TE/Prabhupada 1073 - ఎప్పటి వరకైతే మనము భౌతిక ప్రకృతిపైన ఆధిపత్యము చేయాలనే భావము విడచిపెట్టమో



660219-20 - Lecture BG Introduction - New York


ఎప్పటివరకైతే మనము భౌతిక ప్రకృతిపైన ఆధిపత్యము చేయాలనే భావము విడచిపెట్టమో భగవద్గీత 15వ అధ్యాయములో మనకు భౌతిక ప్రపంచము యొక్క వాస్తవమైన వర్ణన ఇవ్వబడినది ఇలా చెప్పబడినది

ఊర్ధ్వ మూలం అధః శాఖం
అశ్వత్థము ప్రాహుర్ అవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాణి
యస్తం వేద స వేద విత్
( BG 15.1)

ఇపుడు భౌతిక ప్రపంచమును భగవద్గీత 15వ అధ్యాయములో వివర్ణించబడినది ఒక చెట్టువలె దాని యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి ఊర్ధ్వ - మూలం మీకు చెట్టు వ్రేళ్లు పైకి వుండే అనుభవం ఉన్నదా ? ప్రతిబింబములో మనకు చెట్టు యొక్క వ్రేళ్ళు పైకి ఉన్నట్లు మనకు అనుభవం వున్నది మనము నది ఒడ్డున లేదా నది జలాశయం ఒడ్డున నిలబడి ఉంటే, మనకు కనబడుతుంది నీటి జలాశయము ఒడ్డున వున్న చెట్టు ప్రతిబింబము నీటిలో చెట్టు వ్రేళ్లు పైకి శాఖలు క్రిందకి కావున ఆచరణాత్మకంగా ఈ భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచమునకు ప్రతిబింబము ఎలాగైతే నీటిలో చెట్టు యొక్క ప్రతిబింబము తలక్రిందులుగా కనబడుతున్నదో అదేవిధముగా భౌతిక ప్రపంచము, ఒక నీడ లాంటిది. నీడ ఎలాగైతే నీడలో, వాస్తవము ఎలా లేదో అదే సమయములో నీడనుంచి మనము వాస్తవము వున్నది అని అర్థము చేసుకొనవచ్చును నీడ యొక్క ఉదాహరణ, ఎడారిలో నీటియొక్క నీడ ఏమి చెపుతున్నది అంటే ఎడారిలో నీరు లేదని చెపుతుంది. కానీ నీరు ఉంటుంది అదేవిధముగా ఆధ్యాత్మిక ప్రపంచము యొక్క ప్రతిబింబములో లేదా భౌతిక ప్రపంచములో సందేహము లేకుండా, ఆనందము లేదు, నీరు లేదు కానీ నిజమైన నీరు లేదా నిజమైన ఆనందము ఆధ్యాత్మిక ప్రపంచములో వున్నది భగవంతుడు చెపుతున్నారు, ఆధ్యాత్మిక ప్రపంచమునకు ఈ విధముగా చేరవలెను, నిర్మాణ మోహ

నిర్మాణమోహ జిత సంగ దోష
ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామః
ద్వంద్వైర్ విముక్తః సుఖ దుఃఖ సంజ్ఞైర్
గచ్ఛంత్యముఢాః పదం అవ్యయం తత్
( BG 15.5)


ఆ పదం అవ్యయం, ఆ శాశ్వత ధామమును చేరుటకు, ఎవరైతే నిర్మాణ మోహ నిర్మాణ మోహ, నిర్మాణ అనగా మనము ఉపాధుల కొరకు వెళుతాము కృత్రిమంగా మనకు ఉపాధులు కావాలి కొంతమంది యజమాని అవాలి అని కొంతమంది భగవంతుడు అవాలి అని కొంతమంది అధ్యక్షుడు అవాలి అని మరియు కొంతమంది ధనవంతులు కావాలి అని, కొంతమంది ఇంకేదో కావాలి అని, రాజు కావాలి అని ఇవి అన్ని ఉపాధులు, ఎప్పటి వరకు అయితే మనకు ఈ ఉపాధుల కొరకు బంధము ఉంటుందో కారణము ఏమైనప్పటికి ఈ ఉపాధులు శరీరమునకు సంబంధించినవి. మనము శరీరము కాదు ఈ జ్ఞానము ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ కావున జీవునికి ఉపాధుల కొరకు ఆకర్షణ ఉండకూడదు మరియు జిత సంగ దోష, సంగ దోష మనము మూడు గుణాల యొక్క భౌతిక లక్షణాలతో సంపర్కము కలిగి వున్నాము మనము భగవంతుని సేవతో భౌతికమైన వాటికి దూరము అయినచో ఎప్పటివరకు మనము భగవంతుని సేవకు ఆకర్షితులము కామో మనము ప్రకృతి యొక్క మూడు గుణాల నుండి విముక్తులము కాము ఇందువలన భగవంతుడు చెపుతున్నారు వినివృత్త కామః కామ కోరిక వలన మనకు ఈ ఉపాధులు మరియు ఆకర్షణలు ఉంటాయి మనము భౌతిక ప్రపంచముపై ఆధిపత్యము చేయవలెను అనే కోరిక ఎప్పటివరకైతే మనము భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము ను చెలాయించాలి అనే భావనను విడచి పెట్టమో అప్పటివరకు మనము భగవంతుని ధామమునకు తిరిగి వెళ్లుటకు అవకాశము లేదు, సనాతన ధామ ద్వంద్వైర్ విముక్తః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్ఛంత్యముఢాః పదం అవ్యయం తత్ ఆ శాశ్వతమైన ధామమునకు ఈ భౌతిక ప్రపంచమువలె ఎప్పటికి నాశనము కాదు అముఢాః మాత్రమే చేరగలరు అముఢాః అంటే భ్రాంతి చెందని వారు ఎవరైతే ఈ అసత్యపు సుఖముల యొక్క ఆకర్షణలకు భ్రాంతి చెందరో మరియు భగవంతుని సేవలో స్థిరముగా వుంటారో ఆ శాశ్వతపు ధామమునకు వెళ్లుటకు సరైన వ్యక్తి ఆ శాశ్వతపు ధామములో ఎటువంటి సూర్యుడూ, చంద్రుడు, విద్యుత్ శక్తి అవసరము లేదు శాశ్వతపు ధామమునకు చేరుటకు ఇది స్వల్పమైన ఉద్దేశము