TE/Prabhupada 1071 - మనము భగవంతునితో సహకారించుటవలన మనం ఆనందంగా ఉండవచ్చును
660219-20 - Lecture BG Introduction - New York
మనము భగవంతునితో సహచర్యమును పొందుట ద్వారాను, ఆయనకు సహకారమును ఇచ్చుట ద్వారాను, మనం ఆనందంగా పొందవచ్చు. శ్రీకృష్ణుని నామము ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన శాఖకు చెందిన నామమును సూచించుట కాదు అని మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. కృష్ణ అను నామము అత్యున్నత ఆనందమని భావము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంద నిధి అనియు లేదా ఆనందభాండాగారమనియు నిర్దారింపబడినాడు. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాచియున్నాము. ఆనందమయోఽభ్యాసాత్ (వేదాంత సూత్ర 1.1.12). జీవులు లేక భగవానుడు, చైతన్యపూర్ణులమైయున్నాము, మన చైతన్యము ఆనందమును పొందుటకే. ఆనందము. భగవానుడు సర్వదా ఆనందమయుడు, కావున శ్రీకృష్ణుని సాహచర్యమును పొంది, అతనికి సహకరించినచో, అతని సాహచర్యములో భాగము పంచుకుని, ఆనంద భాగులు కాగలము. ఆనంద పూర్ణములైన తన లీలలను బృందావనము నందు ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచమున అవతరించును. ఆ దేవదేవుడు బృందావనము నందున్నప్పుడు స్నేహితులైన గోప బాలురతో అతని కార్యములు, అతని గోపికలతో, ఇతర స్నేహితులతో, అతని ఇతర బృందావన వాసులతో మరియు అతని గోవులతో, చిన్నతనపు చేష్టలతో, అలా ప్రదర్శించిన లీలలన్నియును ఆనంద పూర్ణములైయున్నవి. బృందావనము మొత్తము, బృందావనవాసులందరూ కృష్ణునితో మరియు. కృష్ణుని తప్ప అన్యుని ఎరుగకుండిరి. శ్రీకృష్ణుడు సహితం తన తండ్రిని ఆపివేసెను, నంద మహారాజు చేసెడి ఇంద్ర పూజను, జనులు ఏ దేవతను కూడా పూజింపనవసరము లేదని, దేవాదిదేవుడినే అర్పింపవలెను అనెడి సత్యమును స్థిరపరచ కోరినందున, జనుల చరమ లక్ష్యము భగవద్ధామమును చేరుటయే కావున. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీత యందలి పంచదశోధ్యాయపు 6వ శ్లోకమున,
- న తద్భాసయతే సూర్యో
- న శశాంకో న పావకః
- యద్గత్వా న నివర్తంతే
- తద్ధామ పరమం మమ
- ( BG 15.6)
సనాతన ఆకాశపు వర్ణన... మనము మాట్లాడేటప్పుడు మనమందరము ఆకాశము యొక్క భౌతిక భావనను కలిగియున్నాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగు వాటి గురించి. సనాతన ఆకాశమునందు సూర్యుని అవసరము లేదని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ( BG 15.6) సనాతన ఆకాశములో చంద్రుని అవసరం కూడా లేదు. న పావకః అంటే విద్యుత్తుగాని, ఏ విధమైన అగ్ని అవసరముగాని లేదు ఏలయన ఆ దేవదేవుని నుండి వెలువడుచున్న బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము ఇదివరకే ప్రకాశవంతమైనది. బ్రహ్మజ్యోతి, యస్య ప్రభా (బ్రహ్మ సంహిత 5.40) దివ్య ధామపు కాంతి రేఖలు. ఈ రోజులలో జనులు ఇతర గ్రహములు చేరవలెనని ప్రయత్నించుచున్నారు, దేవదేవుని దివ్య ధామమును గురించి అవగతము చేసుకొనుట కష్టము కాదు. ఆధ్యాత్మిక ఆకాశములో దేవదేవుడు నివసించు ధామము గోలోకముగా తెలుపబడినది. బ్రహ్మసంహితలో ఆ ధామము ఎంతో సౌందర్యవంతముగా వర్ణింపబడినది, గోలోక యేవ నివసతి అఖిలాత్మ భూతః (బ్రహ్మసంహిత 5.37). భగవానుడు తన దివ్య ధామమైన గోకులములో నివసిస్తున్నపటికి, కానీ అతను "అఖిలాత్మ భూతః" ఈ లోకము నుండి అతనిని చేరవచ్చును. దేవదేవుడు తన సహజమైన సచ్చిదానంద రూపమును ప్రదర్శించును, అంటే (సచ్చిదానంద విగ్రహ) (బ్రహ్మసంహిత 5.1), కాబట్టి మనము ఊహించుకొన అవసరము లేదు ఊహా కల్పన అనే ప్రశ్నయే లేదు.