TE/Prabhupada 1065 - ప్రప్రధమంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, తను ఈ భౌతిక శరీరం కాదు అని

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png మునపటి పేజీ - విడియో 1064
తర్వాతి పేజీ - విడియో 1066 Go-next.png

ప్రప్రధమంగా ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి, తను ఈ భౌతిక శరీరం కాదు అని
- Prabhupāda 1065


660219-20 - Lecture BG Introduction - New York

ప్రప్రథమంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తను ఈ భౌతిక శరీరం కాదు అని. ఇపుడు మనం ఆ రకంగా భౌతికముగా కలుషితం అయినప్పుడు, అది మన యొక్క బద్ధ స్థితి, బద్ధ స్థితి. మరియు మిథ్యాహంకారమూ, మిథ్యా చైతన్యము. భౌతిక ప్రకృతి యొక్క ఉత్పత్తులలో నేను కూడా ఒక ఉత్పత్తిని అన్న విచారములో ఈ మిథ్యా చైతన్యము ప్రదర్శితం అగును. అదే మిథ్యాహంకారము అన్న భౌతిక కార్యాకలాపములు, యస్యాత్మ బుద్ధిః కునపే త్రి- ధాతుకే ( SB 10.84.13) యస్యాత్మ బుద్ధిః కునపే త్రి-ధాతుకే, ఎవరైతే శారీరక అవగహణలో నిమగ్నమై యుంటారో. ప్రస్తుతం ఈ మొత్తం భగవద్గీత అంతా కూడా భగవంతునిచే వివరింపబడినది. ఎందుకనగా అర్జునుడు శారీరక అవగహణలో ఉన్నట్టి వాడిగా ప్రాతినిధ్యం వహించును. కావున ప్రతి ఒక్కరు శారీరక అవగాహన జీవనము నుండి విముక్తులు కావలెను. ముక్తిని పొందాలనుకున్నటువంటి, స్వేఛ్చ కోరుకున్నటువంటి దివ్య పురుషుని ప్రాథమిక కార్యకలాపము అదియే. మరియు ప్రప్రథమంగా తాను ఈ భౌతిక శరీరం కాదు అని తెలుసుకోవాలి. కావున ఈ చైతన్యము, లేక భౌతిక చైతన్యము.... మనం ఈ భౌతిక చైతన్యము నుండి విముక్తిని పొందినప్పుడు, అదే ముక్తి అందురు. ముక్తి లేదా మోక్షం అంటే భౌతిక చైతన్యము నుండి విముక్తులు కావడం. శ్రీమద్ భాగవతంలో కూడా ముక్తి యొక్క నిర్వచనము పేర్కొనబడియున్నది. ముక్తిర్ హిత్వాన్యతా రూపా స్వరూపేన వ్యవస్థిత ( SB 2.10.6) స్వరూపేన వ్యవస్థిత. ముక్తి అనగా భౌతిక ప్రపంచము యొక్క కలుషితమైన చైతన్యము నుండి విముక్తులు కావుట. మరియు సిద్ధ చైతన్యములో స్థితులగుట. మరియు పూర్తి బోధనలు, భగవద్గీత యొక్క బోధన, శుద్ద చైతన్యాన్ని జాగృతం చేయుటకే లక్ష్యంగా కలిగియున్నది. భగవద్గీత బోధనల యొక్క చివరి దశలో మనం దీనిని కనుగొనగలము కృష్ణుడు అర్జునుని అడుగుచున్నాడు. ప్రస్తుతం నీవు పవిత్ర చైతన్యములో నెలకొని ఉన్నావా అని. ఆయన పవిత్ర చైతన్యంలో ఉన్నడా లేడా అని. పవిత్ర చైతన్యం అంటే భగవంతుని యొక్క మార్గ నిర్ధేసానుసారం నడుచుకొనుట. అదే పవిత్ర చైతన్యం. పవిత్ర చైతన్యం యొక్క పూర్తి సారాంశం అదియే. చైతన్యం ఇదివరకే ఉన్నది కానీ మనం ఆయన యొక్క అంశలము కనుక మనం ప్రభావితం అవుతున్నాం. భౌతిక గుణాలచేత ప్రభావితం అయ్యేందుకు ఆకర్షణ ఉన్నది. భగవంతుడు పరమోత్క్రుష్టుడు కనుక ఆయన ఎన్నడూ ప్రభావితం కాడు. ఆయన ఎన్నడూ ప్రభావితం కాడు. ప్రభువునకు పరమోత్క్రుష్టునకు వ్యత్యాసం అదే... దేవాదిదేవుడు మరియు...

