TE/Prabhupada 0606 - కానీ మనము భగవద్గీతను యధాతథముగా బోధిస్తున్నాం. ఇది తేడా
Room Conversation -- January 8, 1977, Bombay
భారతీయ మనిషి : ఇక్కడ రోజువారీ ఆదాయం ఎంత? వారు రోజువారీ ఆదాయాన్ని తెలుసుకోవటానికి ఆసక్తిని కలిగి ఉన్నారు, పుస్తకాల అమ్మకాల ద్వారా రోజువారీ ఆదాయం.
ప్రభుపాద: , పుస్తకాల విక్రయం? ఐదు నుండి ఆరు లక్షలు. భారతీయ మనిషి : సరే.
ప్రభుపాద: మీరు అమ్మకాల నుండి ఊహించవచ్చు. భారతీయ మనిషి : ఎంత మందికి ఇది వెళ్ళాలి. ఈ పత్రిక కేవలము ఒక డాలర్ మాత్రమే. అమెరికాలో ఒక రూపాయి. (హిందీ)... వారికి పత్రిక.
ప్రభుపాద: కావున ఇది లిఖితరూపకమైనది. యూరోపియన్లు..., వారు ఇతర మత పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి, ఆసక్తి కలిగి ఉండటానికి వారు ముర్ఖులు మరియు దుష్టులు కాదు, వారి బైబిలు కాదు. మీరు చూడండి? ఇది చాలా గొప్ప శక్తిని కలిగి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో, మనము ఇప్పుడు సమిష్టి ప్రయత్నం చేయవలసి వుంటుంది, అది మరింత సక్రమంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి. నేను ఇప్పుడు ఒంటరిగా చేస్తున్నాను, వీరి సహాయంతో ...కానీ భారతీయులు ఎవరు రావటము లేదు. ఇది ఇబ్బందిగా ఉన్నది.
అశోక్ చుగాని: నేను అనుకుంటున్నాను, పూర్తి గౌరవముతో, చాలామంది భారతీయులు తమ స్వంత గ్రామాలలో లేదా వారి స్వంత జిల్లాల్లో దీనిని చేయటానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుపాద: ఎవరూ చేయడము లేదు.
అశోక్ చుగాని: సరే, ఇటీవల మీరు భరత్పూర్ కు వెళ్ళిన్నట్లయితే, కళ్ళ ఆపరేషన్ కోసం సుమారు 5,200 పడకలు నేత్ర-యజ్ఞముకు ఉన్నాయి.
ప్రభుపాద: నాకు తెలుసు. నాకు తెలుసు. కానీ నేను ఈ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాను.
అశోక్ చుగాని: సంస్కృతి, అవును.
భారతీయ మనిషి : ఇది వారు ఇస్తున్న ప్రత్యేకమైన చికిత్స.
భారతీయ వ్యక్తులు : (అస్పష్టమైనది) ... కర్మ-భాగం, కొంత మంది జాగ్రత్త తీసుకుంటారు.
భారతీయ వ్యక్తి: ఒకరు చేయలేరు....
అశోక్ చుగాని: భక్తిలో మరియు...దానిలో
ప్రభుపాద: కానీ ఒక విషయము ఏమిటంటే మనము భగవద్గీతను యధాతథాముగా ఉపదేశము చేస్తున్నాము. భగవద్గీతలో మీరు ప్రజల కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలని అలాంటి ఒక ప్రకటన లేదు. అటువంటి ప్రకటన లేదు. ఇది మీరు తయారు చేసినది. కానీ మనము భగవద్గీతను యధాతథాముగా బోధిస్తున్నాం. ఇది తేడా. మా బోధనలు ఏమిటంటే కళ్ళకు ఉపశమనం కలిగించటానికి బదులుగా, కళ్ళతో ఈ శరీరాన్ని ఏ మాత్రం అంగీకరింపకుండా ఉండటానికి ఆయనకి ఉపశమనం ఇవ్వండి. మీరు సమస్యకు పరిష్కారం చేయలేరు. కొందరు కళ్ళ జాగ్రత్తలు తీసుకుంటాడు, కొంత మంది వేలును తీసుకుంటాడు, కొంత మంది జుట్టు యొక్క, కొంత మంది మరొదానికి, జననేంద్రియము, మొదలైనవి. ఇది సమస్యను పరిష్కరించదు. ఈ సమస్య భగవద్గీత లో చెప్పినట్లుగా ఉంది..., janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) ఇది బుద్ధి. మీరు జన్మించిన వెంటనే, మీకు కళ్ళు వుంటాయి, మీకు కంటి ఇబ్బంది ఉంటుంది, వ్యాధి. జన్మ -మృత్యు -జరా- వ్యాధి. మీరు జన్మ మృత్యువును అంగీకరిస్తే, అప్పుడు జన్మ మృత్యువు మధ్య వ్యాధి మరియు ముసలితనము. మీరు అంగీకరించాలి. మీరు కొంత ఉపశమనం కలిగించవచ్చు, కానీ మీరు అంగీకరించాలి. కాబట్టి అది పరిష్కారం కాదు. ఈ జన్మ -మృత్యు -జరా- వ్యాధి ఎలా ఆపాలి అనేది పరిష్కారం. అది పరిష్కారం. అది ఉన్నతమైన పరిష్కారం. కాబట్టి మనము ఆ విషయము ఇస్తున్నాం - ఇక కళ్ళ ఇబ్బంది ఉండదు. ప్రధాన వ్యాధి... ఒక మనిషికి వ్యాధి ఉంది అని అనుకుందాం, కాబట్టి కొన్నిసార్లు ఆయన తలనొప్పి, కొన్నిసార్లు కంటి-నొప్పి, కొన్నిసార్లు వేలు-నొప్పితో బాధ పడుతున్నాడు మీరు తలనొప్పి కోసం కొంత ఔషధం ఉపయోగిస్తున్నారు. ఇది పరిష్కారం కాదు. పరిష్కారం ఈ మనిషి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. అది ఎలా నయం చేయాలి? అందువల్ల భగవద్గీత ఆ ప్రయోజనము కోసం ఉద్దేశించబడింది.Tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) మీరు శరీరమును అంగీకరించిన వెంటనే - క్లేసద. Na sādhu manye yato ātmano 'yam asann api kleśada āsa dehaḥ ( SB 5.5.4) ఆసన్నపి. ఈ శరీరము శాశ్వతము కాదు. శరీరము శాశ్వతము కానందున, వ్యాధి కూడా శాశ్వతం కాదు. అందువల్ల కృష్ణుడి సలహా tāṁs titikṣasva bhārata. Mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ ( BG 2.14) మీరు పరిష్కారము తయారు చేయండి - అది ఉన్నతమైన పరిష్కారము, ఎలా ఆపాలి జన్మ మృత్యు కానీ అది వారికి తెలియదు, దీనిని అపివేయవచ్చును వారి తాత్కాలిక సమస్యలతో కేవలం వారు బిజీగా తీరిక లేకుండా ఉన్నారు. వారు దానిని చాలా గొప్పగా తీసుకుంటున్నారు. ఏది గొప్పది? ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక కురుపు ఉంది అని అనుకుందాం. కేవలం గిల్లటము ద్వారా (ఊదడం ధ్వని చేస్తుంది) అది నయం అవుతుందా? అక్కడ శస్త్రచికిత్స ఉండాలి, చీమును బయటకు తీయాలి.
కాబట్టి ఈ ఉద్యమం ఆ ప్రయోజనము కోసం ఉంది. ఇది ఈ జన్మ మృత్యు కొరకు కాదు, నా ఉద్దేశ్యం, తాత్కాలిక జరా-వ్యాధి కి కాదు, అది సరైనది, కానీ కృష్ణుడు చెప్తున్నాడు - మనము కృష్ణుడి సలహాను తీసుకుంటే, భగవద్గీత - అది సమస్య కాదు. చిన్న ఇబ్బంది ఉంటే, తాన్ తితిక్షస్వ భారత. వాస్తవ సమస్య ఏమిటంటే janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) దానిని ఆపడానికి ప్రయత్నించండి. ఇది బుద్ధి. Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) అది సంస్కృతి; అది విద్య - చాలా తాత్కాలిక ఇబ్బందులతో బాధపడటం కాదు. అది చాలా తెలివైనది కాదు. వారికి ఈ సంస్కృతిని, కృష్ణ చైతన్యమును ఇవ్వండి. కాబట్టి మనకు ఈ శరీరము ఉంది. ఎంత కాలము మీకు ఈ శరీరము ఉంటుందో, మీరు కళ్ళకు ఉపశమనం కలిగించవచ్చు, కానీ మరొక ఇబ్బంది వస్తుంది. కళ్ళకు ఉపశమనం కలిగించడం ద్వారా ఆయన అన్ని రకాలైన వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని హామీ లేదు. అది జరుగుతుంది... అది జరుగుతుంది, janma-mṛtyu..., er, mātrā-sparśās tu kaunteya ( BG 2.14) ఉపశమనం ఇవ్వండి, వాస్తవమైన ఉపశమనం, ఎలా ఆపాలి... ఇది మన వేదముల నాగరికత, మీరు తండ్రి కాకూడదు, మీరు తల్లి కాకూడదు, మీరు జన్మ మరియు మరణ చక్రం నుండి మీ పిల్లలకు రక్షణ ఇవ్వలేకుంటే. Pitā na sa syāj jananī na sā syāt na mocayed yaḥ samupeta-mṛtyum ( SB 5.5.18) ఇది వాస్తవమైన సమస్య. వాస్తవ సంస్కృతి ఏమిటంటే "ఈ పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడు, అందుచేత మనం ఆయనకు శిక్షణనివ్వాలి, అది ఏ విధమైన శరీరమును అంగీకరించకుండా ఉండటానికి." ఎందుకంటే మనము శరీరాన్ని అంగీకరించిన వెంటనే... ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన విషయము, కానీ భగవద్గీత బోధిస్తుంది, yadā yadā hi dharmasya glānir bhavati ( BG 4.7) ప్రజలు ఈ సమస్యను మరచిపోయినప్పుడు, జన్మ -మృత్యు -జరా- వ్యాధి, కృష్ణుడు వ్యక్తిగతంగా వచ్చి వారికి బోధిస్తారు "ఇది మీ సమస్య."