TE/Prabhupada 0599 - కృష్ణ చైతన్యం అంత సులభం కాదు.మీకు మీరుగా శరణాగతి పొందకపోతే మీరు పొందలేరు
Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972
బ్రహ్మ సంహిత లో వేరొక చోట చెప్పబడింది: వేదేషు దుర్లభమదుర్లభమాత్మ - భక్తౌ (BS 5.33). వేదేషు. మీరు కేవలం వేదాలను అధ్యయనం చేస్తే, వేదముల అధ్యయనం యొక్క అంతిమ లక్ష్యం కృష్ణుడిని తెలుసుకోవడం అయినప్పటికీ, కానీ మీ స్వంత కల్పనల ద్వారా వేదాలను అధ్యయనం చేయాలనుకుంటే, ఆయన ఎప్పుడూ అరుదుగా ఉంటాడు. vedesu durlabham adurlabham atma - bhaktah (BS.5.33). కానీ మీరు భగవంతుని భక్తుడిని సంప్రదించినట్లయితే, అతడు మిమ్మల్ని కాపాడగలడు. ఆయన కాపాడగలడు. Mahiyasam pada-rajo-bhisekam niskincananam na vrnita yavat, naisam matis tavad urukramanghsim ( SB 7.5.32) ప్రహ్లాద మహారాజు చెప్తారు, “మీరు కృష్ణ చైతన్యమును కలిగి ఉండలేరు.....” Naisam matis tavad urukramanghsim. కృష్ణ చైతన్యం అంత సులభం కాదు. మీకు మీరుగా శరణాగతి పొందకపోతే మీరు పొందలేరు. Niskincananam, mahiyasam pada-rajo-bhisekam niskincananam na vrnita yavat. ఎంత కాలము మీరు భక్తుడి యొక్క పాదపద్మముల ధూళి తీసుకోకపోతే, నిష్కించనానమ్, ఎవరికైతే ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదో - అతడు కేవలం భగవంతుని యొక్క సేవ గురించే ఆలోచిస్తాడు. మీరు అలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండకపోతే, కృష్ణ చైతన్యమును పొందడము సాధ్యం కాదు. ఇవి శాస్త్రము యొక్క ప్రకటనలు.
కాబట్టి కృష్ణుడు పరమ సంపూర్ణ సత్యము, ఆయన వ్యక్తి. కానీ మనము కృష్ణుని - భక్తుని ద్వారా వెళ్లకపోతే మనం ఆయనను అర్థం చేసుకోలేము. కాబట్టి కృష్ణున్ని అర్థం చేసుకోవడానికి, కృష్ణుడు భక్తుడులాగా దిగివచ్చాడు, శ్రీ చైతన్య మహాప్రభు. Sri - krishna - chaitanya prabhu nityananda sri - advaita gadadhara srivasadi - gaura - bhakta - vrnda. కాబట్టి మనము చైతన్య మహాప్రభు ద్వారా కృష్ణుని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా వచ్చాడు....... కృష్ణాయ కృష్ణ - చైతన్య - నామ్నే. రూప గోస్వామి, ఆయన మొదట చైతన్య మహాప్రభును కలుసుకున్నప్పుడు.... మొదటిసారి కాదు, రెండవసారి. నవాబు హుస్సేన్ షా ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వున్నప్పుడు మొదటిసారిగా ఆయన కలుసుకున్నారు. ఆ తరువాత, సమావేశం తర్వాత, చైతన్య మహాప్రభు వారు తన లక్ష్యమును నెరవేర్చాలని కోరుకున్నారు. కాబట్టి వారు ప్రభుత్వ సేవ నుండి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కృష్ణచైతన్య ఉద్యమాన్ని విస్తరించడానికి చైతన్య మహాప్రభు దగ్గరకు వెళ్లారు. అందువల్ల రూపగోస్వామి అలహాబాద్ ప్రయాగ వద్ద చైతన్య మహాప్రభును కలిసినప్పుడు ఆయన ఈ సంబంధముతో స్వరపరచిన మొదటి శ్లోకము, ఆయన చెప్పాడు, namo maha - vadanyaya krsna - prema - pradaya te : ( cc Madhya 19.53) నా ప్రభు, నీవు అత్యంత ఉదార అవతారము. ఎందుకు? "మీరు కృష్ణ - ప్రేమను పంచుతున్నారు. ప్రజలు కృష్ణుడు అంటే ఏమిటి అని అర్థం చేసుకోలేరు, కృష్ణ - ప్రేమ గురించి ఏమి మాట్లాడగలరు. కానీ ఆ కృష్ణ - ప్రేమ, మీరు చాలా బాగా ప్రచారం దానము చేస్తున్నారు.” నమో మహా - వదన్యా..... “అందువల్ల మీరు చాలా ఉదార, దాతృత్వ వ్యక్తి.” నమో మహా - వదన్యాయ. వదన్య అంటే చాలా దాతృత్వము గలవాడు, దానము మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు