TE/Prabhupada 1075 - మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము



660219-20 - Lecture BG Introduction - New York

మన తరువాత జన్మను మన ప్రస్తుత జన్మ కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము భగవంతుడు చెప్తున్నారు అంత కాలేచ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం దేవాదిదేవుడైన కృష్ణుని స్మరించుతూ భౌతిక దేహమును ఎవరైతే విడుచుదురో వారు వెనువెంటనే తమ ఆధ్యాత్మిక శరీరమును పొందుదురు ( BG 5.1) సత్ చిత్ ఆనంద విగ్రహ శరీరమును విడచి పెట్టే పద్ధతి మరియు భౌతిక ప్రపంచములో మరొక శరీరమును తెచ్చుకొనే పద్ధతి కుడా ఏర్పాటు చేయబడినది తరువాత జన్మలో ఎట్టి దేహము పొందవలెనో నిర్ణయించిన పిమ్మటనే మానవుడు మరణించును కానీ దానిని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు మన కర్మలను అనుసరించి మనము పతనము చెందుతాము లేదా ఉద్ధరించబడుతాము అదేవిధముగా మన కర్మముల వలన ఈ జన్మలో కర్మలు రాబోవు జన్మకు పునాది రాబోవు జన్మను ఈ జన్మలో కర్మల ద్వారా తయారు చేసుకుంటున్నాము కావున ఈ జన్మలో భగవంతుని ధామమునకు వెళ్లుటకు తయారుచేసుకొన్నచో తప్పనిసరిగా ఈ భౌతిక శరీరమును వదలి వెళ్ళేటపుడు, వదిలిన తరువాత భగవంతుడు చెబుతున్నారు యః ప్రయాతి ఎవరైతే వెళుతారో స మద్ భావం యాతి ( BG 8.5) మద్ భావం అతడు భగవంతునివలె ఆధ్యాత్మిక శరీరమును లేదా ఆధ్యాత్మిక స్వభావమును పొందుతాడు ఇంతకు ముందే వివరించినట్లు ఆధ్యాత్మిక వాదులు పలు విధాలుగా వున్నారు బ్రహ్మవాదులు పరమాత్మవాదులు మరియు భక్తులు ఆధ్యాత్మిక ఆకాశములో బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక లోకములు వున్నాయి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములు వున్నాయి ఇదివరకే చర్చించాము ఆధ్యాత్మిక లోకముల సంఖ్య భౌతికజగత్తుకి చెందిన లోకముల సంఖ్య కంటేను ఎంతో ఎక్కువైనవి

ఈ భౌతిక ప్రపంచము ఏకాంశేన స్థితో జగత్ ( BG 10.42) ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు కేవలము నాలుగోవ వంతు నాలుగింటిలో మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచము వున్నది ఈ సృష్టి నాలుగోవ వంతులో కోట్లాది లోకములు వున్నాయి ప్రస్తుత సమయమున మనము దీనిని అనుభూతి చెందుతున్నాము ఈ విశ్వములో కోట్లాది లోకములు వున్నాయి కోట్లాది సూర్యులు నక్షత్రాలు చంద్రులు ఈ భౌతిక ప్రపంచములో వున్నాయి కానీ ఈ సమస్త సృష్టిలో భౌతిక ప్రపంచము కేవలము నాలుగోవవంతు మాత్రమే నాలుగింట మూడు భాగములు ఆధ్యాత్మిక ఆకాశములో వున్నది ఇప్పుడు ఈ మద్ భావం పరబ్రహ్మము నందు లీనమగుటను కోరుకునేవారు భగంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు మద్ భావం అనగా బ్రహ్మజ్యోతి మరియు బ్రహ్మజ్యోతిలోని ఆధ్యాత్మిక లోకములు భక్తులు ఎవరైతే భగవంతుని సాంగత్యమును ఆనందించదలచిరో వారు వైకుంఠ లోకములకు వెళ్ళుతారు అసంఖ్యాక వైకుంఠ లోకములు వున్నాయి దేవాదిదేవుడు అగు శ్రీకృష్ణ భగవానుడు విస్తృతాంశాలలో నారాయణుడిగా నాలుగు చేతులతో వివిధ నామములతో ప్రద్యుమ్న, అనిరుద్ధ, మాధవ గోవిందా.... నాలుగు చేతుల నారాయుణుడికి అసంఖ్యాక నామములు వున్నాయి ఈ లోకములలో, ఇది కూడా మద్ భావం, అది కూడా ఆధ్యాత్మిక స్వభావమే ఆధ్యాత్మికవాదులు మరణించు సమయమున అతడు బ్రహ్మజ్యోతిని గురించి ఆలోచిస్తున్నా పరమాత్మను గురించి కానీ భగవంతుడు శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఆలోచించినను పైన చెప్పబడిన వాటిలో ఏది జరిగినను వారు ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తారు భగవానునితో సన్నిహిత సంబంధమును అలవాటు చేసుకున్న భక్తులు మాత్రమే వారు మాత్రమే వైకుంఠ లోకములు లేదా గోలోక వృందావన లోకములోనికి వెళ్లుతారు భగవానుడు చెపుతున్నారు యః ప్రయాతి స మద్ భావం యాతి నాస్తి అత్ర అసంశయః ( BG 8.5) సంశయము అవసరము లేదు అపనమ్మకం ఉండకూడదు. ఇదియే ప్రశ్న

మీరు మీ జీవితము మొత్తము భగవద్గీతను చదువుతున్నారు కానీ భగవంతుడు మన ఊహకు అందని విషయములను మాట్లాడినపుడు మనము వాటిని తిరస్కరిస్తాము ఇది భగవద్గీతను చదివే విధానము కాదు అర్జునుడు పలికిన విధముగా సర్వం ఏతం రుతం మన్యే ( BG 10.14) నీవు చెప్పిన సర్వమును నేను అంగీకరిస్తాను అదేవిధముగా వినండి. భగవంతుడు చెపుతున్నారు మరణించు సమయమున ఎవరైతే తనను బ్రహ్మముగా లేదా పరమాత్మగా లేదా దేవాదిదేవునిగా స్మరించుదురో తప్పక ఆధ్యాత్మిక ఆకాశములోనికి ప్రవేశిస్తాడు ఇందు సందేహము అక్కర్లేదు ఇందు విశ్వసించకపోవటం అనేది ఉండకూడదు విధానము, సామాన్య నియమము కూడా భగవద్గీతలో వివరించబడినది ఆధ్యాత్మిక ధామమునకు వెళ్లుట ఎలా సాధ్యము జీవుడు ఎలా సాధిస్తాడు సరళముగా అంత్య కాలమున దేవాదిదేవుని స్మరిస్తూ సామాన్య విధానము కూడా చెప్పబడుటవలన

యం యం వాపి స్మరన్ భావం
త్యజతంతే కలేవరమ్ తం
తమేవైతి కౌంతేయ
సదా తద్ భావ భావితః
( BG 8.6)