TE/Prabhupada 1077 - భగవంతుడు సంపూర్ణుడు, ఆతని పేరు మరియు ఆతని మధ్య తేడా లేదు



660219-20 - Lecture BG Introduction - New York

భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయనకు మరియు అయన నామమునకు వత్యాసము లేదు శ్రీమద్భాగవతమున 'భాష్యోఽయాం బ్రహ్మ సూత్రానాం' అని అందురు అది వేదాంత సూత్రము యొక్క సహజ వ్యాఖ్యానము కావున ఈ సాహిత్యములన్నియు మన యొక్క ఆలోచనలకు మార్చుకున్నప్పుడు 'తద్భావ భావిత సదా' సదా తద్భావ భావిత ( BG 3.6) ఎల్లప్పుడూ నిమగ్నమైనటువంటి వ్యక్తి....... ఏ రకముగానైతే భౌతిక వ్యక్తి ఎల్లప్పుడు భౌతిక సాహిత్యము నందు నిమగ్నమై ఉంటాడో ఉదాహరణకు వార్త పత్రికలు, పత్రికలు మరియు కాల్పనిక నవలలు మొదలుగునునవి మరియు అనేక వైజ్ఞానిక లేదా తత్వములు ఇవన్నియు కూడా వేరు వేరు స్థాయిలలో ఉన్న ఆలోచనలు అదేవిధముగా మనము మన చదివెడి సామర్థ్యాన్ని వైదిక సారస్వతముల వైపునకు మార్చు కొన్నచో వ్యాస భగవంతుడు ప్రవేశ పెట్టినట్టి, ఎంతో కరుణతో ప్రవేశ పెట్టినట్టి అప్పుడు మరణ సమయమున భగవంతుణ్ణి తలుచుకొనుట సుసాధ్యమగును అదియే భగవంతుడు మనకు సూచిస్తున్న ఏకైక మార్గము సూచన అనలేము అది వాస్తవం నాస్త్యత్ర అసంశయః ( BG 8.5) అసంశయముగా దానియందు ఎట్టి సంశయము లేదు తస్మాత్ కావున భగవంతుడు సూచించిన దేమనగా "తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ" ( BG 8.7) మామనుస్మర యుధ్య చ' అని అర్జునునకు ఆయన సలహా ఇచ్చెను నీ యొక్క విద్యుక్త ధర్మమును విడిచిపెట్టి సదా నన్నే సరళముగ స్మరింపుము అని ఆయన చెప్పలేదు కాదు అది సూచింపబడలేదు. ఆచరణము కానీ విషయమును భగవంతుడు ఎన్నడు సూచించడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరము యొక్క పోషణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలెను. సాంఘిక క్రమము ప్రకారము నాలుగు వర్గములుగా పని విభజన చేయబడినది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సమాజములో మేధావి తరగతికి చెందినవారు, వారు వేరొక రకముగా పని చేయుచున్నారు. సమాజములో పరిపాలన తరగతికి చెందినవారు, వారు కూడా వేరొక రకముగా పనిచేయుచున్నారు. వర్తక సమాజము, ఉత్పత్తి సమాజము వారు కూడా వేరొక రకముగా పని చేయుచున్నారు మరియు శ్రామిక వర్గము వేరొక రకముగా పనిచేయుచున్నారు మనవ సమాజము నందు వారు శ్రామిక వర్గముగా గాని, లేక వర్తక వర్గముగా గాని లేక రాజనీతుజ్ఞులు, పాలనాధికారులుగా గాని లేక ఉన్నత తరగతికి చెందిన సాహితీ వృత్తి యందున్న మేధావి తరగతికి చెందిన వ్యక్తులు, వైజ్ఞానిక పరిశోధకులు, ప్రతి ఒక్కరు ఏదో ఒక పనియందు నిమగ్నమయి ఉన్నారు, మరియు జీవన సంఘర్షణ కొరకు ప్రతి ఒక్కరు పని చేయవలసిందే

