TE/Prabhupada 1064 - సర్వ జీవుల యొక్క హృదయాంతరంగాలలో భగవంతుడు నివసించి ఉండును



660219-20 - Lecture BG Introduction - New York

సర్వ జీవుల యొక్క హృదయాంతరంగాలలో భగవంతుడు నివసించి ఉండును పరమ చైతన్యము, అది భగవద్గీతలో వివరింపబడును. ఒక అధ్యాయములో జీవ మరియు ఈశ్వరుని నడుమ వ్యత్యాసము వివరింపబడియున్నది క్షేత్ర, క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ గురించి వివరింపబడియున్నది, భగవంతుడు కూడా క్షేత్రజ్ఞ, లేదా చైతన్యము కలిగి ఉన్నాడు, మరియు ఆత్మలు, లేదా జీవులు, అవి కూడా చైతన్యము కలిగి ఉన్నాయి. కానీ వ్యత్యాసము ఏమనగా జీవుల యొక్క చైతన్యము వారి యొక్క శరీరం వరకే పరిమితమయి ఉన్నది, కానీ భగవంతునికి అన్ని దేహముల గురించి తెలుసును. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి ( BG 18.61)

సర్వ జీవుల యొక్క హృదయాంతరంగాలలో భగవంతుడు నివసించి ఉండును, కావున ఆయనకు ఒక నిర్దిష్ట జీవుని యొక్క కార్యకలాపములు, మానసిక కదలికల గురించి విదితమే. ఆ విషయం మనం మరువరాదు. పరమాత్మ లేక దేవాదిదేవుడు ప్రతి ఒక్కరి హృదయములో ఈశ్వరునిగా నివసించి ఉన్నాడు అన్న విషయం కూడా వివరింపబడినది, ఒక నియామకునిగా మరియు ఆయన మార్గదర్శకాన్ని ఇస్తున్నారు. ఆయన మార్గదర్శకాన్ని ఇస్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో ( BG 15.15) ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన స్తితుడై ఉన్నాడు, మరియు మనం కోరుకున్న విధముగా మనకు మార్గదర్శకాన్ని ఇస్తాడు. తను ఏమి చేయాలి అన్న విషయాన్ని జీవుడు మర్చిపోతాడు. ప్రప్రధమంగా తన పట్టుదలను ఒక దిశగా నడిచేటట్లు చేసుకుంటాడు, తరువాత తన సొంత కర్మ యొక్క చర్య ప్రతిచర్యల యొక్క జ్యంజాటంలో ఇరుక్కుంటాడు. కానీ ఒక విధమైన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, తను వేరొక విధమైన శరీరంలోకి ప్రవేశించినప్పుడు... ఏ విధముగా ఐతే మనం ఒక రకమైన దుస్తులను విడిచిపెట్టి, వేరొక రకమైన దుస్తులు ధరిస్తామో, అదేవిధముగా ఈ భగవద్గీత యందు ఈ విషయం వివరింపబడినది, వాసాంసి జీర్ణాని యథా విహాయ ( BG 2.22) ఒకరు ఏ విధముగా తను వేరు వేరు దుస్తులను మారుస్తారో, అదే విధముగా జీవులు, అవి కూడా వేర్వేరు దేహాలు మారుస్తున్నాయి. ఆత్మ యొక్క పరివర్తన మరియు గత కర్మల యొక్క చర్య ప్రతిచర్యల యొక్క ప్రభావం. కావున ఎప్పుడైతే అప్రమత్తతతో జీవుడు సత్వగుణంలో నెలకొని ఉంటాడో, అప్పుడు ఈ కార్యకలాపములు మార్చుకొనవచ్చు, మరియు ఆయనకు అర్థమవుతుంది, ఏ రకమైన కార్యకలాపములు ఆపాదించుకోవాలి అని, ఆ విధముగా ఆయన చేసుకున్నట్లయితే తన గత జన్మల యొక్క కర్మల చర్య ప్రతిచర్యలను మార్చుకోవచ్చు కావున కర్మ శాశ్వతం కాదు. ఇతర విషయాలైన, ఆ నాలుగింటిలో, ఐదు విషయాలు - ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల మరియు కర్మ - ఈ నాలుగు విషయాలు, శాశ్వతం , కానీ ఈ కర్మ, ఈ కర్మ అన్నటువంటి విషయం, అది శాశ్వతం కాదు.

ఇప్పుడు ఈ చైతన్యవంతుడైన ఈశ్వర, పరమ చైతన్యవంతుడైన ఈశ్వర, వీరి మధ్య వ్యత్యాసము, పరమ చైతన్యవంతుడైన ఈశ్వర లేదా ప్రభువు, మరియు జీవుడు, ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితులలో ఈ విధముగా ఉన్నది. చైతన్యము, భగవంతుడు మరియు జీవుల ఇరువురి చైతన్యము, అదేమనగా, ఈ చైతన్యము దివ్యమైనది. పదార్థము యొక్క సంబంధము చేత ఉత్పన్నమైనట్టి చైతన్యము అని కాదు. అది తప్పుడు అవగాహన. భౌతిక పదార్థాల మిశ్రమముచేత కొన్ని సందర్భాలలో చైతన్యము ఉత్పన్నమగును అన్నటువంటి తత్వము. భగవద్గీతలో అది అంగీకరించబడదు, వారు చేయలేరు. చైతన్యము భౌతిక పరిస్థితులు అనెడి పొర యొక్క ప్రభావం చేత తల్లకిందులుగా ప్రతిబింబించవచ్చును, ఏ రకముగా ఐతే కాంతి రంగు గాజు నుంచి ప్రతిబింబించినప్పుడు ఆ గాజు యొక వర్ణమును పోలిఉండునో, అదే విధముగా భగవంతుని యొక్క చైతన్యము,అది భౌతికముగా ప్రభావితం కాదు. భగవంతుడు, కృష్ణునివలే, ఆయన చేప్పేదేమనగా మయాధ్యక్షేణ ప్రకృతిః ( BG 9.10) ఆయన ఈ భౌతిక ప్రపంచమునందు అవతరించినప్పుడు తన చైతన్యము భౌతికముగా ప్రభావితం కాదు. ఒకవేళ ఆయన చైతన్యము భౌతికముగా ప్రభావితం అయినట్లయితే, దివ్యమైన చర్చనీయాంసమైనట్టి భగవద్గీత గురించి మాట్లాడుటకు ఆయన అనర్హుడు దివ్యమైన ప్రపంచము గురించి ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. భౌతికమైన కలుషితమైనట్టి చైతన్యము నుండి విముక్తులు కాకుండా. కావున భగవంతుడు భౌతికముగా కలుషితుడు కాడు. కానీ మన చైతన్యము, ప్రస్తుత సమయంలో, భౌతికముగా కలుషితమైనట్టిది. కావున సంపూర్ణముగా, భగవద్గీత బోధించిన విధముగా, మనము భౌతికముగా కలుషితమైనట్టి చైతన్యమును పవిత్రపరచుకొనవలెను, మరియు ఆ పరిశుద్ధ చైతన్యములో, కర్మలు చేయబడును. అది మనకు ఆనందము చేకూర్చగలదు. మనం ఆపలేము, మనం మన కార్యములను ఆపలేము. ఈ కార్యములను పవిత్రపరచుకోవలెను. మరియు ఈ పవిత్ర కార్యకలాపాలను భక్తి అని అందురు. భక్తి అనగా, అవి చూచుటకు సాధారణ కార్యములవలె గోచరించును. కానీ అవి కలుషితమైన కార్యములు కాదు, అవి పవిత్ర కార్యములు. కానీ అజ్ఞానములో ఉన్న వ్యక్తి భక్తుడు సాధారణ మనిషివలె పనిచేయునట్లు చూచును, కానీ సరిపడ జ్ఞానము లేనటువంటి వ్యక్తి, అతను తెలుసుకొనలేడు, భక్తుని కార్యములు లేదా భగవంతుని కార్యములు, అవి పదార్థము యొక్క అపవిత్రమైన చైతన్యముతో కలుషితమైనట్టివి కావు అని, త్రిగుణాల యొక్క అపవిత్రత, ప్రకృతి యొక్క రీతులు, కానీ దివ్య చైతన్యము. కావున మన చైతన్యము భౌతికముగా కలుషితమైనట్టిది, మనం అది తెలుసుకోవలెను.