TE/Prabhupada 1062 - మనకు భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి ఉన్నది
660219-20 - Lecture BG Introduction - New York
మనకు భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి ఉన్నది మనము పొరపాటున ఈ ధోరణిలో వున్నాము. ఈ విశ్వములో అద్భుతమైన విషయాలు జరగటం చూసి ఈ అద్భుత సృష్టి వెనుక నియంత్రించేవాడు వున్నాడు అని మనము తెలుసుకొనవలయును ఏది కూడా ఈ సృష్టిలో నియంత్రించకుండా సృష్టించబడదు నియామకుని గుర్తించకపోవుట బాల్యచేష్ట అనబడును ఉదాహరణకు ఒక మంచి మోటార్ కార్ మంచి వేగముతో ప్రయాణిస్తుంటే మంచి యాంత్రికపు అమరిక వలన వీధిలో ప్రయాణిస్తుంటే ఒక పిల్లవాడు ఆలోచించ వచ్చును ఈ మోటార్ కార్ గుర్రము లేదా లాగే జంతువు లేకుండా ఎలా ప్రయాణిస్తుంది కానీ విచక్షణ కలిగిన మానవుడు లేదా పెద్ద వారు వారికి తెలుసు మోటార్ కార్ నందు యాంత్రికపు అమరిక వున్నా నడిపేవాడు లేకుండా కారు నడవదు అని కేవలము మోటార్ కార్ నందు వున్న యాంత్రికపు అమరిక వలన లేదా విద్యుత్ శక్తి వలన నడవదు ప్రస్తుతము యంత్రముల రోజులు మనము తప్పకుండ తెలుసుకొనవలెను ఈ యంత్రములు వెనుక ఈ పని చేయుచున్న అద్భుతమైన యంత్రముల వెనుక చోదకుడు వున్నాడు దేవాదిదేవుడే చోదకుడు అధ్యక్ష పరమ పురుషుని ఆదేశానుసారం సమస్తము నడుస్తున్నది ఈ జీవులందరినీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చివరి అధ్యాయములలో తన అంశలుగా అంగీకరించెను మమైవాంశో జీవ భూతః( BG 15.7) అంశ అంటే అంశాలు అని అర్థము బంగారపు కణిక కూడ బంగారమే సముద్రపు చిన్న నీటి బిందువు కూడా లవణ పూర్ణమే అయినట్లు అదే విధముగా భగవంతుని అంశలైన జీవులు శ్రీకృష్ణ భగవానుని మనము భగవంతుని లక్షణములు అన్నిటిని అతి కొద్ది పరిమాణములో కలిగియున్నాము మనము అణు ఈశ్వరులము. భగవంతునిపై ఆధారపడియున్న ఈశ్వరులము. మనము కుడా నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము మనము ప్రకృతిని నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత రోజులలో రోదసిని నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము మనము గ్రహాలవలె ఉన్నవాటిని తెలియాడునట్లు చేయుటకు ప్రయత్నిస్తున్నాము ఈ నియంత్రించే లేదా సృష్టించే ధోరణి మనకు కలదు పాక్షికంగా ఈ నియంత్రించే ధోరణి ఉన్నది ఈ ధోరణి సరిపోదు అని మనము తెలుసుకొనవలెను మనము భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి కలిగివున్నాము. భౌతిక ప్రకృతిపై ఆధిపత్య ధోరణి కలిగియున్నాము మనము పరమ నియంత్రులము కాదు ఇది భగవద్గీతలో వివరించబడినది
భౌతిక ప్రకృతి అంటే ఏమిటి. ప్రకృతి గురించి కూడా వివరించబడినది భౌతిక ప్రకృతి భగవద్గీతలో నాసిరకపు ప్రకృతి అని చెప్పబడినది జీవులను ఉన్నత ప్రకృతిగా అభివర్ణించబడినది ప్రకృతి అంటే ఎవరో ఒక్కరి చేత నియంత్రించబడేది ప్రకృతి స్త్రీ వంటిది భార్య యొక్క కార్యకలాపాలను భర్త నియంత్రించునట్లుగా అదేవిధముగా ప్రకృతి కూడా నియంత్రించబడుతున్నది భగవంతుడు దేవాదిదేవుడు నియంత్రించేవాడు ప్రకృతిని మరియు జీవులను వివిధరకములైన ప్రకృతిని భగవంతుడు నియంత్రిస్తున్నాడు భగవద్గీత ప్రకారము జీవులు భగవంతుని అంశలు అయినప్పటికీ వారు ప్రకృతి క్రిందకు వస్తారు భగవద్గీత ఏడవ అద్యాయములో స్పష్టముగా చెప్పబడినది అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి పరామ్ ( BG 7.5) ఈ భౌతిక ప్రకృతి అపరేయమితస్త్వు. ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా మరొక ప్రకృతి కలదు ఆ ప్రకృతి ఏమిటి? అదియే జీవ భూతః జీవులు
ఈ ప్రకృతి మూడు గుణాలతో కూడియున్నది సత్వ గుణము, రజో గుణము, తమో గుణములతో కూడియున్నది ఈ సత్వ రజో తమో గుణములకు అతీతముగా శాశ్వత కాలము వున్నది ఈ మూడు గుణాల కూడిక వలన శాశ్వత కాలము యొక్క నియామకము మరియు పర్యవేక్షణము వలన అనేక కార్యములు జరుగుచున్నవి అట్టి కార్యములను కర్మ అని అంటాము ఈ కార్యములు అనాది కాలముగా నిర్వహింప బడుచున్నవి మన కర్మ ఫలములచే మనము సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాము