TE/Prabhupada 0888 - హరే కృష్ణ కీర్తన చేయండి భగవంతుడిని అర్థము చేసుకోండి



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


హరే కృష్ణ కీర్తన చేయండి భగవంతుడిని అర్థము చేసుకోండి ప్రకృతి చట్టములు ఎలా పని చేస్తూన్నాయో ప్రజలు అర్థం చేసుకోవడానికి పట్టించుకోరు. ప్రకృతి చట్టం అంటే భగవంతుని చట్టం. ప్రకృతి స్వతంత్రంగా లేదు. ఇది భగవద్గీతలో పేర్కొనబడింది: mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ప్రకృతి ఒక యంత్రం. నిర్వహించేవాడు లేకుండా ఒక యంత్రం పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు భావిస్తున్నారా? ఎకడైనా సాక్ష్యం ఉందా? ఇప్పుడు, ఇది యంత్రం, ఫోటోగ్రఫీ, అద్భుతమైన యంత్రం. ఇది చిత్రాన్ని తీసుకుంటోంది, అది కదులుతుంది. కానీ ఒక నిర్వహించేవాడు ఉన్నాడు. నియంత్రికులు లేకుండా పనిచేసే యంత్రం ఎక్కడ ఉంది? మీరు ఏదైన ఉదాహరణను ఇవ్వవచ్చు, "నియంత్రికుడు లేకుండా పని చేస్తున్న యంత్రం ఇక్కడ ఉంది"? అని. మహోన్నతమైన నియంత్రికుడు భగవంతుని ఆదేశము లేకుండా ప్రకృతి యంత్రం పని ఎలా చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు ఎలా అనుకుంటున్నారు? ఇది చాలా సహేతుకమైనది కాదు. మనము ఆలోచించాలి. వివిధ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలలో ఒకటి పరికల్పన. ఆ పరికల్పన ఏమిటంటే, మనము నడిపించేవాడు, నియంత్రికుడు లేకుండా యంత్రమును చూడము కనుక అందువలన మనం దానిని అర్థము చేసుకోవాలి, భగవంతుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి తెలియక పోయినప్పటికీ, మనము ఈ ప్రకృతి ఎవరో మహోన్నతమైన నియంత్రికుని కింద పని చేస్తుంది అని నిర్ధారించాలి. అది భగవంతుడు. " నియంత్రికుడిని చూడవలసిన అవసరం లేదు, కానీ నిర్వహిస్తున్న వాడు ఉండాలి అని మనము ఊహించగలం.

కాబట్టి మానవ జీవితం నియంత్రణ, నిర్వహణ చేస్తున్నవారిని కనుగొనటానికి ఉద్దేశించబడింది. అది మానవ జీవితం. లేకపోతే అది పిల్లులు మరియు కుక్కల జీవితం. వారు తింటున్నారు, నిద్రపోతున్నారు, మైథునము చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. అంతే. ఇది మానవ జీవితం కాదు. మీరు నియంత్రికుడు ఎవరు అనేది కనుగొనాలి? Athāto brahma jijñāsā అని అంటారు. ఇది సంస్కృత పదము, ఇప్పుడు ఈ మానవ రూపము మహోన్నతమైన నియంత్రికుని గురించి ప్రశ్నించడానికి ఉద్దేశించబడింది. ఇప్పుడు ఆ మహోన్నతమైన నియంత్రికుడు , కృష్ణుడు, చాలా దయతో ఉన్నాడు. ఆయన భగవద్గీతలో, సాక్ష్యమిస్తున్నాడు, mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను. నా నిర్దేశములో ప్రకృతి, భౌతిక ప్రకృతి, పని చేస్తోంది. మీరు అంగీకరించాలి. అప్పుడు మీ పని జరుగుతుంది కృష్ణుడు ప్రకృతిని ఎలా నియంత్రింస్తున్నాడు అనే దానికి సాక్ష్యాలను ఇచ్చాడు. కృష్ణుడు ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన వేలు మీద ఒక గొప్ప పర్వతమును ఎత్తాడు. దీని అర్థం... మనము... మన అవగాహన గురుత్వాకర్షణ చట్టం ఉంది. గురుత్వాకర్షణ చట్టం ద్వారా, అటువంటి ఒక గొప్ప పర్వతమును, అది ఒక మనిషి వేలు మీద ఉండలేదు. ఇది మన లెక్కింపు. కానీ ఆయన చేశాడు. దీని అర్థం ఆయన గురుత్వాకర్షణ నియమాన్ని నిష్ఫలము చేసినాడు. అది భగవంతుడు అంటే. మీరు దీనిని విశ్వసిస్తే, అప్పుడు మీరు వెంటనే భగవంతుణ్ణి తెలుసుకుంటారు. ఇబ్బంది లేదు. ఉదాహరణకు ఒక బాలుడిని హెచ్చరిస్తే, "నా ప్రియమైన బాలుడా, అగ్నిని ముట్టుకోవద్దు, అది నిన్ను కాల్చుతుంది." దానికి పిల్లవాడు అంగీకరిస్తే, వాడు వెంటనే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. పిల్లవాడు అంగీకరించకపోతే- వాడు ప్రయోగం చేయాలనుకుంటే -అప్పుడు వాడు తన వేలును కాల్చుకుంటాడు.

