TE/Prabhupada 1066 - అల్ప మేధస్సులైన ప్రజలు పరమసత్యాన్ని నిరాకారంగా గుర్తిస్తారు



660219-20 - Lecture BG Introduction - New York

అల్ప మేధస్సులైన ప్రజలు పరమసత్యాన్ని నిరాకారంగా గుర్తిస్తారు కావున యావత్తు ఏర్పాటు కూడా ఆ కేంద్ర రూపమే, సృష్టి యొక్క కేంద్ర రూపము. భోగము యొక్క ఆ కేంద్ర రూపము భగవానుడే. మరియు జీవులు, కేవలం సహకరించువారే. సహకారంతోటి, సహకారంతోటి వారు ఆనందిస్తారు. వారి సంబంధం ఎలా అంటే ఒక యజమాని మరియు సేవకునివలె. ఒకవేళ యజమాని పూర్తిగా సంతృప్తి చెందినట్లయితే, సేవకులు అప్రయత్నంగానే సంతృప్తి చెందుదురు, అదే నియమము. అదే విధముగా, భగవంతుడు సంతృప్తి చెందవలెను, సృష్టికర్త కావాలి అనే దృక్పథం మరియు భౌతిక ప్రపంచం యొక్క భోక్తని కావాలి అనే దృక్పథం, అవి జీవుల యందు కూడా ఉన్నవి, ఎందుకనగా అవి భగవంతునిలో కూడా ఉన్నవి. ఆయన సృష్టించెను, ఆయన ఈ వ్యక్తమైనట్టి బ్రహ్మండాలను సృష్టించెను.

కావున ఈ భగవద్గీత యందు మనం కనుగొనగలము, అది ఈ పరిపూర్ణమైనటువంటి మొత్తము, పరమ నియామకుడు, నియంత్రింపబడు జీవులు, ఈ బ్రహ్మాండములు ఇమిడి ఉన్నవి, శాశ్వత కాలము, అన్ని కార్య కలాపములు, ఇవి అన్ని సంపూర్ణముగా వివరింపబడి ఉన్నవి. కావున ఈ యావత్తు విషయాన్ని పూర్తిగా సమీకరించినట్లయితే అదే పరమ సత్యము. ఆ పరిపూర్ణ మొత్తము, లేక పరమోత్కృష్ట పరమ సత్యము, పరిపూర్ణమైన దేవాదిదేవుడైనట్టి శ్రీకృష్ణుడే. ఇంతకు మునుపు నేను వివరించినట్లుగా ఈ వ్యక్తీకరణములు అన్ని కూడా ఆయన వివిధ శక్తుల వల్లనే. మరియు ఆయన పరిపూర్ణ మొత్తము.

నిరాకార బ్రహ్మం భగవద్గీత యందు వివరింపబడియున్నది. ఆ నిరాకార బ్రహ్మం కూడా పరిపూర్ణ పురుషునికి లోబడి ఉన్నది. బ్రాహ్మణో హి ప్రతిష్ఠా ( BG 14.27) నిరాకార బ్రహ్మం కూడా. అది... నిరాకార బ్రహ్మము బ్రహ్మసూత్రములో కాంతి కిరణాలుగా స్పష్టముగా వివరింపబడినది. ఏ రకముగా ఐతే సూర్య కిరణములు ఉన్నవో, సూర్య గ్రహము, అదే విధముగా, నిరాకార బ్రహ్మము ప్రజ్వలిస్తున్న కిరణములు. పరం బ్రహ్మం యొక్క లేదా దేవాదిదేవుని యొక్క. కావున నిరాకార బ్రహ్మము అది పరమ పూర్ణత్వము యొక్క అసంపూర్ణమైన సాక్షాత్కారము, మరియు అదే విధముగా పరమాత్మ యొక్క అనుభూతి కూడా. ఈ విషయములు కూడా వివరింపబడి ఉన్నవి. పురుషోత్తమ యోగ. మనము ఎప్పుడైతే ఈ పురుషోత్తమ యోగ అను అధ్యాయాన్ని చదువుతామో, అందులో దేవాదిదేవుడు, పురుషోత్తముడు, నిరాకార బ్రహ్మముకన్నా కూడా శ్రేష్ఠుడు మరియు పరమాత్మ యొక్క పాక్షిక సాక్షాత్కారమని చూడగలము.దేవాదిదేవుని సచ్చిదానంద విగ్రహ అనును (బ్రహ్మ సంహిత 5.1). బ్రహ్మ సంహితలో ఆరంభం ఈ రకముగా ఉన్నది: ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానందవిగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణకారణమ్ (బ్రహ్మ సంహిత 5.1). గోవింద, కృష్ణ ఆయన కారణ కారణుడు. ఆయనే అది భగవంతుడు.

