TE/Prabhupada 1063 - అన్ని కార్యకలాపాల యొక్క కర్మ మరియు ప్రతి కర్మల నుండి ఉపసమనాన్ని ఇవ్వండి



660219-20 - Lecture BG Introduction - New York

అన్ని కార్యకలాపాల యొక్క కర్మ మరియు ప్రతి కర్మల నుండి ఉపశమనాన్ని ఇవ్వండి ఏ విధముగా ఐతే ప్రస్తుత జీవిత కాలంలో కూడా మనము మన కర్మలు అనుభవిస్తాము, కర్మ ఫలాలను. ఉదాహరణకు నేను ఒక వ్యాపారవేత్తను మరియు నా తెలివితేటలతో చాలా కష్టపడి పనిచేసాను. మరియు చాలా గొప్ప పరిమాణంలో బ్యాంకు బ్యాలన్స్ ను జమ చేసుకున్నాను. ఇప్పుడు నేనే అనుభవించువాడను. అదే విధముగా ఒకవేళ నా వ్యాపారాన్ని నేను గొప్ప ధనముతో ప్రారంభించాను, కానీ విజయవంతం కావడంలో విఫలమయ్యాను. నా ధనాన్ని అంతా నేనే పోగొట్టుకున్నాను, కావున నేను దుఃఖితుడను. అదే విధముగా మన జీవితం యొక్క అన్ని విభాగాలలో మనం అనుభవించెదము, మన కర్మ యొక్క ఫలితాలను మనం అనుభవించెదము. దీన్నే కర్మ అని అంటారు.

కావున ఈ విషయాలు ఈశ్వర, జీవ, ప్రకృతి, లేక దేవాదిదేవుడు, లేక జీవుడు, భౌతిక ప్రకృతి, శాశ్వత కాలము, మరియు మన యొక్క విభిన్న కార్యకలాపములు, ఈ విషయాలన్నీ భగవద్గీతలో వివరింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐదింటిలో భగవంతుడు, జీవులు, మరియు భౌతిక ప్రకృతి, కాలము, ఈ నాలుగు విషయములు శాశ్వతం ఇప్పుడు అవతరణ, ప్రకృతి యొక్క అవతరణ తాత్కాలికం కావచ్చు, కానీ అది అసత్యం కాదు. కొంతమంది తత్వవేత్తలు, భౌతిక ప్రకృతి యొక్క అవతరణ మిథ్య అని అంటారు. కానీ భగవద్గీత తత్వం ప్రకారం లేక వైష్ణవుల తత్వం ప్రకారం, వారు ఈ సృష్టి యొక్క అవతరణను మిథ్య అని అంగీకరించరు. ఆ యొక్క అవతరణను వారు వాస్తవమని అంగీకరిస్తారు, కానీ అది తాత్కాలికం. ఇది ఏ విధముగా అంటే, ఆకాశంలో మేఘము ఏర్పడటం వంటిది, మరియు వర్షాకాలము ప్రారంభవుతుంది. మరియు వర్షాకాలం తరువాత ఈ భూభాగం అంతా కూడా పచ్చటి పచ్చికబైళ్ళు ఏర్పడును, అది మనం చూడవచ్చు. మరియు ఎప్పుడైతే ఈ వర్షాకాలం పూర్తి అవుతుందో, తరువాత మేఘములు కూడా అంతరించిపోతాయి. సాధారణంగా, క్రమంగా, ఈ పచ్చికబైళ్ళు అన్ని కూడా ఎండిపోయి భూమి అంతా బీడుగా తయారవుతుంది. అదే విధముగా, ఈ భౌతిక సృష్టి ఒకానొక కాలంలో సంభవిస్తుంది. భగవద్గీత సంపుటాల నుండి మనం దాన్ని అర్థం చేసుకోగలము, మనం దాన్ని తెలుసుకోగలము. భూత్వా భూత్వా ప్రళీయతే ( BG 8.19) ఈ యొక్క సృష్టి అవతరణ ఒక నిర్దిష్ట కాలము నందు వైభవోపేతమగును, మరియు మరలా అంతరించును. అది ప్రకృతి యొక్క పనితీరు. కానీ అది శాశ్వతముగా పనిచేస్తుంది కావున ప్రకృతి నిత్యము. ఇది తప్పు కాదు, భగవంతుడు దాన్ని అంగీకరించారు, మమ ప్రకృతి, "నా ప్రకృతి". అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి పరామ్ ( BG 7.5) భిన్న ప్రకృతి, భిన్న ప్రకృతి, అపరా ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి దేవాదిదేవుని యొక్క భిన్న శక్తి, మరియు జీవులు, అవి కూడా దేవాదిదేవుని యొక్క శక్తియే, కానీ భిన్నములు కాదు. అవి శాశ్వతముగా సంబంధము కలిగియున్నట్టివి. కావున భగవంతుడు, జీవులు, ప్రకృతి, భౌతిక ప్రకృతి మరియు కాలము అవి అన్నీ శాశ్వతము (నిత్యము). కానీ ఆ ఇంకొక వస్తువు, కర్మ, అది శాశ్వతము కాదు. కర్మ లేదా పని యొక్క పరిణామాలు చాలా పురాతనం కావచ్చు. అనంతకాలముగా మనం మన కర్మల యొక్క ఫలితాలను ఆనందిస్తున్నాము లేదా దుఃఖిస్తున్నాము, అయినప్పటికీ, మనం మన యొక్క కర్మ లేదా పని యొక్క ఫలితాలను మార్చుకొనవచ్చు. అది మన పరిపూర్ణ జ్ఞానముపై ఆధారపడి ఉంది. అసంశయముగా మనం ఎన్నో వివిధ రకముల కార్యకలాపాలలో నిమగ్నమయి ఉన్నాం, కానీ ఎటువంటి కార్యకలాపాలు ఆపాదించుకోవాలో తెలియలేకున్నాం. అది అన్ని కార్యకలాపాల యొక్క కర్మ ప్రతికర్మల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ విషయం భగవద్గీతలో కూడా వివరింపబడి ఉంది.

