TE/Prabhupada 1060 - మానవుడు వినమ్రభావముతో పఠింపనిచో భగవద్గిత అవగతము కాజాలదు

Revision as of 21:09, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

మానవుడు వినమ్రభావముతో పఠింపనిచో భగవద్గీత అవగతము కాజాలదు సర్వమేతదృతం మన్యే ( BG 10.14) నేను తీసుకుంటాను, మీరు చెప్పినవన్ని సత్యమని నేను నమ్ముతాను దేవాదిదేవుడు అగు నీ స్వరూపమును అవగాహన చేసుకొనుట దుర్లభము అందువలన దేవతలకు కూడా నీవు తెలియబడవు దేవతలకు కూడా నీవు తెలియబడవు మానవులకంటే అధికులైన వారు కూడా భగవానుని ఎరుగజాలరు భక్తుడు కాకుండ శ్రీ కృష్ణుని అర్థము చేసుకొనుట మానవునికి ఎట్లు సాధ్యము

కనుక భగవద్గీతను శ్రీకృష్ణుని భక్తి భావముతో అంగీకరింపవలెను ఎవ్వరును తాను శ్రీకృష్ణునికి సమానుడనని భావించరాదు శ్రీకృష్ణుడు సాధారణ మానవుడని లేదా గొప్ప మహనీయుడని భావించరాదు శ్రీ కృష్ణుడు దేవాదిదేవుడు భగవద్గీత వచనములను అనుసరించి లేదా భగవద్గీతను అర్థము చేసుకొనుటకు యత్నించిన అర్జునుని వలె మనము శ్రీ కృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరింపవలెను అట్టి వినమ్రభావముతో మానవుడు వినమ్రభావముతో భగవద్గీత వినవలెను భగవద్గీతను అర్థము చేసుకొనుట కష్టము. ఇది పరమగుహ్యమైనది

భగవద్గీత అనగానేమిటి భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానము నుండి మానవులను ఉద్ధరించుటయే భగవద్గీత ముఖ్య ఉద్దేశ్యము ప్రతి యొక్కరు అనేక విధములైన దుఃఖములందు మునిగియున్నారు ఎట్లాగైతే కురుక్షేత్ర యుద్ధరంగమున అర్జునుడికి యుద్ధమనెడి కష్టము కలిగినట్లుగా అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడినందున అతనికి ఈ భగవద్గీత ఉపదేశింపబడినది అర్జునుడే కాదు ప్రతియొక్కరము భౌతిక ఆస్తిత్వము వలన ఆందోళనలతో నిండియున్నాము అసద్ గ్రహాత్. మన అస్తిత్వమే అసత్తునందు స్థితమై యున్నది వాస్తవమునకు మన అస్థిత్వము నిత్యమైనది అయినను ఏదోవిధముగా మనము ఈ అసత్తు నందు వుంచబడితిమి అసత్ అంటే ఉనికిలో లేనిది

అసంఖ్యాక మానవులలో తమ స్థితి గురించి తాము ఎవరమనెడి దాని గురించి తామెందుకు ఇటువంటి విషమ పరిస్థితుల యందు పెట్టబడితిమి అనెడి దాని గురించి తామెందుకు భాధ పడుతున్నాము అనే ప్రశ్నించే స్థాయికి రానిదే నాకు ఈ బాధలన్నీ వద్దు నేను నా బాధలన్నిటికి పరిష్కారమునకు ప్రయత్నించాను. కానీ విఫలమైనాను ఇటువంటి స్థితిలో లేకుంటే అతడు పరిపూర్ణ మానవుడిగా పరిగణించలేము మనస్సు నందు ఇటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమగును బ్రహ్మ సూత్రలో ఈ విచారణను బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మానవుని ప్రతి కార్యము విఫలమైనదిగా భావింపబడును మనస్సులో ఇటువంటి విచారణ లేకపోతే ఏ మనుషులైతే తమ మనస్సులో ఈ విధముగా విచారించరో నేను ఎవరు. నేను ఎందుకు బాధపడుతున్నాను ఎక్కడనించి వచ్చాను. లేదా మరణము తరువాత ఎక్కడికి వెళ్ళుతాను విచక్షణ కలిగిన మానవుని మనస్సులో ఈ విచారణలు ఎప్పుడు వస్తాయో అతడే భగవద్గీతను అర్థము చేసుకొనుటకు అర్హుడైన విద్యార్థి దీని కొరకు అతడు శ్రద్ధ కలిగి యుండవలెను శ్రీకృష్ణభగవానుని పట్ల అచంచలమైన గౌరవము కలిగి యుండవలెను అట్టి విద్యార్థియే అర్జునుడు, ఆదర్శ వ్యక్తి