TE/Prabhupada 1070 - సేవ చేయుటయే జీవుని యొక్క నిత్య ధర్మము
660219-20 - Lecture BG Introduction - New York
సేవ చేయుటయే జీవుని యొక్క నిత్య ధర్మము పైన సూచించిన విధంగా సనాతన ధర్మము అనెడి విషయము, మనము మతము అన్న విషయమును గూర్చి ధర్మము అను సంస్కృత మూల అర్థము నుండి గ్రహించుకొనుటకు ప్రయత్నించవచ్చు. దాని అర్థము ఏదైతే నిర్దిష్ట వస్తువుతో నిరంతరం ఉండును అని. మనము ఇప్పటికే చెప్పిన విధంగా, మనము అగ్ని గురించి మాట్లాడేటప్పుడు అదే సమయంలో నిర్ధారింపబడుతుంది ఉష్ణము మరియు కాంతి అగ్నితో పాటు ఉన్నవి అని. ఉష్ణము మరియు కాంతి లేకుండా, అగ్ని అను పదానికి అర్థము లేదు. అదే విధంగా, మనము జీవునితో నిత్య సహచర్యము కలిగి ఉన్నటువంటి ముఖ్యమైన భాగము గూర్చి కనుగొనవలెను. జీవుని యొక్క నిత్య సహచర్యము కలిగి ఉన్నటువంటి ఆ భాగమే అతని శాశ్వత లక్షణము, మరియు శాశ్వత భాగము ఐనటువంటి జీవుని లక్షణమే అతని నిత్య ధర్మము. సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును స్వరూపము గురించి అడిగినపుడు— ప్రతి జీవుని స్వరూపము గూర్చి మనము ఇంతకుముందే చర్చించినట్లు— స్వరూపము లేక జీవుని నిత్య సిద్ధమైన స్వభావము, భగవానుడు బదులిచ్చెను, జీవుని స్వాభావిక స్థానము దేవాదిదేవుని యొక్క సేవ చేయుటయే అని. కానీ మనము చైతన్య మహాప్రభువు యొక్క ఈ వాఖ్య విభాగమును విశ్లేషించినచో, మనము బాగా గమనించవచ్చు, ప్రతి జీవి నిరంతరం వ్యాపారములో నిమగ్నమైయున్నారు వేరొక జీవికి సేవ చేయడంలో. ఒక జీవి వేరొక జీవిని వివిధ సామర్థ్యాలలో సేవించుచున్నారు, మరియు ఇలా చేయడం వలన, జీవుడు జీవితమును ఆనందిస్తాడు. ఒక అధమ స్థాయి జంతువు మానవుని సేవించును, ఒక సేవకుడు తన యజమానిని సేవించును, ఏ' 'బి' అను యజమానిని సేవించును, 'బి' 'సి' అను యజమానిని సేవించును, 'సి' 'డి' అను యజమానిని సేవించును, ఆ విధముగా కొనసాగును. అటువంటి పరిస్థితుల్లో, మనము చూడగలము ఒక మిత్రుడు వేరొక మిత్రుని సేవించును, మరియు ఒక తల్లి తన పుత్రుని సేవించును, లేదా ఒక భార్య తన భర్తను సేవించును, లేదా ఒక భర్త తన భార్యని సేవించును. మనము ఇదే భావనలో శోధించినచో, అది కనిపిస్తుంది జీవుల సంఘములో ఎవరునూ సేవా కార్యక్రమము నుండి మినహాయింపబడలేదు రాజకీయనేత ప్రజలకు తన సేవా సమర్ధతపై మేనిఫెస్టోను ముందర ఉంచును ఓటర్లకు తన సేవా సమర్థతపై విశ్వాసము కలిగించును ఓటర్లు కూడా తమ అమూల్యమైన ఓటును రాజకీయనేత సంఘమునకు సేవ చేస్తాడనే ఆశతో ఓటు వేస్తారు వర్తకుడు వినియోగదారునికి సేవచేస్తాడు. శ్రామికుడు పెట్టుబడిదారునికి సేవ చేస్తాడు పెట్టుబడిదారుడు కుటుంబమును సేవించును మరియు కుటుంబమువారు నిత్య జీవులుగా తమ పరిధిలో దేశ సేవ చేయుదురు ఈ విధముగా ఏ జీవుడు కూడా ఇతర జీవులను సేవించుట నుండి మినహాయింపబడలేదు కనుక సేవ అనునది జీవుని శాశ్వత సహచరమని మనము నిర్దారించవచ్చును కావున మనము క్షేమముగా నిర్దారించవచ్చును జీవుడు సేవచేయుట అనునది జీవుని శాశ్వత ధర్మము
మానవుడు తాను ఒక ప్రత్యేక ధర్మమునకు చెందునని చెప్పుకొనుచుండును ప్రత్యేక కాలమునకు జన్మరీత్యా తాను హిందువుని, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మతమునకు లేదా ఇతర మతస్థుడనని వాదించును కానీ అటువంటి ఉపాధులు సనాతన ధర్మము కాదు ఒక హిందువు తన మతమును ముస్లింగా మార్చుకొనవచ్చును ఒక ముస్లిం తన మతమును హిందువుగానో లేక క్రిస్టియన్ గానో మార్చుకొనవచ్చును కానీ అన్ని పరిస్థితుల యందు, తన మతమును మార్చుకొనుట అనునది ఇతరులకు సేవ చేయుటయను నిత్య ధర్మమును ఏ మాత్రము మార్చలేదు ఒక హిందువు లేదా ముస్లిం లేదా క్రిస్టియన్ అన్ని సందర్భాలలో అతడు ఎవరికో ఒకరికి సేవకుడు కావున నేను ఒక ప్రత్యేక మతవిశ్వాసమునకు చెందినవాడినని తెలుపుట సనాతన ధర్మము కాదు జీవునితో ఎల్లప్పుడు వుండే తోడు సేవ చేయుటయే. సేవ చేయుటయే సనాతన ధర్మము వాస్తవమునకు మనము సేవ ద్వారానే భగవంతునితో సంబంధము కలిగియున్నాము దేవాదిదేవుడే మహోన్నతమైన భోక్త జీవులు ఆయన యొక్క శాశ్వత సేవకులు ఆయన యొక్క ఆనందమునకు మనము సృష్టించబడితిమి భగవానునితో ఆయన శాశ్వత ఆనందములో పాల్గొన్నచో మనము కూడా ఆనందము పొందగలము. మరోలా ఆనందము రాదు స్వతంత్రముగ, ఇంతకు ముందే వివరించాము స్వతంత్రముగా ఏ అవయము కూడా, చేయి, కాళ్లు, వ్రేళ్లు లేదా శరీరములో ఏ అవయము కూడా ఉదరమునకు సహకరించకుండా, స్వతంత్రముగా ఆనందముగా ఉండలేవు అదే విధముగా జీవుడు ఎప్పటికీ ఆనందముగా ఉండలేడు భగవంతునికి భక్తియుక్త సేవ చేయకుండా ఉండలేడు భగవద్గీతలో దేవతారాధన అంగీకరించబడలేదు. ఎందుకు అనగా భగవద్గీత ఏడవ అధ్యాయము 20 వ శ్లోకములో చెప్పబడినది భగవంతుడు చెప్తున్నారు కామైస్టైస్తైర్హ్రత జ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః కామైస్ టైస్ తైర్ హ్రత జ్ఞానః ఎవరైతే కామము చేత ప్రేరేపించబడుతారో వారు మాత్రమే దేవాదిదేవుడైన కృష్ణుని కాకుండా ఇతర దేవతారాధన చేయుదురు