ఇప్పుడు, ఈశ్వరుని యొక్క స్థానము పరమ చైతన్యము (దివ్యము). ఈశ్వరుని లేదా దేవాదిదేవుని యొక్క స్థానము పరమ చైతన్యము. మరియు ఆత్మలు లేదా జీవులు భగవంతుని యొక్క అంశీభూతులుగా, అవి కూడా చైతన్యము కలిగి ఉన్నాయి జీవాత్మ కూడా చైతన్యము కలిగి ఉన్నాడు జీవుని ప్రకృతిగా, శక్తి, వివరింపబడినది, భౌతిక సృష్టి కూడా ప్రకృతిగానే వివరింపబడినది. కానీ ఆ రెండింటిలో, ఒక ప్రకృతి, జీవులు, వారు చైతన్యము కలిగి ఉన్నారు వేరొక ప్రకృతి చైతన్యము కలిగి లేదు, అది వ్యత్యాసము. కావున ఈ జీవ ప్రకృతి పరా ప్రకృతిగా పిలవబడుతుంది, ఎందుకంటే జీవులు భగవంతునితో పోలిన చైతన్యం కలిగి ఉన్నారు. భగవంతుడు పరమ చైతన్యము. కానీ జీవుని లేదా ఆత్మను కూడా పరమ చైతన్యముగా ఏ ఒక్కరు పరిగణించరాదు. లేదు. ఏ పరిపూర్ణ స్థితి యందైనా కానీ జీవుడు పరమ చైతన్యము కలిగి ఉండలేదు. ఇది ఒక తప్పు త్రోవ పట్టించే తత్వము. ఇది ఒక తప్పు త్రోవ పట్టించే తత్వము. కానీ ఆయన చైతన్యముతో ఉన్నాడు, అంతే, కానీ ఆయన పరమ చైతన్యము కాదు