TE/Prabhupada 1069 - మతము అనునది విశ్వాసమును సూచించును



660219-20 - Lecture BG Introduction - New York

మతము అనునది విశ్వాసమును సూచించును. విశ్వాసము మారవచ్చును. సనాతన ధర్మము మార్పు చెందదు. కావున పైన పేర్కొన్న విధముగా, సనాతన ధర్మము, దేవదేవుడు సనాతనుడు, మరియు ఆధ్యాత్మిక ఆకాశమునకు అతీతముగానున్న దివ్య ధామము, అదియు సనాతనమే. మరియు జీవులు కూడా సనాతనులే సనాతనమైన దేవదేవుని, సనాతనమైన జీవుల, సన్నిహిత సంబంధము అన్నది సనాతన నిత్య ధామము నందు, మనుష్య జీవితము యొక్క అంతిమ లక్ష్యం. జీవులయెడ భగవానుడు మిక్కిలి కృపాలుడై యుండును ఎందువలనంటే జీవులు దేవదేవుని సంతానముగా పేర్కోనబడినారు. సర్వయోనిషు కౌంతేయ సంభవన్తి మూర్తయో ( BG 14.4) అని భగవంతుడు ప్రకటించెను. ప్రతి జీవుడు, అన్ని రకములైన జీవులు... వారి వారి కర్మలను అనుసరించి పలు రకములుగా ఉన్నారు, వారందరికీ నేనే తండ్రిని అని భగవంతుడు పేర్కొనుచున్నారు, పతితులైన బద్ధజీవులను తిరిగి చేజిక్కించుకోవాలని భగవంతుడు అవతరించును సనాతన ధామమునకు, సనాతన ఆకాశమునకు తిరిగి రప్పించుకొనుటకు, ఆ విధముగా సనాతనులైన జీవులు భగవానుని నిత్య సహచర్యమున తమ నిత్యమైన సనాతన స్థానమును తిరిగి పొందగలరు. భగవంతుడు స్వయముగా వివిధ అవతారములలో వచ్చును. తన ఆంతరంగిక సేవకులను పుత్రులుగానో, సహచరులుగానో, ఆచార్యులుగానో పంపుచుండును.

కనుకనే సనాతన ధర్మమనెడిది ఎట్టి ధర్మవిధానపు శాఖకు అన్వయించునట్టిది కాదు. అది నిత్యుడైన పరమపురుషుని సంబంధములో, నిత్యమైన జీవుల యొక్క నిత్యధర్మమై ఉన్నది. సనాతన ధర్మము జీవుని నిత్య ధర్మమునకు అన్వయింపవచ్చును. శ్రీపాద రామానుజాచార్యులు సనాతనమనెడి పదమును ఆది మరియు అంతములు లేనిది అని వివరించెను. సనాతన ధర్మమును గూర్చి పలుకునపుడు మనము దానిని ఆ విధముగానే గ్రహించవలెను శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను ఆధారము చేసుకొని అది మరియు అంతములు లేవు అని. మతము అనే పదము సనాతన ధర్మమునకు కొద్దిగా భిన్నమైనట్టిది. మతము అనే పదము విశ్వాసము అను భావమును సూచించును. కానీ ఆ విశ్వాసము మారవచ్చును. ఒకనికి ఒక ప్రత్యేక విధానము నందు విశ్వాసము ఉండవచ్చును, అతడు ఆ విశ్వాసమును మార్చుకొని వేరొక దానిని గ్రహించవచ్చును. సనాతన ధర్మము అనెడి పదము ఎన్నటికీ మార్పు లేనిది. జలము, ద్రవ్యత్వము వలే. ద్రవ్యత్వమును జలము నుండి తొలగింపలేము. ఉష్ణము, అగ్ని. అగ్ని నుండి ఉష్ణత్వము తీసివేయలేము. ఏదైతే నిత్యధర్మమైన నిత్య జీవుల యొక్క సనాతన ధర్మమో, అది మార్పు లేనిది. అది మార్చుటకు వీలుకానిది. నిత్యుడైన జీవుని యొక్క నిత్య ధర్మమును మనం కనుగొనవలసి ఉన్నది. మనం సనాతన ధర్మమును గురించి పలుకునపుడు మనం దానిని అలాగే స్వీకరింపవలసి ఉన్నది. శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను ఆధారము చేసుకొని ఆది మరియు అంతములు లేవు అని. అది అంతములు లేనిది ఒక శాఖకు చెందినది కానేరదు. ఎందువలన అంటే అట్టిది ఎటువంటి ఎల్లలచే పరిమితను కాబోదు. సనాతన ధర్మము గూర్చి ఒక సభను ఏర్పాటు చేసినపుడు, ఏదో ఒక మతశాఖకు చెందినవారు దానిని (సనాతన ధర్మము) ఒక శాఖకు చెందినదిగా అపోహ పడుదురు మనము ఏదో ఒక శాఖకు సంబంధించినవారుగా ఉంటున్నాము. ఈ విషయమును మరింత లోతుగా పరిశీలించినచో నవీన విజ్ఞాన శాస్త్రపు వెలుగులో గ్రహించినచో, సనాతన ధర్మాన్ని మనము ఒక కర్తవ్యముగా భావించవచ్చు ప్రపంచ జనులకే కాక విశ్వమునందలి జీవులందరూ. సనాతనేతర ధర్మమునకు మానవ చరిత్రలో ఒక ప్రారంభము ఉండవచ్చు, కానీ సనాతన ధర్మమునకు ఎటువంటి చరిత్ర లేదు. ఎందుకంటే జీవునితో అది నిత్యముగా నిలిచియుండుటయే. జీవులకు సంబంధించినంతవరకు, ప్రామాణికంగా తెలిసినదేమంటే జీవులకు జన్మ గాని, మృత్యువు గాని లేదు అని. భగవద్గీతలో స్పష్టముగా తెలపబడినది జీవుడు ఎన్నడూ జన్మించుట గాని మరణించుట గాని లేనే లేదు. అతడు నిత్యుడు, నాశనము లేని వాడు, తాత్కాలికమైన దేహము నశించినను, అతను కొనసాగును