కావున మన విజ్ఞాన పద్ధతి-మీరు మహోన్నతమైన ప్రామాణికం నుండి తీసుకోవాలి. అప్పుడు మనము పరిశోధనా పని కోసం సమయం ఆదా చేస్తాము. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము. మనము కృష్ణుడి నుండి సంపూర్ణ జ్ఞానాన్ని నేర్చుకుంటాము. నేను అసంపూర్ణంగా ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లవాడు అసంపూర్ణముగా ఉంటాడు, కావున నేను అసంపూర్ణంగా ఉండవచ్చు, మీరు అసంపూర్ణంగా ఉండవచ్చు. కానీ మహోన్నతమైన సంపూర్ణము నుండి జ్ఞానాన్ని తీసుకుంటే, మీ జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. అది పద్ధతి. దీనిని అవరోహ-పన్తా అంటారు, జ్ఞానం వస్తుంది, ఊహింపదగిన జ్ఞానం.

కాబట్టి ప్రతిదీ ఉంది, మీరు ఈ ఉద్యమం యొక్క ప్రయోజనమును తీసుకొని మీ జీవితం సంపూర్ణ చేసుకుంటే, భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళడము, భగవంతుని దగ్గకు తిరిగి వెళ్ళడము, అప్పుడు పూర్తిగా ఈ కేంద్రం,మన మెల్బోర్న్ కేంద్రాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడకు రండి,మన పుస్తకాలను చదవండి, వాదించండి. మీ పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, గుడ్డిగా అంగీకరించ వద్దు. కారణం ఉంది. వాదన ఉంది. తత్వము ఉంది. శాస్త్రము ఉంది. అంతా ఉంది. మీరు "కేవలం కీర్తన జపము ద్వారా, నేను అర్థము చేసుకుంటాను" అని మీరు అంగీకరిస్తే, అది కూడా అనుమతించబడుతుంది. రెండు విధాలుగా: మీరు ఈ సరళమైన పద్ధతిని అంగీకరించినట్లయితే, "హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయండి మరియు భగవంతుడిని అర్థము చేసుకోండి", అది కూడా సత్యము. మీరు అనుకుంటే, "ఈ అర్థంలేనిదీ ఏమిటి, హరే కృష్ణ కీర్తన చేయడము?" అప్పుడు మీరు పుస్తకాలను చదవండి. మనము రెండు విధముల సిద్ధముగా ఉన్నాము. రండి మరియు ఈ ఉద్యమము యొక్క ప్రయోజనమును పొందండి.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ, జయ