TE/Prabhupada 0600 - మనము శరణాగతి పొందడానికి సిద్ధంగా లేము. ఇది మన భౌతిక వ్యాధి
Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972
కాబట్టి చైతన్య మహాప్రభు, ప్రజలు కృష్ణుడిని తప్పుగా అర్థం చేసుకున్నారు... కృష్ణుడు భగవద్గీతలో " నీవు నా శరణాగతి పొందు" అని అడిగారు. ఆయన ఏమి చెయ్యగలడు? ఆయన భగవంతుడు. ఆయన కృష్ణుడు. అక్కడ ఆయన, మిమ్మల్ని అడుగుతాడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు: " నీవు శరణాగతి పొందు. నేను నిన్ను చూసుకుంటాను." అహం త్వాం సర్వ-పాపె.... కానీ ఇప్పటికీ, ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు; ఓ, నేను కృష్ణుడి శరణాగతి ఎందుకు పొందాలి? ఆయన కూడా నాలాంటి వ్యక్తి. బహుశా కొద్దిగా ముఖ్యము. కానీ నేను ఎందుకు ఆయన శరణాగతి పొందాలి?" ఎందుకంటే ఇక్కడ భౌతిక వ్యాధి శరణాగతి తీసుకోకపోవటం. ప్రతి ఒక్కరూ గర్వంతో వున్నారు: నేను ఎంతో కొంత గోపవాడిని. ఇది భౌతిక వ్యాధి. అందువలన ఈ భౌతిక వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే, మీరు శరణాగతి పొందాలి.
- తద్విద్ది ప్రణిపాతేన
- పరిప్రశ్నేన సేవయా
- ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
- ఙ్ఞానినస్ తత్త్వ- దర్శనః
- ( BG 4.34)
కాబట్టి మీరు శరణాగతి పొందటానికి సిద్ధంగా లేకపోతే.... అది భౌతిక వ్యక్తికి చాలా కష్టమైన పని. ఎవరూ శరణాగతి పొందాలని కోరుకోరు. అతడు పోటీ చేయాలనుకుంటాడు వ్యక్తిగతంగా, వ్యక్తికి వ్యక్తి, కుటుంబానికి కుటుంబం, దేశానికి దేశం, ప్రతి ఒక్కరూ యజమానిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. శరణాగతి పొందాలని ప్రశ్న ఎక్కడ ఉంది? శరణాగతి పొందే ప్రశ్నేలేదు. కాబట్టి ఇది వ్యాధి. అందువల్ల ఈ మూర్ఖత్వాన్ని నయం చేయాలనీ కృష్ణుడు శాసిస్తాడు. లేదా చాలా దీర్ఘకాలిక వ్యాధి, మీరు శరణాగతి పొందండి. సర్వ-ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ( BG 18.66) అప్పుడు నేను శరణాగతి పొందితే, మొత్తం విషయం విఫలమవుతోంది? నా కర్తవ్యము, నా ప్రణాళికలు, నా, చాలా విషయాలు.....?" లేదు. నేను మీ బాధ్యతను స్వీకరిస్తున్నాను. నేను మీ బాధ్యతను స్వీకరిస్తున్నాను. అహం త్వాం సర్వ-పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. చింతించకండి. చాలా హామీ ఉంది. ఇప్పటికీ, మనము శరణాగతి పొందడానికి సిద్ధంగా లేము. ఇది మన భౌతిక వ్యాధి. అందువల్ల కృష్ణుడు మళ్ళీ భక్తుని వలె వచ్చారు కేవలము కృష్ణుడికి ఎలా శరణాగతి పొందటానికి చూపించటానికి. చైతన్య మహాప్రభు కృష్ణ-వర్ణం త్విషో కృష్ణం సాంగోపాంగాస్త్ర-పార్శదం ( SB 11.5.32)
కాబట్టి ఈ కృష్ణచైతన్య ఉద్యమం చాలా శాస్త్రీయమైనది మరియు ప్రామాణికమైనది. అది ఒక నకిలీ విషయం కాదు, మనస్సు యొక్క కల్మషముతో తయారు చెయ్యబడినది కాదు. ఇది ప్రామాణికమైనది, వేదముల సూచనముల ఆధారమైనది, కృష్ణుడు చెప్పిన ప్రకారం, సర్వ-ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ( BG 18.66) కాబట్టి మేము ఈ తత్వాన్నే బోధిస్తాము, మీరు... కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, అత్యున్నతమైన దేవాదిదేవుడు. మీరు భగవంతుణ్ణి శోధిస్తున్నారు. మీరు భగవంతుడు ఎవరో అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, కృష్ణుడు. ఆయన పేరు, ఆయన కార్యక్రమాలు, ప్రతిదీ భగవద్గీతలో ఉన్నాయి. మీరు ఆయనను అంగీకరించి, శరణాగతి పొందండి. కృష్ణుడు చెప్తారు, మన్-మనా భవ మద్-భక్తో మద్-యాజీ మాం నమస్కురు ( BG 18.65) కాబట్టి మేము అదే విషయం మాట్లాడుతున్నాము. భగవద్గీతలో చెప్పబడినది. మేము తప్పుడు వ్యాఖ్యానము చేయము. మేము మొత్తం భగవద్గీతను కలుషితము చేయము. మేము ఈ తప్పుడు పనులను చేయము. కొన్నిసార్లు ప్రజలు, వారు అంటారు, " స్వామీజీ మీరు అద్భుతంగా చేసారు." కానీ అద్భుతం ఏమిటి? నేను ఇంద్రజాలికున్ని కాదు. నా కీర్తి ఏమంటే కేవలము నేను భగవద్గీతను కలుషితం చేయలేదు. దాన్ని యథాతథంగా నేను సమర్పించాను. అందువలన ఇది విజయవంతమయింది.
చాలా ధన్యవాదములు. హరే కృష్ణ( ముగింపు).