TE/Prabhupada 1068 - ప్రకృతి త్రిగుణములను అనుసరించి మూడు రకముల కార్యకలాపములు ఉన్నవి



660219-20 - Lecture BG Introduction - New York


ప్రకృతి త్రిగుణములను అనుసరించి మూడు రకముల కార్యకలాపములు ఉన్నవి భగవంతుడు, పరిపూర్ణుడు కనుక, భౌతిక ప్రకృతి నియమములకు లోబడి ఉండవలసిన అవసరం లేదు. కావున ఎవరైనా తమ తెలివితేటలతో తెలుసుకోవలసింది ఏమిటంటే, భగవంతుడు తప్ప విశ్వములో ఎవరూ దేనికీ యజమాని కాదు. ఆ విషయము భగవద్గీతలో వివరింపబడినది:

అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితాః
( BG 10.8)


భగవంతుడు అసలైన సృష్టికర్త. ఆయన బ్రహ్మను సృష్టించాడు. ఆయన సృష్టికర్త... ఆ విషయం కూడా వివరింపబడినది. ఆయన బ్రహ్మను సృష్టించెను. 11వ అధ్యాయమునందు భగవంతుని ప్రపితామః ( BG 11.39) అని సంభోదించెను. ఎందుకంటే బ్రహ్మని పితామహుడు అని సంభోదించెను, తాత, కానీ అతడు తాత యొక్క సృష్టికర్త కూడా. కావున ఎవరు కూడా దేనికీ యజమాని అని ప్రకటించరాదు, కనుక తన పోషనార్థమై భగవంతుడు నియమించిన భాగమునే గ్రహించవలసియున్నది. ఇప్పుడు భగవంతుడు మనకు కేటాయించిన దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనుటకు పెక్కు ఉదాహరణలు కలవు. ఆ విషయము కూడా భగవద్గీతలో వివరింపబడినది. అర్జునుడు, తొలుత యుద్ధము చేయడానికి నిర్ణయించుకొనెను. అది అతని సొంత నిర్ణయము. తన స్వజనులను చంపి తాను రాజభోగములను అనుభవించుట సాధ్యము కాదని అర్జునుడు భగవంతునితో పలికెను. ఆ దృష్టికోణము కేవలము శారీరక అవగాహన వలెనే. ఎందుకనగా తన శరీరమే తాను అను అలోచన కలిగియుండెను, మరియు శారీరక సంబంధికులు, తన సోదరులు, మేనల్లుళ్ళు, మామలు లేదా అతని తాతలు, వారందరూ తన శారీరక విస్తారములని, మరియు ఆయన ఆ విధముగా తన శారీరక అవసరములను తృప్తి పరచుకోదలచెను. దృష్టికోణమును మార్చుటకు ఆ యావాద్విషయము కూడా భగవంతుడు పలికెను. భగవంతుని యొక్క మార్గనిర్ధేసానుసారం పని చేయుటకు ఆయన అంగీకరించెను. ఆయన కరిష్యే వచనం తవ ( BG 18.73) అని పలికెను.