కావున భగవంతుడు ఇస్తున్న సలహా ఏమిటంటే ని యొక్క వృత్తిని విడువనవసరం లేదు, కానీ అదే సమయమునందు నీవు తలుచుకొనవచ్చు కూడా మామనుస్మర ( BG 8.7) అది నిన్ను, మరణ సమయమునందు నన్ను గుర్తుంచుకొనుటకు అది నీకు సహాయపడును. నన్ను సదా గుర్తుంచుకొనుట అభ్యాసము చేయనట్లయితే నీ జీవన సంఘర్షణతో పాటుగా అపుడు అది సాధ్యము కాదు చైతన్యమహాప్రభు కూడా అదే విషయాన్ని సలహా ఇచ్చారు.కీర్తనీయ సదా హరి ( CC Adi 17.3.1) కీర్తనీయ సదా, ఎల్లప్పుడూ భగవన్నామమును జపించే అభ్యాసము ప్రతి ఒక్కరు చేయవలెను భగవన్నామములు మరియు భగవంతుడు అభిన్నములు కావున అర్జునునకు కృష్ణ భగవానుడు యిస్తున్న ఉపదేశము ఏమనగా 'మామనుస్మర' (భ.గీ 8.7) కేవలము నన్ను స్మరింపుము మరియు చైతన్యమహాప్రభువు భోదన ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణుని నామము జపించుము" ఇచ్చట కృష్ణుడు పలుకునది ఏమనగా "సదా నీవు నన్ను స్మరింపుము లేక నీవు కృష్ణుని స్మరింపుము మరియు చైతన్యమహాప్రభు చెప్పినది ఏమనగా "నీవు ఎల్లప్పుడూ కృష్ణ నామాన్ని జపించుము " కావున పరిపూర్ణ స్థాయిలో కృష్ణునికి, కృష్ణ నామము నడుమ ఎటువంటి బేధము లేదు పరిపూర్ణస్థాయి యందు ఒకదానికొకటి నడుమ వత్యాసము లేదు అదియే పరిపూర్ణస్థాయి కావున భగవంతుడు పరిపూర్ణుడు కనుక ఆయన, ఆయన నామము అభిన్నములు కావున ఆ విధముగా మనము అభ్యసించవలెను తస్మాత్ సర్వేషు కాలేషు ( BG 8.7) నిరంతరము, 24 గం మన జీవితపు కార్యకలాపములను మనము మలుచుకొనవలెను ఏ విధముగానంటే యిరువది నాలుగు గంటలు మనము దానిని గుర్తుంచుకొనునట్లు అది ఎట్లా సాధ్యము? అవును, అది సాధ్యమే. అది సాధ్యమే. యిందు నిమిత్తము ఆచార్యులు ఒక అనిశ్చిత ఉదాహరణ ఇచ్చిరి మరి ఏమిటా ఉదాహరణ ? ఇక్కడ చెప్పినదేమిటంటే పరపురుషునికి ఆకర్షణమైన ఒక స్త్రీ ఆమె భర్తను కలిగి ఉన్నప్పటికీ ఆమె పరపురుషునికి బంధన కలిగి ఉన్నది మరియు ఈ రకమయినటువంటి బంధన మిక్కిలి బలమగును దీనినే పరకీయ రసమందురు పురుషుడు లేక స్త్రీ ఈ యిరువురి విషయమునందు భార్య తప్పించి ఒక వేళ పురుషుడు పర స్త్రీ యందు బంధన కలిగి ఉన్నట్లయితే లేక స్త్రీ భర్తను తప్పించి పర పురుషునితో బంధన కలిగి ఉన్నట్లయితే ఆ బంధన మిక్కిలి బలమైనది. ఆ బంధన మిక్కిలి బలమైనది కావున ఆచార్యులు దుర్గుణము కలిగిన స్త్రీ యొక్క ఉదాహరణను ఇచ్చెదరు ఎవరికి వేరొకరి భర్త యందు బంధనము ఉండునో అదే సమయమునందు ఆమె ఎల్లప్పుడూ తలుచుచుండును ఆమె ఎల్లప్పుడూ గృహ కార్యముల యందు తీవ్రముగా నిమగ్నమయి ఉన్నట్లుగా భర్తకు ప్రదర్శించును ఆ రకముగా భర్త తన శీలమును శంకించకుండనట్లుగా ఆ రకముగా రాత్రివేళ యందు తన ప్రియుడిని కలుసుకొను సమయము గురించి ఆమె సదా స్మరించును పైగా గృహ కర్యకలాపములన్ని చక్కగా నిర్వర్తిస్తూ అదే విధముగా పరమ పతి అయినట్టి శ్రీ కృష్ణుని ప్రతి ఒక్కరు స్మరించవలెను ఎల్లప్పుడు తన భౌతిక విధులను చక్కగా నిర్వర్తిస్తూ కూడా. అది సాధ్యమే. దానికి ఒక బలమయిన ప్రేమ పూర్వక ప్రేరణ అవసరం.