TE/Prabhupada 1071 - మనము భగవంతునితో సహకారించుటవలన మనం ఆనందంగా ఉండవచ్చును

Revision as of 16:25, 30 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1071 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

మనము భగవంతునితో సహచర్యమును పొందుట ద్వారాను , ఆయనకు సహకారమును ఇచ్చుట ద్వారాను, మనం ఆనందంగా ఉండవచ్చును. శ్రీకృష్ణుని నామము ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన మాట శాఖకు చెందిన నామమును సూచించుట కాదు అని మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. "కృష్ణ" అను నామము అత్యున్నత ఆనందమని భావము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంత నిధియనుయు లేదా ఆనంద బండాగారమనియు నిర్దారింపబడినాడు. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాచియున్నాము. ఆనందమయో భ్యాసాత్ (వేదాంత సూత్ర 1.1.12). జీవులు లేక భగవానుడు, చైతన్యపూర్ణులమైయున్నాము, మన చైతన్యము ఆనందమును పొందుటకే. ఆనందము. భగవానుడు సర్వదా ఆనందమయుడు, కావున శ్రీకృష్ణుని సాహచార్యమును పొంది, అతనికి సహకరించినచో, అతని సాహచార్యములో భాగము పంచుకుని, ఆనంద భాగులు కాగలము. ఆనంద పూర్ణములైన తన లీలలను బృందావనము నందు ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచమున అవతరించును. ఆ దేవదేవుడు బృందావనము నందున్నప్పుడు స్నేహితులైన గోప బాలురతో అతని కార్యములు, అతని గోపికలతో, ఇతర స్నేహితులతో, అతని ఇతర బృందావన వాసులతో మరియు అతని గోవులతో, చిన్నతనపు చేష్టలతో, అలా ప్రదర్శించిన లీలలన్నియును ఆనంద పూర్నములైయున్నవి. బృందావనము మొత్తము, బృందావనవాసులందరూ కృష్ణునితో మరియు. కృష్ణుని తప్ప అవ్యుని ఎరుగకుడిరి. శ్రీకృష్ణుడు సహితం తన తండ్రిని ఆపివేసెను, నంద మహారాజు చేసెడి ఇంద్ర పూజను, జనులు ఏ దేవతను కూడా పూజిమ్పనవసరము లేదనెడి సత్యమును స్థిరపరచ కోరినందున, దేవాదిదేవుడినే అర్పింపవలెను. జనుల చరమ లక్ష్యము భగవద్ధామమును చేరుటయే కావున. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గితయందలి పంచదశో‌ధ్యాయపు 6వ శ్లోకమున,

న తద్భాసయతే సూర్యో
న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ
(భగవద్గిత 15.6)

సనాతన ఆకాశపు వర్ణన... మనము మాట్లాడేటప్పుడు మనమందరము ఆకాశము యొక్క భౌతిక భావనను కలిగియున్నాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగువాటి గురించి. సనాతన ఆకాసమునందు సూర్యుని అవసరము లేదని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః :(భగవద్గిత 15.6). సనాతన ఆకాశములో చంద్రుని అవసరం కూడా లేదు. న పావకః అంటే విద్యుత్తుగాని, ఏ విధమైన అగ్ని అవసరముగాని లేదు ఏలయన ఆ దేవదేవుని నుండి వెలువడుచున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము ఇదివరకే ప్రకాశవంతమైనది. బ్రహ్మజ్యోతి, యస్య ప్రభా (బ్రహ్మ సంహిత 5.40) దివ్య ధమపు కాంతి రేకలు . ఈ రోజులలో జనులు ఇతర గ్రహములు చేరవలెనని ప్రయత్నించుచున్నారు, దేవదేవుని దివ్య ధామమును గురించి అవగతము చేసుకొనుట కష్టము కాదు. ఆధ్యాత్మిక ఆకాశములో దేవదేవుడు నివసించు ధామము గోలోకముగా తెలుపబడినది. బ్రహ్మసంహితలో ఆ ధామము ఎంతో సౌందర్యవంతముగా వర్ణింపబడినది, గోలోక యేవ నివసతి అఖిలాత్మ భూతః (బ్రహ్మసంహిత 5.37). భగవానుడు తన దివ్య ధామమైన గోకులములో నివసిస్తున్నపటికి, కాని అతను "అఖిలాత్మ భూతః" ఈ లోకము నుండి అతనిని చేరవచ్చును. దేవదేవుడు తన సహజమైన సచ్చిదానంద రూపమును ప్రదర్శించును, అంటే (సచ్చిదానంద విగ్రహ) (బ్రహ్మసంహిత 5.1), కాబట్టి మనము ఊహించుకొనవసరము లేదు ఊహా కల్మనమా అన్న ప్రశ్నయె లేదు.