ణుడు చెప్తాడు అది mām eva ye prapadyante māyām etāṁ taranti te: ( BG 7.14) ఎవరైనా నన్ను శరణాగతి పొందుతారో, అతను మాయ బారి నుండి విముక్తి పొందుతాడు. కృష్ణుడు మాయలో ఎలా ఉంటారు? ఇది మంచి తత్వము కాదు. కేవలం కృష్ణునికి శరణాగతి పొందుట ద్వారా, మీరు మాయ నుండి విముక్తి పొందవచ్చు. ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, కృష్ణుడు మాయలో ఎలా ఉంటారు? అందుచేత కృష్ణుడు చెప్పెను, avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam, paraṁ bhāvam ajānantaḥ ( BG 9.11) భగవంతుడు ఎంత శక్తివంతమైనవాడో వారికి తెలియదు, ఆయన ఎంత శక్తివంతమైనవాడు. వారు సర్వశక్తిమంతుడైన ప్రభువును స్వామిని తన శక్తితో పోల్చుకుంటారు. ఒక కప్ప తత్వము. డాక్టర్ ఫ్రాగ్. కప్ప పరిశీలిస్తోంది, "అట్లాంటిక్ మహాసముద్రం బావి కంటే కొద్దిగా పెద్దదై ఉంటుంది." ఎందుకంటే అది ఎల్లప్పుడూ జీవిస్తున్నది. కూపస్థ-మండూక-న్యాయ. సంస్కృతములో దీనిని కూపస్థ-మండూక-న్యాయ అని పిలుస్తారు. కూప అంటే బావి అని అర్థం, మండూక అంటే కప్ప. కప్ప బావిలో నిరంతరం ఉంటుంది, ఎవరైనా ఆయనకి తెలియచేస్తే అక్కడ మరొక గొప్ప పరిమాణములో నీరు ఉందని, అట్లాంటిక్ మహాసముద్రం ఉందని అతడు, కేవలం అది "ఈ బావి కన్నా కొంచం పెద్దదిగా ఉంటుంది, ఈ బావి కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది" అని లెక్కిస్తాడు. కానీ ఆయన ఎంత గొప్పవాడు అని అతడు అర్థం చేసుకోలేడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడు అని మనము అర్థం చేసుకోలేము! ఇది మన మూర్ఖత్వం. మనము కేవలం లెక్కిస్తూ: "ఆయన నా కంటే ఒక అంగుళం ఎక్కువ కావచ్చు. లేదా నాకన్నా ఒక అడుగు ఎక్కువ. "ఇది మానసిక కల్పన. అందువల్ల కృష్ణుడు చెప్పారు, manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: ( BG 7.3) అనేక లక్షల మంది మనుష్యులలో, ఒకరు తన జీవితాన్ని విజయవంతం చేసుకునేందుకు, సంపూర్ణ వాస్తవమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మరియు yatatām api siddhānāṁ kaścin māṁ vetti tattvataḥ ( BG 7.3) కాబట్టి మన మానసిక కల్పన ద్వారా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. ఆత్మ యొక్క కొలత ఏది మనకు అర్థం కాదు. అది సాధ్యం కాదు. అందువల్ల మనకు ఉన్నత ప్రామాణికం, కృష్ణుడినుండి సమాచారం తీసుకోవాలి, పరమ సత్యం యొక్క స్వభావం ఏమిటి? ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? మనము వినవలసి ఉంటుంది. మనము వినవలసి ఉంటుంది. అందువలన వేదముల సాహిత్యమును శ్రుతి śruti అని పిలుస్తారు. మీరు ప్రయోగాన్ని చేయలేరు. అది సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు, ఒక వర్గము వారు ఇలా ఆలోచిస్తారు అది వారు ప్రయోగాన్ని చేయగలమని, వారు మానసిక కల్పన ద్వారా భగవంతుని తెలుసుకోగలమని భావిస్తున్నారు. బ్రహ్మ సంహిత చెప్పినది:

panthās tu koṭi-śata-vatsara-sampragamyo
vāyor athāpi manaso muni-puṅgavānām
so 'py asti yat prapada-sīmny avicintya-tattve
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.34)

Panthās tu koṭi-śata-vatsara-sampragamyaḥ. అనేక లక్షల సంవత్సరాలు, మీరు భగవంతుని కనుగొనేందుకోసం ఆకాశంలో మీరు ప్రయాణము చేస్తే, భగవంతుడు ఎక్కడ ఉన్నారు... Panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi. ఈ సాధారణ విమానములో కాదు, కానీ గాలి యొక్క విమానంలో, గాలి వేగముతో. లేదా మనస్సుతో. మనస్సు యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే, మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు, మీకు ఒక ఆలోచన వస్తే మీ మనస్సు లక్షలాది మైళ్ల దూరంలో వెళ్ళగలదు. కాబట్టి మనస్సు యొక్క విమానం లేదా గాలి యొక్క విమానం ద్వారా, అనేక లక్షల సంవత్సరాలు ప్రయాణం చేసినా మీరు కనుగొనలేరు.

Panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi manaso muni-puṅga... (Bs. 5.34). ముని-పుంగవానామ్. కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, కానీ గొప్ప పవిత్రమైన సాధువులు, ఋషులు, వారు కూడా కనుగొనలేరు