కావున ఈ ప్రపంచము నందు మానవుడు పిల్లులు మరియు కుక్కల వలె కలహములాడుటకు ఉద్ధేశించబడలేదు. మానవ జీవితము యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుటకు సరిపడ బుద్ధిని కలిగియుండవలెను సాధారణ జంతువు వలె ప్రవర్తించుటను నిరాకరించవలెను. ఆయన ఖచ్చితంగా... మానవుడు మానవ జీవితము యొక్క లక్ష్యమును గుర్తించవలెను. ఈ మార్గదర్శకము అన్ని వైదిక సారస్వతములలో వివరింపబడినది, మరియు వాటి సారము భగవద్గీతలో పొందు పరచబడినది. వైదిక సారస్వతము మానవులకు ఉద్దేశించబడినది. పిల్లులు మరియు కుక్కలకు కాదు. తాము భుజించగలిగిన జంతువులను పిల్లులు, కుక్కలు చంపవచ్చును, మరియు ఆ విషయమునందు వాటికి పాపము చేకూరు ప్రశ్న లేదు. తన నియంత్రణ లేని జిహ్వను సంతృప్తి పరచుటకు మనిషి ఒక జంతువును చంపినట్లయితే, అతను ప్రకృతి నియమముల ఉల్లంఘనకు బాధ్యుడగును. మూడు రకముల కార్యకలాపముల గురించి భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది వేర్వేరు ప్రకృతి గుణముల ప్రకారంగా: సత్వగుణ కర్మలు, రజోగుణ కర్మలు, తమోగుణ కర్మలు. అదే విధముగా, భుజించు ఆహారములు కూడా మూడు రకములుగా ఉన్నవి: సత్వగుణ ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం. అవి అన్ని కూడా స్పష్టంగా వివరించబడినది, మరియు భగవద్గీత భోదనలను మనం సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే, మన యావత్ జీవితం పవిత్రము కాబడుతుంది మరియు చివరిగా మన యొక్క గమ్యమును చేరుకోగలము. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ( BG 15.6)

ఆ సమాచారము భగవద్గీతలో ఇవ్వబడినది, ఈ భౌతిక ఆకాశము దాటి, వేరొక ఆధ్యాత్మిక ఆకాశము కలదు; అది సనాతన ఆకాశము అందురు. ఈ ఆకాశమందు, ఈ కప్పబడిన ఆకాశము, ప్రతి ఒక్కటి తాత్కాలికముగా మనము కనుగొనెదము. అది వ్యక్తీకరణమగును, కొంత కాలము ఉండును, మనకు కొద్ది ఉత్పత్తులు ఇచ్చును, మరియు క్రమముగా అది క్షీణించును, తరువాత నశించిపోవును. ఇది భౌతిక ప్రపంచము యొక్క నియమము. ఈ శరీరమును తీసుకోండి, ఒక ఫలము తీసుకోండి లేక ఇచ్చట భౌతికంగా సృష్టించబడినది ఏదైనా, చివరగా అది నశించిపోవలెను. కావున ఈ తాత్కాలిక ప్రపంచమునకు అతీతమైనటువంటి వేరొక ప్రపంచము కలదు. దాని సమాచారము కూడా కలదు. ఆ 'పరస్తస్మాత్తుభావో‌உన్యో‌உ' ( BG 8.20) శాశ్వతము సనాతనము అయినట్టి వేరొక ప్రపంచము కలదు. మరియు జీవుడు, జీవుడు కూడా సనాతనముగా వర్ణింపబడినాడు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ( BG 15.7) సనాతనః, సనాతన అంటే శాశ్వతము లేక నిత్యము. 11వ అధ్యాయము నందు భగవంతుడు కూడా సనాతనుడే అని వర్ణింపబడియున్నాడు. కావున మనము అందరమూ సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాము కనుక, గుణరీత్యా మనమందరం ఒక్కటే... సనాతన ధామము, మరియు సనాతన దేవాదిదేవుడు, మరియు సనాతన జీవులు, అవి అన్ని గుణరీత్యా ఒకే స్థాయిలో ఉన్నవి. కావున మన సనాతన వృత్తిని పునరుద్ధరించుటయే భగవద్గీత యొక్క పూర్తి లక్ష్యమై ఉన్నది లేక సనాతన, అది సనాతన ధర్మము అనబడును, లేక జీవుని యొక్క నిత్య ధర్మము. మనము ప్రస్తుతం తాత్కాలికముగా అనేక కార్యకలాపములలలో నిమగ్నమై ఉన్నాము. మరియు, మరియు ఆ అన్ని కార్యకలాపములు పవిత్రము కాబడుతున్నవి. మనము ఈ తాత్కాలిక కార్యకలాపములు అన్నింటిని విడచిపెట్టినపుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య ( BG 18.66) మరియు దేవాదిదేవుడు కోరిన విధముగా మనము కార్యకలాపములు స్వీకరిస్తామో అదియే మన పవిత్ర జీవనము అనబడును