TE/Prabhupada 1079 - భగవద్గీత యన్నది ప్రతిఒక్కరూ అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం
660219-20 - Lecture BG Introduction - New York
భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం భగవద్గీత లేక శ్రీమద్ భాగవతమును స్వరూప సిద్ధుడైన వ్యక్తి ద్వారా శ్రవణం చెయ్యాలి అది అప్పుడు ఒకరికి శిక్షణ ఇస్తుంది, ఒకరిని ఇరవై నాలుగు గంటలు భగవంతుడి చింతనలో ఉండుటకు తద్వారా ఒకరిని అంతిమం వరకు, అంత కాలము వరకు, పరమ భగవంతుడిని స్మరణం చేసేందుకు తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి ఒక అధ్యాత్మిక-శరీరము లభిస్తుంది ఒక అధ్యాత్మిక-శరీరము, ఏదైతే భగవంతుడి సంఘత్వములో ఉపయోగపడుతుందో అందుకే భగవంతుడు అంటారు
- 'అభ్యాసయోగయుక్తేన
- చేతసా నాన్యగామినా!
- పరమం పురుషం దివ్యం
- యాతి పార్థానుచింతయన్
- ( BG 8.8)
అనుచింతయన్ ' అంటే ఎల్లప్పుడూ అతని గురించే ఆలోచించడం అది అంత కఠినమైన పద్ధతి కాదు ఒకరు ఈ ప్రక్రియను ఈ సంప్రదాయంకి చెందిన అనుభవమైన వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి తద్ విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ (ముండక ఉపనిషధ్ 1.2.12) ఒకరు మరోకరిని సంప్రదించాలి, ఎవరైతే ముందునించే దీనిని అభ్యసిస్తున్నారో అందుకే 'అభ్యాస్ యోగ యుక్తేన దీనినే 'అభ్యాస్ యోగా' అంటారు, అంటే అభ్యసించడం అభ్యాసం........ ఎల్లప్పుడూ దేవదేవుడుని ఎలా గుర్తుంచుకోవాలి చేతసాఽనన్య గామినా ఈ మనసు ఉంది, ఆ మనసు ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది ఇటు, అటు అయితే మనిషి అభ్యసించాలి అతని మనసు ధ్యానాన్ని శ్రీకృష్ణుని స్వరూపం లేదా, శబ్దం ద్వారా ఆయన నామము మీద ఏదైతే సులభము చేయబడినదో మనసును కేంద్రీకరించుట కంటే, ధ్యానాని కన్నా - ఎందుకంటే మనసు చాలా చంచలమైంది, అటు-ఇటు పోతుంది కానీ నేను మాత్రం నా చెవులుని కృష్ణుని ధ్వని మీద కేంద్రికరిస్తాను ఇంకా అది కూడా నాకు సహాయకరముగా ఉంటుంది. ఇది కూడా అభ్యాస-యోగం చేతసా అనన్య గామినా పరమం పురుషం దివ్యం పరమ్ పురుష, అదే దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు.అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు, మనిషి ఆయనను చేరుకోవచ్చు. ‘అనుచింతయన్’ ఎల్లప్పుడూ ఆలోచించడం ద్వారా ఈ విధానాల ద్వారా, ఈ మార్గం ఇంకా అంతా భగవద్గీతలో ఉంది ఎవరికి దీని నుంచి ఏ మినహాయింపు లేదు ఈ వర్గం మనుషులే అతనిని పొందోచ్చు అని ఏమీ లేదు శ్రీ కృష్ణుని స్మరించడం అందరికి కుదుర్తుంది, శ్రీ కృష్ణుడి గురించి వినడము అందరికీ కుదుర్తుంది మరలా భగవంతుడు ఇలా భగవద్గీతలో చెప్తున్నాడు.
- 'మాం హి పార్థ వ్యపాశ్రిత్య
- యేఽపి స్యు పాపయోనయః,
- స్త్రియో వైశ్య స్తథా శూద్రాస్తేఽపి
- యాంతి పరాం గతిం
- ( BG 9.32)
- కిం పునర్బ్రాహ్మణాః
- పుణ్యా భక్తా రాజర్షయ స్తథా!
- అనిత్యమసుఖమ్ లోకం
- ఇమం ప్రాప్య భజస్వమామ్
- ( BG 9.33)
భగవంతుడు చెప్తాడు, ఏమిటంటే క్రింద శ్రేణికి చెందిన వ్యక్తి కూడా, క్రింద శ్రేణి జీవితం లేదా నీచమైన స్త్రీ కూడా లేదా ఒక వ్యాపారి కూడా లేదా ఒక కార్మికుడు వ్యాపారి వర్గం వారు, కార్మిక వర్గం వారు మరియు ఇంకా స్త్రీ వర్గం. వాళ్ళని ఒకే వర్గంలో లెక్క కడతారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతగా వృద్ధి చెంది ఉండదు కానీ భగవంతుడు చెప్తాడు, వాళ్ళు లేక వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు, ( BG 9.32) ఇదే కాకుండా వాళ్ళు లేదా వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా లేదా ఎవరైనా, అది ముఖ్యం కాదు. అతను ఎవరైనా ఆమె ఎవరైనా ఎవరైనా ఈ భక్తి యోగా యొక్క సూత్రములని మరియు పరమ భగవంతుడుని జీవితం యొక్క సారముగా అంగీకరిస్తారో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాన్ని ‘మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు పాపయోనయః, తేపి యాన్తి పరాం గతిం‘ ఆ పరమ్ గతి అధ్యాత్మిక జగత్తు, అధ్యాత్మిక రాజ్యం లేదా అధ్యాత్మిక ఆకాశం, ప్రతి వారు వెళ్ళవచ్చు కేవలం, మనిషి ఈ పద్ధతిని అభ్యసించాలి ఈ పద్ధతిని భగవధ్గీత చాలా చక్కగా సూచిస్తుంది. ఇంకా దీనిని అనుసరించడం ద్వారా జీవితాన్ని పరిపూర్ణమొనర్చుకొని జీవిత సమస్యలన్నిటికి శాశ్వత పరిష్కారము చేకూర్చగలడు ఇదియే పూర్తి భగవధ్గీత యొక్క సంపూర్ణ సారాంశం అందువలన. సారాంశమేమనగా భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం ’గీతా శాస్త్రమిదం పుణ్యం యఃపఠేత్ ప్రయతః పుమాన్’ ఇంకా దీని ద్వారా లాభం ఏమిటంటే, భగవధ్గీతలోని ఉపదేశములను చక్కగా పాటిస్తే జీవితం యొక్క సర్వ దుఃఖముల నుండి క్లేశముల నుండి ముక్తి కాగలడు ‘భయ శోకాధి వర్జితః’ అనగా జీవితంలో ఉండే అన్ని భయముల నుండి దూరము కాగలడు. అంతే గాక అతని తర్వాత జన్మము అధ్యాత్మికము కాగలదు
- గీతా అధ్యాయన శీలస్య
- ప్రాణాయామపరస్య చ!
- నైవ సంతిహి పాపాని
- పూర్వ జన్మ కృతాని చ
- (Gītā-māhātmya 2)
దీని వలన ఇంకో లాభం ఏమిటంటే భగవధ్గీతను చాలా నిజాయితీగా మరియు పూర్తి తీవ్రతతో, తరువాత భగవంతుని కృపతో, తన గత పాప కర్మల యొక్క ప్రతి చర్యలు తనపై ప్రభావము చూపవు