కావున దేవాదిదేవుడు సచ్చిదానంద విగ్రహుడు. నిరాకార బ్రహ్మము యొక్క సాక్షాత్కారము ఆయన యొక్క సత్ భాగము, శాశ్వతము యొక్క సాక్షాత్కారము. మరియు పరమాత్మ సాక్షాత్కారము సత్ చిత్ యొక్క సాక్షాత్కారము, శాశ్వత జ్ఞానము యొక్క పాక్షిక సాక్షాత్కారం. కానీ దేవాదిదేవుని కృష్ణునిగా పొందే సాక్షాత్కారం అన్ని దివ్య గుణముల యొక్క సాక్షాత్కారము. ఏ విధముగా అంటే సత్ చిత్ ఆనందము, పరిపూర్ణ విగ్రహము నందు. విగ్రహము అంటే రూపము. విగ్రహము అంటే రూపము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మమబుద్ధయః ( BG 7.24) అల్ప మేధస్సులైనటువంటి ప్రజలు, పరమ సత్యాన్ని నిరాకారముగా పరిగణిస్తారు, కానీ ఆయన ఒక వ్యక్తి, ఒక దివ్య పురుషుడు. ఇది అన్ని వైదిక సారస్వతాలలో నిర్థారింపబడింది. నిత్యో నిత్యనామ్ చేతనః చేతనానామ్ (కఠోపనిషత్ 2.2.13). కావున మనం ఏ రకంగా పురుషులమో, స్వతంత్రమైన జీవులము, మనము పురుషులము, మనకు మన వ్యక్తిత్వం ఉన్నది, మనందరం వ్యక్తులం, అదే విధముగా పరమ సత్యము, పరమోత్క్రుష్టమైన భగవంతుడు, ఆయన కూడా చివరగా ఒక పురుషుడే. దేవాదిదేవుని యొక్క సాక్షాత్కారం అనగా ఆయన అన్ని దివ్య గుణాల యొక్క సాక్షాత్కారము ఏ రకముగా సచ్చిదానందమో, పరిపూర్ణమైన విగ్రహమందు. విగ్రహం అంటే రూపం. కావున పరిపూర్ణము నిరాకారము కాదు. ఆయన ఒక వేల నిరాకారమైతే లేక ఇంకే విషయమందైనా కానీ ఆయన లోపించినట్లైతే, ఆయన పరిపూర్ణుడు కాలేడు. పరిపూర్ణుడు అంటే, అన్ని కలిగి ఉన్నాడు, మన యొక్క స్వానుభవంలో మరియు మన స్వానుభవానికి అతీతంగా కూడా. అట్లు కానట్లైతే ఆయన పరిపూర్ణుడు కాడు. ఆ పరిపూర్ణుడైన దేవాదిదేవుడు అపరిమిత శక్తులు కలిగియున్నాడు. పరాస్య శక్తిర్ వివిధైవ స్రూయతె ( CC Madhya 13.65) భాష్యము. ఆ విషయము భగవద్గీత యందు కూడా వివరింపబడియున్నది, యెట్లు వేర్వేరు శక్తుల ద్వారా ప్రదర్శితమగుతున్నాడని. ఈ వ్యక్త్యావ్యక్త్య ప్రపంచము, లేదా భౌతిక ప్రపంచము యందు ఎందైతే మనం ఇప్పుడు ఉన్నామో, ఇది దానంతట అది పరిపూర్ణమే, ఎందుకనగా పూర్ణమిదం (శ్రీ ఈశోపనిషత్) 24 ధాతువులలో, సాంఖ్యతత్వం ప్రకారం, ఈ 24 ధాతువులతో కూడిన భౌతిక సృష్టి ఒక తాత్కాలిక వ్యక్తీకరణమో, ఈ యావత్తు సృష్టిని పోషించుటకు మరియు దాని యొక్క ఉనికికి అవసరమైన పరిపూర్ణమైన వస్తువులను ఉత్పత్తి చేయుటకు ఏర్పరిచిన ఒక పరిపూర్ణ ఏర్పాటు. ఈ సృష్టి యొక్క పోషణార్ధం ఏ ఇతర విభాగము యొక్క ప్రత్యేకమైన పనితీరు అవసరం లేదు. తన యొక్క సొంత కాలమందు, ఆ పరిపూర్ణుడి యొక్క శక్తి ద్వారా నియమితమగును. మరియు నిర్దిష్ట కాలము పూర్తయిన పిమ్మట ఈ తాత్కాలిక వ్యక్తీకరణములన్నీ ఆ పరిపూర్ణుడైన భగవంతుని పరిపూర్ణ ఏర్పాటు ప్రకారం లయింపబడును