ప్రస్తుతం ఈ చైతన్యం.... ఏమిటి ఈ చైతన్యం? ఈ చైతన్యం ఏమిటంటే "నేను". ఎవరు నేను? ఈ కలుషితమైన చైతన్యంలో "నేను" అనగా "చూస్తున్న ప్రతి దానికి నేనే అని అర్థం." ఇదే అపవిత్రమైన చైతన్యం. మరియు "నేనే భోక్తని." యావత్తు భౌతిక ప్రపంచము ఏ విధంగా నడుచుకుంటుందంటే, ప్రతి జీవుడు ఏమి ఆలోచిస్తున్నాడు అంటే నేను ప్రభువుని మరియు భౌతిక ప్రపంచం యొక్క సృష్టికర్తను. చైతన్యము రెండు మానసిక కదిలికలు లేక రెండు మానసిక విభాగములు కలిగియున్నది. ఒకటి ఏమిటంటే "నేనే సృష్టికర్తను," మరొకటి ఏమిటంటే "నేను భోక్తను." కావున దేవాదిదేవుడు వాస్తవముగా సృష్టికర్త మరియు ఆయనే నిజమైన భోక్త. మరియు జీవులు, భగవంతుని యొక్క అంశములు, ఆయన వాస్తవముగా సృష్టికర్త లేదా నిజమైన భోక్త కూడా కాడు. కానీ ఆయన సహకరించువాడు. ఏ విధముగా అంటే ఒక పూర్తి యంత్రము వలె. యంత్రములో ఒక భాగము సహకరించునట్టిది, సహకరించునట్టిది. లేకా మనము మన యొక్క శరీరము యొక్క అమరికను అధ్యయనం చేసినట్లయితే. ఇపుడు ఈ శరీరం యందు చేతులు ఉన్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, మరియు ఈ పరికరాలన్నీ, పని చేస్తున్నాయి, కానీ శరీరంలో ఉన్నటువంటి ఈ అంగాలన్నీ కూడా, అనుభవించునట్టివి కావు, ఉదరము అనుభవించునది. కాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతున్నది. చేతులు సేకరిస్తున్నవి, చేతులు ఆహారాన్ని తయారు చేస్తున్నాయి, మరియు పళ్ళు నములుతున్నవి, మరియు అన్ని కూడా, శరీరంలో అన్ని అంగాలు, ఉదర సంతృప్తి కొరకు నిముగ్నమయి ఉన్నాయి. ఎందుకనగా ఉదరము శరీరం యొక్క నిర్మాణములో ఒక ప్రధాన మూలకము. మరియు ప్రతి ఒక్కటి ఉదరమునకే ఇవ్వవలెను. ప్రాణోపహారాస్ చ యతేంద్రియానామ్ ( SB 4.31.14) ఏ విధముగా అంటే మొదలు మీద నీరు పోయటం ద్వారా చెట్టు పచ్చగా ఉన్నట్లు. లేక మీరు ఆరోగ్యంగా ఉండగలరు. శరీరం యొక్క అంగములు - చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, వేళ్ళు - అన్ని కూడా ఆరోగ్యంగా ఉండగలవు, ఎపుడైతే అవి ఉదరమునకు సహకరిస్తాయో. అదే విధముగా పరమపురుషుడు, భగవంతుడు, ఆయనే భోక్త, ఆయనే భోక్త మరియు సృష్టికర్త. మరియు మనం, నేను చెప్పదలిచిన, న్యూన జీవులు, పరమ భగవంతుని యొక్క శక్తి యొక్క వ్యక్తీకరణాలు. మనం కేవలం ఆయనకు సహకరించవలెను. ఆ సహకారము మనకు సహాయపడగలదు. ఉదాహరణకి, ఒక మంచి ఆహార పదార్థము వేళ్ళ ద్వార తీసుకొనబడినది. ఒక వేళ ఆ వేళ్ళు "ఎందుకు నేను ఉదరమునకు అందించాలి అని అనుకున్నట్లైతే? నన్ను ఆనందించని." అదే పొరపాటు. వేళ్ళు అవి అనుభవించలేవు. ఒక వేల వేళ్ళు ఆ నిర్దిష్టమైన ఆహారం యొక్క సుఖాన్ని పొందగోరినట్లయితే వేళ్ళు ఆ ఆహారాన్ని కడుపు నందు ఉంచాలి