TE/Prabhupada 1074 - భౌతిక జగత్తు నందు మనము పొందుచున్నట్టి దుఃఖములన్నియు
660219-20 - Lecture BG Introduction - New York
భౌతిక జగత్తు నందు మనము పొందుచున్నట్టి దుఃఖములన్నియు దేహము వలన వస్తున్నాయి మరోక చోట భగవద్గీతలో ఈ విధముగా చెప్పబడినది
- అవ్యక్తో అక్షర ఇతి యుక్తస్తాం
- అహుః పరమమ్ గతిమ్
- యమ్ ప్రాప్య న నివర్తంతే
- తద్ధామ పరమం మమ
- ( BG 8.21)
అవ్యక్త పదముకు అర్థము, కనబడనిది వ్యక్తము కానిది భౌతిక ప్రపంచములో కొంత భాగము మనకు కనపడదు మన ఇంద్రియములు పరిపూర్ణముగా లేకపోవటము వలన ఎన్ని నక్షత్రములు ఉన్నాయో చూడలేము ఎన్ని గ్రహాలు భౌతిక ప్రపంచములో ఉన్నాయో చూడలేము కానీ వైదిక గ్రంథముల ద్వారా మనకు అన్ని గ్రహాల యొక్క సమస్త సమాచారము తెలుస్తుంది మనము నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు కానీ ఏ ఏ గ్రహాలతో మనకు సంబంధము వున్నదో వాటి గురించి వైదిక గ్రంథములలో ప్రత్యేకముగా శ్రీమద్ భాగవతంలో వివరించబడినది కానీ ఆధ్యాత్మిక ప్రపంచము, ఈ భౌతిక ఆకాశమునకు అతీతముగా వున్నది పరస్ తస్మాత్తు భావో అన్యో ( BG 8.20) కానీ ఆ కనబడని వ్యక్తము కాని, ఆ వ్యక్తము కాని ఆధ్యాత్మిక ఆకాశమే పరమమ్ గతిమ్ ప్రతి ఒకరు కోరుకొనవలెను, ఆ మహోన్నతమైన ధామమును చేరుకొనుటకు ఆశపడవలెను ఆ మహోన్నతమైన ధామమునకు చేరుకొనిన తరువాత యమ్ ప్రాప్య, మహోన్నతమైన ధామమును చేరుకున్న లేదా పొందగలిగిన వారు న నివర్తంతే అతడు ఈ భౌతిక ప్రపంచమునకు తిరిగి రాడు ఆ ప్రదేశము భగవంతుని శాశ్వత ధామము ఏ ప్రదేశమునకు వెళ్ళితే మనము తిరిగి రామో ఆ ప్రదేశము మనది అది మన గమ్యము అవవలెను మనము ప్రశ్న అడగవచ్చును భగవంతుని మహోన్నతమైన ధామమునకు ఎలా వెళ్లవచ్చును ఇదికూడా భగవద్గీతలో వివరించబడినది 8 వ అధ్యాయము 5,6,7 శ్లోకములలో చెప్పబడినది భగవంతుని లేదా ఆయన ధామమునకు చేరు మార్గము అక్కడ ఇవ్వబడినది. ఈ విధముగా చెప్పబడినది
- అంతకాలే చ మామేవ
- స్మరన్ ముక్త్వా కలేవరం
- యః ప్రయాతి స మద్భావం
- యాతి నాస్త్యత్ర సంశయః
- ( BG 8.5)
అంత కాలే, జీవితము ముగిసిన తరువాత, మరణ సమయమున అంత కాలే చ మామ్ ఏవ ఎవరైతే కృష్ణుని తలచెదరో, స్మరన్, అతను గుర్తుంచుకోగలితే ఒక మరణించే వ్యక్తి మరణించే సమయమున అతను భగవంతుని రూపమును తలచుకోగలితే ఆ విధముగా తలచుకొనుచు తన శరీరమును వదిలితే అప్పుడు తప్పకుండా అతను భగవద్ధామమునకు వెళుతాడు మద్ భావం భావం అనగా ఆధ్యాత్మిక స్వభావము యః ప్రయాతి స మద్ భావం యాతి మద్ భావం అనగా ఆధ్యాత్మిక స్వభావము లేదా భగవంతుని స్వభావము ఇంతకు ముందు వివరించినట్లుగా, దేవాదిదేవుడు సచ్చిదానంద విగ్రహ ( BG 5.1) ఆయనకు రూపము వుంది కానీ ఆ రూపము శాశ్వతము సత్ మరియు సంపూర్ణ జ్ఞానము కలిగినది చిత్ మరియు సంపూర్ణ ఆనందము కలిగినది ఇప్పుడు మనము మన ప్రస్తుత శరీరమును పోల్చుకొనవచును, ఈ శరీరము సత్ చిత్ ఆనంద విగ్రహ అవునా కాదా అని కాదు ఈ శరీరము అసత్ అశాశ్వతమైనది. సత్ గా శాశ్వతముగ వుండవలసినది అసత్ గా అశాశ్వతముగా వున్నది అంతవత ఇమే దేహ ( BG 2.18) భగవద్గీత చెపుతుంది ఈ శరీరము అంతవత్ పాడైపోయేది మరియు సత్ చిత్ ఆనంద. శాశ్వతముగా వుండవలసినది అశాశ్వతముగా వున్నది చిత్ సంపూర్ణ జ్ఞానముతో వుండవలసినది, సంపూర్ణ అజ్ఞానముతో వున్నది మనకు భగవంతుని ధామము గురించి జ్ఞానము లేదు మన దగ్గర భౌతిక ప్రపంచము గురించి కూడా పరిపూర్ణ జ్ఞానము లేదు మనకు చాలా వాటి గురించి తెలియదు. కావున ఈ శరీరము అజ్ఞాని సంపూర్ణ జ్ణానము కలిగి వుండవలసినది అజ్ఞానముతో వున్నది ఈ శరీరము నాశనము అయేది, పూర్తిగా అజ్ఞానముతో వున్నది మరియు ఆనందము లేనిది పూర్తిగా ఆనందముతో వుండవలసినది అది పూర్తి కష్టాలతో వున్నది ఈ భౌతిక ప్రపంచములో మనము అనుభవించే కష్టాలు ఈ శరీరము వలననే